గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, జులై 2017, ఆదివారం

గురుపూర్ణిమ శుభాకాంక్షలు.

  జైశ్రీరామ్.
శ్లో. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ||
ఆర్యులారా! శుభోదయమ్.
నేడు అత్యంత వైశిష్ట్యము కలిగిన గురు పూర్ణిమ. ఈ సందర్భముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.
ఆ.వె. తల్లిదండ్రులిలను  పిల్లలన్ గని పెంచు
జ్ఞానదీప్తినొసగు ఘనుఁడు గురువు.
వారి పాదసేవ వరలించు సతతము.
స్మరణ చేయ గురుల కరుణ కలుగు.
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.