గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, జులై 2017, శుక్రవారం

నూతన ఛందములలో గర్భ కవిత 96. . . . రచన . . . శ్రీ వల్లభ

 జైశ్రీరామ్.
ఆంధ్రోన్నయ వృత్తము.రచన. వల్లభవఝల అప్పలనరసింహమూర్తి .  జుత్తాడ
సమరస భావభాసుర సమీకృత సారమాంధ్రము సమోన్నతంబిలం గనన్ 
విమల మనోజ్న భావరి విమోచిని దోషదూషిణి ప్రమాణికంబునైజనెన్
రమణిత కీర్తి వల్లరి రమాశ్రయ సూక్తి ముక్తము రమంబునై భువిం వడిన్
గమనము మంచిచూపుచు క్రమంబుగ మేలుగూర్చును క్రమోత్సుఖంబవం గనున్. 
గర్భగతవృత్తములు. 
1.సమరస భావభాసుర
విమల  మనోజ్నభావరి
రమణితకీర్తి వల్లరి
గమనము మంచిచూపు. 
2. సమీకృతసారమాంధ్రము
విమోచిని దోషదూషిణి
రమాశ్రయసూక్తిముక్తము .
క్రమంబుగ మేలు గూర్చును
3.సమోన్నతంబిలంగనన్
ప్రమాణికంబునైజనెన్
రమంబునైభువింవడిన్
క్రమోత్సుఖంబవంకనున్.
4. సమరసభావభాసుర సమీకృతసారమాంధ్రము
విమలమనోజ్న భావరి విమోచిని దోషదూషిణి
రమణితకీర్తివల్లరి రమాశ్రయసూక్తిముక్తము
గమనముమంచిచూపుచుక్రమంబుగమేలుచగూర్చును. 
5 .సమీకృతసారమాంధ్రము సమోన్నతంబిలంగనన్
విమోచినిదోషదూషిణి ప్రమాణికంబునైజనెన్
రమాశ్రయసూక్తిముక్తము రమంబునైభువింవడిన్
క్రమంబుగమేలు గూర్చును క్రమోత్సుఖంబవంగనున్. 
6.సమీకృత సామాంధ్రము సమోన్నతంబిలంగనన్ సమరసభావభాసుర.
విమోచిని దోషదూషిణి ప్రమాణికంబునైజనెన్విమలమ నోజ్నభావరి
రమాశ్రయసూక్తిముక్తము రమంబునైభువిన్వడిన్రమణితకీర్తివల్లరి
క్రమంబుగ మేలుగూర్చుక్రమోత్సుఖంబవన్గనుం గమనముమంచిచూపుచు.
7.సమోన్నతంబిలంగనం సమరసభావభాసుర
ప్రమాణికంబునైజనెం విమలమనోజ్నభావరి
రమంబునైభువిం వడిన్ రమణితకీర్తివల్లరి .
క్రమోత్సుఖంబవన్ కనున్ గమనము మంచిచూపుచు. 
8సమోన్నతమిలంగననన్ సమరసభావభాసుర. సమీకృతసారమాంధ్రము
ప్రమాణికంబునైజనెన్విమలమనోజ్నభభావవరి విమోచినిదోదూషషిణి
రమంబునైభువిన్ వడిన్ రమణితకీర్తి వల్లరి రమాశ్రయ సూక్తిముక్తము. 
క్రమోత్సుఖంబవంగనున్ గమనము మంచిచూపుచు క్రమంబుగమేలుగూర్చును.
9. సమీకృతసారమాంధ్రము సమరసభావభాసుర
విమోచినిదోషదూషిణణి విమలమోజ్నభావరి 
రమాశ్రయసూక్తిముక్తము  రమణితకీర్తివల్లరి
క్రమంబుగ మేలుగూర్చును గమనముమంచిచూపుచు. 
10.
సమీకృత సారమాంధ్రము సమరసభావభాసుర  సమోన్నతంబిలం గనన్
విమోచిని దోషదూషిణివిమలమనోజ్నభావరి ప్రమాణికంబునైజనెన్
రమాశ్రయ సూక్తిముక్తము రమణిత కీర్తి వల్లరి రమంబునై భువిం వడిన్.
క్రమంబుగమేలుగూర్చును గమనముమంచిచూపుచు క్రమోత్సుఖంబవం గనున్. 
ఆంధ్రోన్నయ .ఉత్కృతి న.జ.భ.జ.జ.భ.జ.ర.ల. యతులు 10.19.
1.చంప. బృహతి .న.జ.భ. వృ.సం. 432.
2. ద్విజభ.బృహతి .జ.జ.భ.వృ.సం.430.
3.ప్రమాణి అనుష్టుప్ వృ.సం.86.
4.నృతచర.ధృతి .యతి. 10.న.జ.భ.జ.జ.భ.
5.సమీకృత. అత్యష్టి .జ.జ.భ.జ.ర.లగ.యతి.10.
6.సారోన్నతి.ఉత్కృతి.జ.జ.భ.జ.ర.జ.న.ర.లల.యతులు..10.16.
7.భాకరి.అత్యష్టి .జ.ర.జ.న.ర.లల.యతి 9.
8.కృతసార.ఉత్కృతి .జ.ర.జ.న.ర.న.భ.ర.లల. యతులు 9.18.
9.రసజా ధృతి ..జ.జ.భ.న.జ.జ.భ. యతి10.
10.సమోన్నత. ఉత్కృతి. జ.జ.భ.న.జ.భ.జ.భ.లగ.యతులు 10.19.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.