గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, జులై 2017, గురువారం

నూతన ఛందములలో గర్భ కవిత 88. . . . రచన . . . శ్రీ వల్లభ

జైశ్రీరామ్.
త్రినేత్ర .నాణ్యత. స్తుతి .నృతవద. విరాగి .హితగతి. మదినిలు. వరమాత. మదిమెదలు.  గర్భ .హిమజానీ .వృత్తము.  
                                       రచన. వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.                                                                              
హిమజానీ వృత్తము.
ఎదమెదలు .సుధ వీవె హితకరి సుగుణాకరి హిమజానీ వరమాతా .
పదపడి శివతమేర్ప బ్రతుకును గలిగించుమ భ్రమరాంబా వరదాయీ. 
సుధ పద వరాశి స్తుతి కృతు లలరించుమ సుమతతిం దీర్చుమి మాతా .
నిధులొదవు బుధకీర్తి నృతమొదవుమి శోభిల. నిమిషంబుం విడనీకన్ .
                            గర్భ గత వృత్తములు
1 .ఎద మెదలు సుధ వీవె
పదపడి శివత మేర్ప
సుధ వర పద వరాశి. 
నిధు లొదవు బుధ కీర్తి.
2. హితకరిసుగుణాకకరి
బ్రతుకును కలిగించుమ .
స్తుతి కృతు లలరించుమ. 
నృత మొదవుమి శోభిల .
3. హిమజానీ వరమాతా.
భ్రమరాంబా వరమాతా .
సుమతిం దీర్చుమి మాతా. 
నిమిషంబుం విడ నీకన్ .
4. ఎదమెదలు సుధ వీవె హితకరి సుగుణాకరి. 
పదపడి శివత మేర్ప బ్రతుకును గలిగించుమ .
సుధ పద వరాశి స్తుతి కృతులలరించుమ .
నిధులొదవు బుధ కీర్తి  నృతమొదవుమి శోభిల .
5. హితకరి సుగుణాకరి హిమ జానీ వరమాతా. 
బ్రతుకును గలిగించుమ భ్రమరాంబా వరమాతా .
స్తుతి కృతు లలరించుమ సుమతిందీర్చుమి మాతా .
నృతమొదవుమి శోభిల నిమిషంబుం వీడ నికన్ .
6హితకకరి సుగుణాకరి హిమ జానీ వర మాతా యెద మెదలు సుధ వీవె .
బ్రతుకును గలిగించుమ భ్రమరాంబా వరదాయీ పదపడి శివత మేర్ప .
స్తుతి కృతు లలరించుమ సుమతిం దీర్చుమి మాతా సుధ వరపద వరాశి . 

నృతమొదవుమి శోభిల నిమిషంబుం వీడ నికన్ నిధు లొదవు బుధ కీర్తి .
7.హిమ జానీ వరమాతా యెదమెదలు సుధ వీవె 
భ్రమ రాంబా వరదాయీ పదపడి శివత మేర్ప.
సుమతిందదీర్చుమి మాతా సుధ వర పద వరాశి 
నిమిషంబుం విడనీకన్ నిధులొదవు బుధ కీర్తి. 
8.హిమజానీ వరమాతా యెదమెదలు సుధవీవె హితకరి సుగుణాకరి. 
భ్రమరాంబా వరదాయీ పద పడి శివత మేర్ప బ్రతుకును గలిగించుమ. 
సుమతిం దీర్చుమి మాతా సుధ పదవరాశి స్తుతి కృతు లలరించుమ. 
నిమిషంబుం విడనీకన్ నిధులొదవు.బుధ కీర్తి నృతమొదవుమి శోభిల. 
9. హితకరి సుగుణాకరి యెదమెదలు సుధ వీవె హిమ జానీ వరమాతా. 
బ్రతుకును కలిగించుమ భ్రమరాంబా వర దాయీ పదపడి శివత మేర్ప .
స్తుతి కృతు లలరించుమ సుమతిం దీర్చుమి మాతా సుధ పద వరాశి 
నృత మొదవుమి శోభిల నిమిషంబుం విడనీకన్ నిధు లొదవు బుధ కీర్తి

హిమజానీ  .ఉత్కృతి న.న.జ.న.న.భ.స.భ.గగ. యతులు 10.19. 
గర్భ గత వృత్తములు .
1. త్రినేత్ర .బృహతి . న.న.జ. వృ.సం. 384. 
2. నాణ్యత .బృహతి .న.న.భ. వృ.సం. 448. 
3. స్తుతి .అనుష్టుప్. స.భ.గగ.వృ.సం. 52. 
4. నృతవద. ధృతి. న.న.జ.న.న.భ. యతి .10.
5.వరాగి. అత్యష్టి. న.న.భ.జ.భ.గగ. యతి 10. 
6.హితగతి. ఉత్కృతి .న.న.భ.జ.భత.న.న.గల.యతులు.10.18.
7. మదినిలు .అత్యష్టీ. స.భ.త.న.న.గల. యతి 9.
8. వరమాత. ఉత్కృతి. స.భ.య.న.స.భ.న.స.లల. యతులు.9.18. 
9. మదిమెదలు .ఉత్కృతి .న.న.భ.న.న.జ.స.భ.గల. యతులు .10.19.  
 జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
హిమజానీ వృత్తము నుండి వెలువడిన గర్భగత కవనములు హృద్యమముగా నున్నవి .ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.