గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, జులై 2017, సోమవారం

నూతన ఛందములలో గర్భ కవిత 85. . . . రచన . . . శ్రీ వల్లభ

జైశ్రీరామ్.
చతురిమ ద్వయ. కరుణా. సిరివశ. చతురాననా. ఆలాపనా. గమకధృతి. క్రమగమన.గమకశ్రీ. యతి భేదగమనగర్భ. లఘు షడ్వింశతివృత్తము. 
రచన.వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ. 
లఘుషడ్వింశతివృత్తము.                                                     
క్రమమగు పనులను గడగుమి గడి మిగిరి నుడువ గమకము చెడు
శ్రమగన శుభమగు జడియక సడలునె దురితము సమతగనక
భములొనరవుగన వడలక వడిశివునిగొలువు భములుతొలగు
ప్రముఖత గనెదవు వడినిల వడివడి శుభమగు భములెడమగు.
1. క్రమమగు పనులను 
శ్రమగన శుభమగు
భములొనరవు గన
ప్రముఖత గనెదవు
2. గడగుమి 
జడియక
వడలక
వడినిల.
3. గడిమిగిలినుడువ.
సడలునెదురితము
వడిశివుని గొలువు
వడివడి శుభమగు
4. గమకముచెడు
సమతగనక
భములు తొలగు. 
భములెడమగు.
5. క్రమమగు పనులను గడగుమి
శ్రమగన శుభమగు జడియక. 
భములొనరవు గన వడలక.
ప్రముఖత గనెదవు వడినిల.
6. క్రమమగుపనులను గడగుమిగడిమిగిరిన నుడువ
శ్రమగన శుభమగు జడియక సడలునెదురితము.
భములొనరవు వడలక వడి శివుని గొలువు
ప్రముఖత గనెదవు వడినిల వడి వడి శుభమగు
7. గడగుమి గడిమిగిరి నుడువ గమకము చెడు
జడియక సడలునె దురితము సమత గనక
వడలక వడి శివుని గొలువు భములు తొలగు
వడినిల వడి వడి శుభమగు భములెడమగు. 
8. గడగుమి గడిమిగిరి నుడువ  గమకము చెడు క్రమమగు పనులను 
జడియక సడలునె దురితము సమతగనక శ్రమగన శుభమగు.
వడలక వడి శివుని  గొలువు భములుతొలగు భములొనరవు గన
వడినిల వడి వడి శుభమగు భము లెడమగు ప్రముఖత గనెదవు.
9. గడిమిగిరి నుడువ గమకముచెడు క్రమ మగు పనులను గడగుమి
సడలునె దురితము సమత గనక శ్రమగన శుభమగు జడియక
వడి శివుని గొలువు భములు తొలగు భములొనరవు గన వడలక
వడివడి శుభమగు భములెడమగు ప్రముఖత గనెదవు వడినిల. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చతురిమ ద్వయ 8 అక్షరములు , కరుణా 4 " గడగుమి, జడియక, వడలక, వడినిల ,బాగుంది " ఇలా అన్నీ కలిపి " భేదగమనగర్భ, లఘు షడ్వింశతి వృత్తములుగా మలచిన విరచితములు అద్భుతము గానున్నవి .ఇవి ఎంతటి పుణ్యపురుషుల కవనములో అనునట్లు అనుభూతి. శిరసాభి వందనములు . సోదరులు అదృష్ట వంతులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.