గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, ఏప్రిల్ 2018, సోమవారం

భాసస్వర,ధనామోహ,సమజా,భవహర,దివురు,తిలక,సలలిత,శ్యామలా,రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

1 comments

జైశ్రీరామ్.
భాసస్వర,ధనామోహ,సమజా,భవహర,దివురు,తిలక,సలలిత,శ్యామలా,
శ్వేతా,కరుణవల్లి,గర్భ -"సుఖదా"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.

             -"సుఖదా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.న.భ.స.స.న.య.త.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
తెల్లటి స్ఫటిక లింగము!దివిరెన్నిడు పుండ్రము!తిలకుండై!జుత్తాడవెల్సె!
పల్లెకు శుభకరంబన?భవ దూరము చేయుచు!బలె!గాచు మల్లేశ్వరుండు!
చల్లగ జనుల గాచుచు!జవమున్శతమాయువు!సలిలంబుల్సశ్యంబొసంగి!
వల్లెగ?కరుణజూపును!భవి!సౌఖ్యమునీయును!భళెయౌ!దైవంబో?యనంగ!

1.గర్భగత"భాసస్వర"-వృత్తము.
బృహతీఛందము.భ.న.భ.గణములు.వృ.సం.447.ప్రాసగలదు.
తెల్లటి స్ఫటిక లింగము!
పల్లెకు శుభ కరంబన?
చల్లగ జనుల గాచుచు
వల్లెగ కరుణ జూపును!

2.గర్భగత"-ధనామోహ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.స.లల.గణములు.వృ.సం.220.ప్రాసగలదు.
దివిరెన్నిడు పుండ్రము!
భవ దూరము జేయుచు?
జవమున్శత మాయువు!
భవిసౌఖ్యము నీయును!

3.గర్భగత"-సమజా"-వృత్తము.
బృహతీఛందము.స.మ.జ.గణములు.వృ.సం.324.ప్రాసగలదు.
తిలకుండై!జుత్తాడ వెల్సె!
బలె!గాచున్మల్లేశ్వరుండు!
సలిలంబుల్సశ్యంబొసంగి!
భళెయౌ?దైవంబో?యనంగ!

4.గర్భగత"-భవహర"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.న.భ.స.స.లల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
తెల్లటి స్ఫటిక లింగము!దివిరెన్నిడుపుండ్రము?
పల్లెకు శుభకరంబన?భవదూరము జేయుచు?
చల్లగ జనుల గాచుచు!జవమున్శత మాయువు?
వల్లెగ కరుణ జూపును!భవిసౌఖ్యము నీయును!

5.గర్భగత"-దివురు"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.న.య.త.గల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమము గలదు!
దివిరెన్శిడు పుండ్రము!తిలకుండై?జుత్తాడ వెల్సె?
భవ!దురము జేయుచు!బలె?గాచున్మల్లేశ్వరుండు?
జవమున్శతమాయువు!సలిలంబుల్సశ్యంబొసంగి?
భవి!సౌఖ్యము నీయును!భళెయౌ!దైవంబో?యనంగన్?

6.గర్భగత"-తిలక"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.న.య.త.ర.న.స.లల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
దివిరెన్నిడు!పుండ్రము!తిలకుండై!జుత్తాడ వెల్సె?తెల్లటి!స్ఫటిక లింగము!
భవ!దూరము జేయుచు!బలె?గాచున్మల్లేశ్వరుండు?పల్లెకు!శుభకరంబన?
జవమున్శతమాయువు!సలిలంబుల్సశ్యంబొసంగి!చల్లగ!జనుల గాచుచు?
భవి!సౌఖ్యము నీయును!భళెయౌ!దైవంబో?యనంగ!వల్లెగకరుణ!జూపును!

7.గర్భగత"-సలలిత"-వృత్తము.
ధృతిఛందము.స.మ.జ.భ.న.భ.గణములు.యతి10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
తిలకుండై!జుత్తాడ వెల్సె?తెల్లటి!స్ఫటిక లింగము!
బలె?గాచున్మల్లేశ్వరుండు?పల్లెకు!శుభకరంబన?
సలిలంబుల్సశ్యంబొసంగి!చల్లగ!జనుల!గాచుచు?
భళెయౌ?దైవంబో?యనంగ!వల్లెగ!కరుణజూపును!

8.గర్భగత"-శ్యామలా"-వృత్తము
ఉత్కృతిఛందము.స.మ.జ.భ.న.భ.స.స.లల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
తిలకుండై!జుత్తాడ వెల్సె?తెల్లటి!స్ఫటిక లింగము!దివిరెన్నిడు పుండ్రము!
బలె?గాచున్మల్లేశ్వరుండు?పల్లెకు!శుభకరంబన?భవ!దూరము జేయుచు!
సలిలంబుల్సశ్యంబొసంగి!చల్లగ!జనుల!గాచుచు?జవమున్శత మాయువు!
భళెయౌ?దైవంబో?యనంగ!వల్లెగ!కరుణజూపును!భవి!సౌఖ్యము!నీయును?

9.గర్భగత"-శ్వేతా"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.స.న.స.లల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
దివిరెన్నిడు పుండ్రము!తెల్లటి!స్ఫటిక లింగము!
భవ దూరము జేయుచు!పల్లెకు!శుభకరంబన?
జవమున్శతమాయువు!చల్లగ!జనుల!గాచుచు?
భవి!సౌఖ్యము!నీయును?వల్లెగ?కరుణ!జూపును!

10.గర్భగత"-కరుణవల్లి"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.స.న.స.న.య.త.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
దివిరెన్నిడు పుండ్రము!తెల్లటి!స్ఫటిక!లింగము!తిలకుండై!జుత్తాడ!వెల్సె?
భవదురము!జేయుచు!పల్లెకు!శుభకరంబన!బలె?గాచున్మల్లేశ్వరుండు?
జవమున్శత మాయువు!చల్లగ!జనుల!గాచుచు?సలిలంబుల్సశ్యంబొసంగి?
భవిసౌఖ్యమునీయును?వల్లెగ! కరుణజూపును!భళెయౌ?దైవంబో?యనంగ?
స్వస్తి.
మూర్తి . జుత్తాడ.   
జైహింద్.         

8, ఏప్రిల్ 2018, ఆదివారం

మత్తరజినీ,గతికా,భూజావర,సునీతినీ,శోభనెట్టు,నీతినెమరు,కొమరుగొల్పు,కాటివాటి,నీతిగా,మత్తతా,గర్భ మంచినెట్టు వృత్తము. రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

1 comments

 జైశ్రీరామ్.
మత్తరజినీ,గతికా,భూజావర,సునీతినీ,శోభనెట్టు,నీతినెమరు,కొమరుగొల్పు,కాటివాటి,నీతిగా,మత్తతా,గర్భ మంచినెట్టు వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                                                      జుత్తాడ.

              -"మంచి నెట్టు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.ర.జ.ర.న.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు. 
కాటి వాటి వాటమెంచగా!కమత సేధ్యమెందుకంచు?కట్టుకట్టి!బ్రతుకుచున్?
నీటి నింకజేసి!గొప్పగా?నెమరువేసి!నీతి మాట?  నెట్టి!  శోభ  జగతినిన్?
కొట్టి పారవేసి!సూక్తముం?కొమరుగొల్ప?గర్భ శోధ!గుట్టు దాపరికములన్?
పట్టుదీయ!భూగతంబనం?ప్రమదులౌచుమత్తునొప్పివట్టిమాటలలరుచున్?

1.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
కాటి వాటి వాట మెంచగా!
నీటి నింకజేసి!గొప్పగా!
కొట్టి పారవేసి!సూక్తమున్?
పట్టు దీయభూగతంబనన్?

2.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.ప్రాసగలదు.
కమత సేధ్య మెందుకంచు?
నెమరు వేసి!నీతి మాట!
కొమరు గొల్ప!గర్భ శోధ?
ప్రమదు లౌచు?మత్తు నొప్పి!

3.గర్భగత"-భూజావర"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.న.లగ.గణములు.వృ.సం.123.ప్రాసగలదు.
కట్టు కట్టి !బ్రతుకుచున్?
నెట్టి శోభ!జగతినిన్?
గుట్ట!దాపరికములన్?
వట్టి!మాట లలరుచున్

4.గర్భగత"సునీతినీ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.న.ర.జ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కాటి వాటి వాస!మెంచగా!కమత సేధ్య !మెందుకంచు?
నీటి నింక జేసి!గొప్పగా! నెమరు వేసి!నీతి మాట?
కొట్టి పారవేసి!సూక్తముం?కొమరు గొల్ప?గర్భ శోధ!
పట్టు!దీయ భూగతంబననం?ప్రమదులౌచు?మత్తునొప్పి?

5.గర్భగత"-శోభనెట్టు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.ర.న.లగ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కమత సేధ్య మెందుకంచు?కట్టుకట్టి !బ్రతుకుచున్?
నెమరువేసి! నీతిమాట?  నెట్టిశోభ?   జగతినిన్?
కొమరు గొల్ప?గర్భశోధ?గుట్టు దాపరికములన్?
ప్రమదులౌచు?మత్తునొప్పి!వట్టి మాటలలరుచున్?

6.గర్భగత"-నీతినెమరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.న.య.జ.ర.లగగఢణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
కమత సేధ్యమెందుకంచు?కట్టుకట్టి!బ్రతుకుచుం?కాటివాటి!వాటమెంచగా?
నెమరువేసి!నీతిమాట!నెట్టిశోభ! జగతినిం?  నీటి నింక జేసి!  గొప్పగా?
కొమరు గొల్ప!గర్భశోధ?గుట్టు దాపరికముం?కొట్టి పారవేసి!సూక్తమున్?
ప్రమదులౌచు!మత్తునొప్పివట్టిమాట!లలరుచుం?పట్టుదీయ!భూతలంబనన్?

7.గర్భగత"-కొమరుగొల్పు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.న.య.జ.ర.లగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కట్టుకట్టి!బ్రతుకుచుం?కాటివాటివాటమెంచగా?
నెట్టిశోభ?జగతినిం?నీటి నింకజేసి!గొప్పగా?
గుట్టు దాపరికముం?కొట్టి పారవేసి!సూక్తమున్?
వట్టిమాట లలరుచుం?పట్టుదీయ!భూతలంబనన్?

8.గర్భగత"-కాటివాటి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.య.జ.ర.జ.స.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కట్టుకట్టి!బ్రతుకుచుం?కాటివాటి వాటమెంచగా?కమత సేధ్యమెందు కంచు?
నెట్టిశోభ!జగతి నిం?నీటి నింక జేసి! గొప్పగా?  నెమరువేసి!  నీతి మాట!
గుట్టు దాపరికములంకొట్టి పారవేసి! సూక్తముం?కొమరు గొల్ప!గర్భశోధ!
వట్టి మాటలలరుచుం!పట్టుదీయ!భూతలంబనం?ప్రమదులౌచుమత్తునొప్పి?

9.గర్భగత"-నీతిగా"-వృత్తము.
ధృతిఛందము.న.ర.జ.ర.జ.ర.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదలదు.
కమత సేధ్య మెందుకంచు?కాటివాటి వాట మెంచగా?
నెమరు వేసి! నీతి మాట! నీట  నింక జేసి!  గొప్పగా?
కొమరు గొల్ప! గర్భ శోధ?కొట్టి పారవేసి!సూక్తమున్?
ప్రమదు లౌచు?మత్తునొప్పి?పట్టుదీయ?భూతలంబనన్?

10.గర్భగత"-మత్తతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.ర.న.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కమత సేధ్యమెందుకంచుకాటివాటి!వాటమెంచగా?కట్టుకట్టి!బ్రతుకుచున్!
నెమరువేసి!నీతిమాట!నీట నింకజేసి?గొప్పగా?నెట్టి !శోభ!జగతినిన్?
కొమరు గొల్ప గర్భశోధ?కొట్టి పారవేసి!సూక్తముం?గుట్టు దాపరికములన్?
ప్రమదులౌచు!మత్తునొప్పి?పట్టుదీయ!భూతలంబనం!వట్టిమాటలలరుచున్?
 స్వస్తి.
 జైహింద్.

7, ఏప్రిల్ 2018, శనివారం

గతికా,భాసిజ,సమాశ్రీ,భావస్ఫురణ,సఖియా,నెడదనిడు,కల్మినెంచు,బడుగుజీవ,మాతౄణ,గర్భ -"జీవధాత్రి"-వృత్తము.రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

1 comments

జైశ్రీరామ్.
గతికా,భాసిజ,సమాశ్రీ,భావస్ఫురణ,సఖియా,నెడదనిడు,కల్మినెంచు,బడుగుజీవ,మాతౄణ,గర్భ -"జీవధాత్రి"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
          -"జీవధాత్రి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.భ.స.జ.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కడుపుజూచు కన్నతల్లి!కల్మి,సుఖము కోరు భార్య!కన్నవారు!సంపదెంత్రు?
బడుగు జీవియైన గాని!బల్మి తనదు స్వేచ్ఛ నెంచు?బన్నమెంచరెంతకైన?
గడప దాటనీని!గుట్టు!కల్మషమును దొల్గజేయు?కన్న తల్లిదండ్రు లైన?
చెడునుజీల్చు!జీవధాత్రి!చెల్మి సఖియ! తోడునీడ!చిన్నచూపు!దోషమోపు!

1.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.ప్రాసగలదు.
కడుపుజూచు!కన్న తల్లి!
బడుగు జీవి యైనగాని!
గడప దాటనీని గుట్టు!
చెడునుజీల్చు!జీవధాత్రి?

2.గర్భగత"-భాసిజ"-వృత్తము.
బృహతీఛందము.భ.స.జ.గణములు.వృ.సం.351.ప్రాసగలదు.
కల్మి,సుఖము కోరు భార్య!
బల్మి తనదు స్వేచ్ఛ నెంచు!
కల్మషమును!దొల్గజేయు!
చెల్మి సఖియ!తోడునీడ!

3.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
కన్నవారు!సంపదెంత్రు?
బన్న మెంచ రెంతకైన?
కన్నతల్లిదండ్రులైన?
చిన్నచూపు!దోషమోపు!

4.గర్భగత"-సుఖాశ్రి"-వృత్తము.
ధృతి ఛందము.న.ర.జ.భ.స.జ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కడుపు జూచు!కన్నతల్లి!కల్మి,సుఖము!కోరు!భార్య!
బడుగు జీవియైనగాని?బల్మి తనదు స్వేచ్ఛ నెంచు!
గడప దాటనీని గుట్టు?కల్మషమును దొల్గజేయు!
చెడును జీల్చు!జీవధాత్రి?చెల్మి సఖియ తోడునీడ!

.5.గర్భగత"-భావస్ఫురణ"-వృఛందము
అత్యష్టీఛందము.భ.స.జ.ర జ.గల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కల్మి,సుఖము కోరు భార్య!కన్నవారు సంపదెంత్రు?
బల్మి తనదు స్వేచ్ఛనెంచు!బన్న మెంచ రెంతకైన?
కల్మషమును దొల్గజేయు!కన్న తల్లిదండ్రులైన?
చెల్మి సఖియ తోడునీడ!చిన్నచూపు దోషమోపు?

6.గర్భగత"-సఖియా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.జ.ర.జ.భ.స.జ.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
కలిమి, సుఖము కోరుభార్య!కన్నవారు!సంపదెంత్రు?కడుపుజూచు!కన్నతల్లి!
బల్మి!తనదు!స్వేచ్ఛ!నెంచు!బన్నమెంచ!రెంతకైన?బడుగు!జీవియైన గాని?
కల్మషమును!దొల్గజేయు!కన్న తల్లిదండ్రు లైన?గడప దాటనీని గుట్టు?
చెల్మి సఖియ!తోడునీడ!చిన్న చూపు!దోషమోపు?చెడును!జీల్చు!జీవధాత్రి?

7.గర్భగత"-నెడదనిడు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.స.జ.గల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కన్నవారు!సంపదెంత్రు?కడుపు జూచు కన్నతల్లి!
బన్నమెంచ రెంతకైన?బడుగు జీవి యైనగాని?
కన్నతల్లిదండ్రులైన?గడప దాట నీని గుట్టు?
చిన్న చూపు!దోషమోపు?చెడును జీల్చు జీవ ధాత్రి?

8.గర్భగత"-కల్మినెంచు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.స.జ.ర.న.జ.గల.గణములు.యతులు.9,18
ప్రాసనీమముగలదు.
కన్నవారు!సంపదెంత్రు?కడుపుజూచు!కన్నతల్లి!కల్మి,సుఖము!కోరు!భార్య!
బన్నమెంచ! రెంతకైన?బడుగు!జీవి !యైనగాని?బల్మి తనదు! స్వేచ్ఛనెంచు!
కన్నతల్లిదండ్రులైన?గడప దాటనీని గుట్టు? కల్మషమును!దొల్గ జేయు!చిన్నచూపు!దోషమోపు?చెడునుజీల్చు!జీవధాత్రి?చెల్మిసఖియ!తోడునీడ!

9.గర్భగత"బడుగుజజీవ"-వృత్తము.
ధృతిఛందము.భ.స.జ.న.ర.జ.గణములు.యతి.10.వ.యక్షరము
ప్రాసనీమముగలదు.
కల్మి ,సుఖముగోరు భార్య!కడుపు జూచు!కన్నతల్లి?
బల్మి తనదు!స్వేచ్ఛనెంచు?బడుగుజీవియైనగాని?
కల్మషమును!దొల్గజేయు! గడప దాటనీని గుట్టు?
చెల్మి సఖియ!తోడునీడ!చెడును జీల్చు!జీవధాత్రి?

10.గర్భగత"-మాతౄణ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.జ.న.ర.జ.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కల్మి,సుఖము!కోరుభార్య!కడుపుజూచు!కన్నతల్లి!కన్నవారు!సంపదెంత్రు?
బల్మి!తనదు!స్వేచ్ఛ నెంచు?బడుగుజీవియైనగాని?బన్నమెంచరెంతకైన?
కల్మషమును!దొల్గజేయు!గడప దాటనీని గుట్టు?కన్నతల్లిదండ్రులైన?
చెల్మి సఖియ!తోడునీడ!చెడును !జీల్చు జీవధాత్రి?చిన్నచూపు!దోషమోపు?
 స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

6, ఏప్రిల్ 2018, శుక్రవారం

భారణా,ఉత్సుక,పరనిందా,పూర్ణోత్పల,లక్షణా,భిక్షుకతీరు,నేర్పులీలా,లౌకికవాద,రంబకా,శోభాకర,గర్భ"ఉత్పలోన్నత"వృత్తము.రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

1 comments

జైశ్రీరామ్
భారణా,ఉత్సుక,పరనిందా,పూర్ణోత్పల,లక్షణా,భిక్షుకతీరు,నేర్పులీలా,లౌకికవాద,రంబకా,శోభాకర,గర్భ"ఉత్పలోన్నత"వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
" ఉత్పలోన్నత"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.న.భ.భ.ర.న.త.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
లౌకికవాద సంకలన!లక్షణ లక్ష్యము చేరుచో?లలితమౌ!భూతలినిన్?
శ్రీకర శోభకాకరత!శిక్షణ పాత్రము నందగా!చెలువమై!మేలొనరున్!
ప్రాకట లీల!నేర్పుగన! భక్షణగల్గు!ప్రపూర్ణతం!బలమదే!జాతికి నౌ?
వే కదలం వలెం?ప్రభల! భిక్షుక!తీరుకు దూరమై?విలువదే?భారతికిన్!

1.గర్భగత"-భారణా"-వృత్తము.
బృహతీఛందము.భ.ర.న.గణములు.వృ.సం.471.ప్రాసగలదు.
లౌకికవాద సంకలన
శ్రీకర శోభకాకరత!
ప్రాకటలీల!నేర్పుగన!
వే కదలంవలె! ప్రభల!

2.గర్భగత"-ఉత్సుక"-వృత్తము.
బృహతీఛందము.భ.భ.ర.గణములు.వృ.సం.183.ప్రాసగలదు.
లక్ణణ!లక్ష్యము చేరుచో?
శిక్షణ పాత్రము నందగా!
భక్షణగల్గు?ప్రపూర్ణతన్!
భిక్షుక!తీరుకు?దూరమై!

3.గర్భగత"-పరనిందా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.త.లగ.గణములువృ.సం.104.ప్రాసగలదు.
లలితమౌ!భూతలినిన్!
చెలువమై!మేలొనరున్?
బలమదే!జాతికి నౌ!
విలువదే?భారతికిన్!

4.గర్భగత"-పూర్ణోత్పల"-వృత్తము
ధృతిఛందము.భ.ర.న.భ.భ.ర.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
లౌకిక వాద సంకలన!లక్షణ లక్ష్యము చేరుచో?
శ్రీకర శోభకాకరత!శిక్షణ పాత్రము నందుగా?
 ప్రాకటలీల!నేర్పుగన!భక్షణ గల్గు ప్రపూర్ణతన్?
వే కదలంవలెం?ప్రభల!భిక్షుక తీరుకు దూరమై?

5.గర్భగత"-లక్షణా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.ర.న.త.లగ.గణములు.యతి.10.వయక్షరము
ప్రాసనీమముగలదు.
లక్షణ లక్ష్యము చేరుచో?లలితమౌ?భూతలినిన్?
శిక్షణ పాత్రము నందునుగా?చెలువమై!మేలొనరున్!
భక్షణ గల్గు!ప్రపూర్ణతన్?బలమదే?జాతికి నౌ!
భిక్షుక తీరుకు దూరమై?విలువదే? భారతికిన్!

6.గర్భగత"-భిక్షుకతీరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.న.త.య.స.జ.లల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
లక్షణ లక్ష్యము చేరుచో?లలితమౌ?భూతలినిం?లౌకిక వాదసంకలన!
శిక్షణ పాత్రము నందునుగా?చెలువమై మేలొనరుం?శ్రీకర!శోభకాకరత?
భక్షణ గల్గు ప్రపూర్ణతం?బలమదే?జాతికి నౌ?ప్రాకటలీల  నేర్పుగన?
భిక్షుక తీరుకు? దూరమై? విలువదే?భారతికిం?వే కదలం వలెంప్రభల?

7.గర్భగత"-నేర్పులీలా"-వృత్తము.
అత్యష్టీఛందము.న.త.య.స.జ.లల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
లలితమౌ? భూతలినిం లౌకిక  వాద  సంకలన!
చెలువమై?మేలొనరుం?శ్రీకర శోభకా కరత!
బలమదే?జాతికి నౌ? ప్రాకట లీల నేర్పుగన?
విలువదే?భారతికిం? వే కదలం వలెంప్రభల?

8.గర్భగత"-లౌకిక వాద"- వృత్తము.
ఉత్కృతిఛందము.న.త.య.స.జ.స.స.స.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
లలితమౌ?భూతలినిం?లౌకికవాద సంకన!లక్షణ లక్ష్యము చేరుచో?
చెలువమై?మేలొనరుం?శ్రీకరశోభకా!కరత!శిక్షణ పాత్రము!నందుగా?
బల మదే?జాతికి నౌ?ప్రాకట లీల నేర్పుగన?భక్షణగల్గు?ప్రపూర్ణతన్?
విలువదే?భారతికిం? వే! కదలం  వలెంప్రభల? భిక్షుక తీరుకు! దూరమై?

9.గర్భగత"-రంబకా"-వృత్తము.
ధృతిఛందము.భ.భ.ర.భ.ర.న.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
లక్షణ లక్ష్యము చేరుచో?లౌకిక వాద! సంకలన!
శిక్షణ పాత్రము నందుగా?శ్రీకర శోభకాకరత?
భక్షణ గల్గు?ప్రపూర్ణతం?ప్రాకట లీల నేర్పు గన?
భిక్షుక తీరుకు దూరమై?వే కదలం వలెం!ప్రభల?

10.గర్భగత"-శోభాకర"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.భ.ర.న.న.త.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
లక్షణ లక్ష్యము చేరుచో?లౌకిక వాద సంకలన!లలితమౌ?భూతలినిన్?
శిక్షణ పాత్రము నందుగా?శ్రీకర శోభాకరత?చెలువమై!మేలొనరున్?
భక్షణ గల్గు?ప్ర పూర్ణతం?ప్రాకట లీల నేర్పుగన?బలమదే!జాతికి నౌ?
భిక్షుక తీరుకు దూరమై?వే కదలం  వలెం?ప్రభల?విలువదే?భారతికిన్?
స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

5, ఏప్రిల్ 2018, గురువారం

కలినింద,గర్భ-"రాజీవ"-వృత్తము. రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

1 comments

జైశ్రీరామ్
జుత్తాడ.కలినింద,గర్భ-"రాజీవ"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

                "  రాజీవ " వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.జ.ర.జ.ర.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కల్లబొల్లి కబురు లాడి!కట్టుదప్పి నీతినీమముల్!కలి"-కి!నిందమోపుచున్?
చెల్లుబాటు తమకు కాగ!చెట్టపట్టి!నీర్ష్య ద్వేషముల్!చెలిమి!బల్మినుల్ముచున్?
జల్లునేలకురియకున్న?చట్ట"సానుకూల్య!మార్పులం!చలితబుద్ధి!నేర్చుచున్?
తల్లి!గర్భగతము!పొంద!దట్టమౌనె?భావిజీవముల్!తలపరై రదేలనో? 

కలి=కల్యవతారము,జల్లు=వానజల్లు,చలితబుద్ధి=అస్థిరజ్ఞానము,
చట్టసానుకూల్య=శాశనములు వారికనుకూలముగ,తల్లిగర్భగత=
భూమాత గర్భముదుగల,మణిమాదులు,(ప్రకృతి వనరులు).

1.గర్భగత"-భ్రమక"-వృత్తము.
బృహతీఛందము.ర.న.జ.గణములు.వృ.సం.379ప్రాసనగలదు.
కలబొల్లి!కబురు లాడి!
చెల్లుబాటు!తమకు!కాగ?
జల్లు నేల!కురియకున్న?
తల్లి!గర్భ గతము!పొంద?

2.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
కట్టుదప్పి!నీతి నీమముల్?
చెట్టపట్టి!నీర్ష్య ద్వేషముల్!
చట్టసానుకూల్య మార్పులన్!
దట్ట!మౌనె?భావి జీవముల్!

3.గర్భగత"-అనఘా"- వృత్తము.
అనుఅప్ఛందము.న.ర.లగ.గణములు.వృ.సం.88.ప్రాసగలదు.
కలి"-కి!నింద మోపుచున్?
చెలిమి!బల్మి నుల్ముచున్!
చలిత!బుద్ధి నేర్చుచున్!
తలప!రై ,రదేలనో?

4.గర్భగత"-పాత్రతా"-వృత్తము.
ధృతిఛందము.ర.న.జ.ర.జ.ర.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కల్లబొల్లి కబురులాడి!కట్టుదప్పి నీతినీమముల్?
చెల్లుబాటు!తమకు కాగ!చెట్టపట్టి!నీర్ష్య ద్వేషముల్?
జల్లు నేల కురియకున్న?చట్ట సానుకూల్య మార్పులన్!
తల్లి గర్భగతము!పొంద!దట్టమౌనె?భావి జీవముల్!

5.గర్భగత"-రజరోన్నర"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.న.ర.లగ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కట్టుదప్పి!నీతినీమముల్?కలి"కి!నిందమోపుచున్?
చెట్టపట్టి!నీర్ష్య ద్వేషముల్?చెలిమి!బల్మి నుల్ముచున్?
చట్ట!సానుకూల్య మార్పులం?చలిత బుద్ధి!నేర్చుచున్?
దట్ట మౌనె?భావిజీవముల్? దలప  రై   రదేలనో?

6.గర్భగత"-సురశోభా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.ర.య.జ.న.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
కట్టుదప్పి!నీతినీమముల్కలి"కి!నిందమోపుచున్?కల్లబొల్లి!కబురులాడి!
చెట్టపట్టి!నీర్ష్యద్వేషముల్?చెలిమి!బల్మి నుల్ముచుం?చెల్లుబాటు!తమకుకాగ!
చట్ట సానుకూల్యమార్పులం?చలిత బుద్ధి నేర్చుచుం?జల్లునేల కురియకున్న?
దట్టమౌనె?భావిజీవముల్?దలప రై రదేలనో?తల్లి గర్భగతము పొంద?

7.గర్భగత"-వేమరు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.య.జ.న.గల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కలి"కి!నింద మోపుచుం?కల్లబొల్లి కబురు లాడి!
చెలిమి!బల్మి నుల్ముచుం?చెల్లుబాటుతమకు!కాగ?
చలిత బుద్ధినేర్చుచుం?జల్లు నేల కురియ కున్న?
తలప రై రదేలనో?తల్లి గర్భగతము పొంద?

8.గర్భగత"-బీజాపూర్ణ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.య.జ.న.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కలి"కి!నిందమోపుచుం?కల్లబొల్లి కబురులాడి!కట్టు తప్పి!నీతినీమముల్?
చెలిమి బల్మి నుల్ముచుం?చెల్లుబాటు!తమకుకాగ!చెట్టపట్టి!నీర్ష్యద్వేషముల్!
చలిత బుద్ధి!నేర్చుచుం?జల్లు నేల కురియ కున్న?చట్టసానుకూల్యమార్పులన్
తలపరై రదేలనో?తల్లిగర్భగతము!పొంద!దట్టమౌనె?భావి జీవముల్?

9.గర్భగత"-గర్భగత"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.న.జ.గణములు.యతి.10.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
కట్టుదప్పి!నీతినీమముల్?కల్లబొల్లి!కబురులాడి!
చెట్టపట్టి!నీర్ష్య ద్వేషముల్?చెల్లుబాటు!తమకు!కాగ?
చట్టసానుకూల్య!మార్పులం?జల్లు నేల కురియకున్న?
దట్టమౌనె?భావి జీవముల్?తల్లిగర్భగతము పొంద?

10.గర్భగత"-కలినింద"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.న.జ.న.ర.లగ.గణములు యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కట్టుదప్పి నీతినీమముల్?కల్లబొల్లి కబురులాడి!కలి"-కి!నిందమోపుచున్?
చెట్టపట్టి!నీర్ష్య ద్వేషముల్?చెల్లుబాటు!తమకు!కాగ!చెలిమి బల్మినుల్ముచున్
చట్ట సానుకూల్య!మార్పులం?జల్లు నేలకురియకున్న?చలిత బుద్ధి నేర్చుచున్
దట్టమౌనె?భావిజీవముల్?తల్లిగర్భగతము!పొంద?తలప రై రదేలనో?

 స్వస్తి.


మూర్తి.జుత్తాడ.
జైహింద్.

4, ఏప్రిల్ 2018, బుధవారం

నెట్టెదు,మననజేయు,గర్భ"-కడినిడు"-వృత్తము. రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

1 comments

జైశ్రీరామ్.
నెట్టెదు,మననజేయు,గర్భ"-కడినిడు"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
"కడి నిడు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.భ.న.న.య.న.జ.జ.గల.గణములు.యతులు.10,18
ప్రాసనీమముగలదు.
గణనలేని ముదిమిని కడుభరమౌ జీవన కను నెవ్వరు?దేవదేవ!
మనన జేతురె? సుతులు మడిసిన చాలందురు?మనుజాళికి!నీతిలేదు!
పనిగ నెట్టుదు రవని బడలిక యోచింపరు? పనిగా పలుమాటలాడి!
కనరు!తండ్రిని భువిని!కడి నిడ బాధింతురు!ఘనతందురు!జీవ మింతె!

1.గర్భగత"-నభనా"-వృత్తము.
బృహతీఛందము.న.భ.న.గణములు.వృ.సం.504.ప్రాసగలదు.
గణన లేని ముదిమిని!
మనన జేతురె?సుతులు!
పనిగ !నెట్టుదు  రవని!
కనరు తండ్రిని? భువిని!

2.గర్భగత"రాగతాళళా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.య.లల.గణములు.వృ.సం.208.ప్రాసగలదు.
కడు భరమౌ జీవన
మడిసిన చాలందురు
బడలిక యోచింపరు
కడి నిడ బాధింతురు!

3గర్భగగత"-గతిమా"వవృత్తము.
బృహతీఛందము.స.స.జ.గణములు.వృ.సం.348పప్రాసగలదు.
కనునెవ్వరు?దేవదేవ!
మనుజాళికి నీతి లేదు!
పనిగా!పలుమాటలాడి!
ఘనతందురు?జీవమింతె?

4.గర్భగత"-బాధిలు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.భ.న.న.య.లల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
గణన లేని ముదిమిని!కడు భరమౌ?జీవన!
మనన జేతురె?సుతులు!మడిసిన!చాలందురు!
పనిగ!నెట్టుదు రవని!బడలిక యోచింపరు!
కనరు తండ్రిని?భువిని!కడి నిడ! బాధింతురు!

5.గర్భగత"-బడలిక"-వృత్తము.
అత్యష్టీఛందము.న.య.న.జ.జ.గల.గణములు.యతి.9.వ.యక్షరము.
కడు భరమౌ జీవన?కనునెవ్వరు? దేవదేవ!
మడిసిన చాలందురు?మనుజాళికి!నీతిలేదు?
బడలిక యోచింపరు!పనిగా!పలు మాటలాడి!
కడినిడ బాధింతురు!ఘనతందురు!జీవమింతె?

6.గర్భగత"-భరజీవన"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.య.న.జ.జ.భ.స.న.లల.గణములుగయతులు.9.18.
ప్రాసనీమముగలదు.
కడుభరమౌ!జీవన!కనునెవ్వరు?దేవదేవ!గణనలేని?ముదిమిని!
మడిసిన!చాలందురు?మనుజాళికి!నీతిలేదు?మనన!జేతురె?సుతులు?
బడలిక!యోచింపరు?పనిగా!పలుమాటలాడి!పనిగ!నెట్టుదు రవని!
కడినిడ!బాధింతురు!ఘనతందురు!జీవమింతె?కనరు!తండ్రిని?భువిని!

7.గర్భగత"-దేవదేవ"-వృత్తము.
ధృతిఛందము.స.స.జ.న.భ.న.గణములు.యతి.10.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
కను!నెవ్వరు?దేవదేవ!గణన లేని? ముదిమిని!
మనుజాళికి!నీతి!లేదు?మనన జేతురె?సుతులు!
పనిగా!పలుమాటలాడి!పనిగ నెట్టుదు !రవని!
ఘనతందురు!జీవమింతె?కనరు?తండ్రిని!భువిని!

8.గర్భగత"-జీవతీరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.జ.న.భ.న.న.య.లల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కను నెవ్వరు?దేవదేవ!గణనలేని?ముదిమిని!కడు!భరమౌ?జీవన!
మనుజాళికి!నీతిలేదు?మనన జేతురె?సుతులు!మడిసిన!చాలందురు!
పనిగా!పలుమాటలాడి!పనిగ!నెట్టుదు! రవని?బడలిక!యోచింపరు?
ఘనతందురు!జీవమింతె?కనరు?తండ్రిని!భువిని!కడినిడ!బాధింతురు!

9.గర్భగత"-నెట్టెదు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.య.న.స.న.లల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కడు భరమౌ?జీవన!గణన లేని?ముదిమిని!
మడిసిన!చాలందురు!మనన!జేతురె?సుతులు!
బడలిక!యోచింపరు?పనిగ!నెట్టుదు రవని?
కడినిడ!బాధింతురు!కనరు?తండ్రిని!భువిని!

10.గర్భగత"-మననజేయు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.య.న.స.న.న.జ.జ.గల.గణములు.యతులు.9,18,
ప్రాసనీమముగలదు.
 కడుభరమౌ?జీవన!గణన లేని ముదిమిని!కనునెవ్వరు?దేవదేవ!
మడిసిన!చాలందురు!మనన జేతురె?సుతులు!మనుజాళికి!నీతిలేదు?
బడలిక!యోచింపరు?పనిగ!నెట్టుదు రవని!పనిగా!పలుమాట లాడి!
కడినిడ!బాధింతురు!కనరు?తండ్రిని!భువిని!ఘనతందురు?జీవమింతె?
 స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

3, ఏప్రిల్ 2018, మంగళవారం

యతిర్నవసుగంధి, భజనా, గర్భ కల్పద్రుమద్వయ, వృత్తము. రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

1 comments

జైశ్రీరామ్.
యతిర్నవసుగంధి, భజనా, గర్భ కల్పద్రుమద్వయ, వృత్తము.
రచన:- వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.

కల్పద్రుమా"-ద్వయ,వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.

1.చూడవేమినీతిమార్గముం?శోభకంపు!కీర్తినందగాశూలిమెప్పులందుకొమ్మ!
వీడవేమి!స్వార్ధబుద్ధినిం?వేభజింపు!దేవతాళినిం!పేలవంపు!మాటలేల?
పాడుజన్మ!నీటిబుగ్గరా!ప్రాభవంబు!నిల్వదెన్నడుం?పాలిపోవు!రేపొ!మాపొ?
వాడిరాలెడెండు టాకురా!వైభవాలు!వెంట రావురా!బాలగాకు!బేల వౌచు?

2.శోభకంపు!కీర్తినందగా!చూడవేమి!నీతిమార్గముంశూలిమెప్పులందుకొమ్మ
వేభజింపు!దేవతాళినిం!వీడవేమి!స్వార్ధబుద్ధినిం?పేలవంపు!మాటలేల?
ప్రాభవంబు!నిల్వదెన్నడుం?పాడుజన్మ నీటిబుగ్గరా!పాలిపోవు!రేపొ!మాపొ!
వైభవాలు వెంటరావురా!వాడిరాలెడెండుటాకురా!బాలగాకు!బేలవౌచు?

1.గర్భగత"-మత్తరజినీద్వయ వృత్తములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
1.చూడవేమి?నీతిమార్గమున్!      2.శోభకంపు!కీర్తినందగా!
  వీడవేమి?స్వార్ధ బుద్ధినిన్?             వేభజింపు!దేవతాళినిన్!
పాడుజన్మనీటి!బుగ్గరా!                  ప్రాభవంబు!నిల్వదెన్నడున్?
వాడిరాలెడెండుటాకురా!                వైభవాలు!వెంట రావురా!

2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు..వృ.సం.171.ప్రాసగలదు.
శూలిమెప్పులందు కొమ్మ!
పేలవంపు!మాటలేల?
పాలిపోవు!రేపొ!మాపొ?
బాల!గాకు?బేలవౌచు!

3.గర్భగత"-రజినీకరప్రియద్వయ వృత్తములు.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములుయతి.10,వయక్షరము.
ప్రాసనీమముగలదు.
1.చూడవేమి?నీతిమార్గముం?శోభకంపు!కీర్తినందగా!
 వీడవేమి?స్వార్ధ బుద్ధినిం?వేభజింపు!దేవ తాళినిన్!
పాడుజన్మ!నీటిబుగ్గరా?ప్రాభవంబు!నిల్వదెన్నడున్?
వాడిరాలెడెండుటాకురా!వైభవాలు!వెంటరావురా!

2.శోభకంపు!కీర్తినందగా!చూడవేమినీతతిమార్గమున్!
   వేభజింపు!దేవతాళినిం?వీడవేమి?స్వార్ధబుద్ధినిన్?
    ప్రాభవంబు!నిల్వదెన్నడుం?పాడుజపానీటిబుగ్గరా!
    వైభవాలు!వెంటరావురా!వాడి రాలెడెండుటాకురా!

4.గర్భగత"-రజోరంజిత"-వృత్తము.
అత్యష్ష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
శోభకంపు!కీర్తినందగా!శూలిమెప్పులందుకొమ్మ?
వేభజింపు!దేవతాళినిం?పేలవంపు!మాటలేల?
ప్రాభవంబు!నిల్వదెన్నడుం?పాలిపోవు!రేపొ!మాపొ?
వైభవాలు!వెంట రావురా?బాలగాకు!బేలవౌచు?

5.గర్భఖత"-గిరివరదమ"-వృత్తము
ఉత్త్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.జ.ర.లగ.గణములుయతులు.10,18.
ప్రాసనీమముగలదు.
శోభకంపుకీర్తినందదగా!శూలిమెప్పులందుకొమ్మ!చూడవేమి!నీతిమార్గమున్!
వేభజింపుదేవతాళినిం!పేలవంపు!మాటలేల?వీడవేమి?స్వార్ధబుద్ధినిన్?
ప్రాభవంబు!నిల్వదెన్నడుం?పాలిపోవు!రేపొ!మాపొ?పాడుజన్మ!నీటిబుగ్గరా?
వైభవాలు!వెంటరావురా?బాలగాకు?బేలవౌచు!వాడిరాలెడెండుటాకురా?

6.గర్భగత"-యతిర్నవ సుగంధి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
శూలిమెప్పులందుకొమ్మ?చూడవేమి?నీతిమార్గమున్!
పేలవంపు!మాటలేల?వీడవేమి?స్వార్ధబుద్ధినిన్?
పాలిపోవురేపొ?మాపొ!పాడుజన్మ!నీటి బుగ్గరా!
బాలగాకు?బేలవౌచు!వాడి!రాలెడెండుటాకురా?

7.గర్భగత"-భజనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.య.జ.భ.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
శూలిమెప్పులందుకొమ్మ!చూడవేమి?నీతిమార్గముం?శోభకంపు!కీర్తినందగా?
పేలవంపు!మాటలేలవీడవేమమి!స్వార్ధబుద్ధినిం?వేభజింపు!దేవతాళినిన్?
పాలిపోవు!రేపొ!మాపొ?పాడుజన్మనీటిబుగ్గరా?ప్రాభవంబు!నిల్వదెన్నడున్?బాలగాకకు!బేలవౌచు?వాడిరాలెడెండుటాకురా?వైభవాలు!వెంటరావురా!
 స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

2, ఏప్రిల్ 2018, సోమవారం

అఖిలం మథురమ్. శ్రీవల్లభ మధురోక్తులపై శ్రీ మేడూరి సూర్య సత్య నారాయణ అబ్ర్తిభిప్రాయము..

1 comments

జైశ్రీరామ్.
అఖిలం మథురమ్.
మేడూరి సూర్య సత్య నారాయణ మూర్తి.
విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు
ఎం.ఏ,తెలుగు,ఎంఏ,సంస్కృతము.
శ్రీకాకుళము.
తొలిపలుకు
=======

"మధురం మథు పీయూషం తస్మాత్తస్మాత్కవేర్వచః".
      ఇది అదేదో అలంకారానికి లక్ష్యంగా చెప్పబడిన,సరస్వతీదేవికి
మహోత్తమాంకారమై విలసిల్లిన గొప్పమాట.
     తేనె! తియ్యన ! మరి అమృతమో! అది తియ్య తేనెకన్నా!ఇంకా
తియ్యన!మరైతే!కవివాక్కో!అది ఆతీపితేనెకన్నా! దాని తలదన్నే
మధురాతిమథధురమైన ఆ అమృతంకన్నా ఇంకా ఇంకా మరెంతో
ఎంతో తి..........య్యన!ఇది మీదిసంస్కృత  ఆలంకారిక వాక్యానికి
భావం
      సత్కవివల్లభుడడూ,పండిత సింహమూ,పరమ చ్ఛాందసుడూ,
అయిన శ్రీ వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి గారిది. ఇప్పుడు
వచోమకరందమో,వాగమృతమో,ఆరెండిటి కన్నా యింకా అతీత
మైనదో! ఆసూక్తిని  నేనైతే స్పష్ఠంగా నిర్వచించ లేను.
       "ఏకః  స్వాదు న భుంజీథ" తియ్యని తినుబండారాన్ని, ఒకడే
తినేయడం తగదు-కనుక తనహృదయంలో ఉదయించిన మధురాతి
మధుర భావాన్ని పంచియిచ్చారు శ్రీ మూర్తి గారు.ఆశ్వాదించి తరించ
మన్నారు.తాము రచించి స్వయంగా తరించారు."స్వయం తీర్థ్యా
ఫలాన్ తారయేత్" అని కధాభిజ్జ్ఞుల మాట.
      ఈ మధురోక్తుల మంచి మహాన్వితమైన కృతిలో కొన్ని చేదునిజాల్ని
కూడా చక్కెర పూతతో అమృత గుళికలుగా మార్చి పద్యాలుగా మలిచి
మంచి భేషజం ఉపయోగించారుకవివర్యువలు.ఒజ్జలుగడుగ్గాయి పిల్లలకు
ఆమోదకరంగా చేసి,మంచి మంచి అంశాలు వాళ్ళబుర్రలకు గడుసుగా
ఎక్కిస్తారు కదా! వల్లభ వఝల వచో విలసజ్ఝరి మరి అలాంటిదే కదా!
        ప్రతీ ఉదాహృతీ హృదికి ఆవర్జకమైనదే! వల్లభ వఝల మధురోక్తి
వజ్రమేనంటే  ఇది సత్యోక్తి! 
36.వ పద్యంలో నేటి ఓటింగు వ్యవస్థను  ఖంగుమంటున్న తమ వచో
ధాటితో కవి వరేణ్యులు దుయ్య బట్టిన వైనం తిలకించండి
            కం.  కాటికి చను శవమైనను
                   నోటును చూపించ లేచు!నూటికి బంటై
                   కోటికి పడగల నెత్తెడి
                   కోటీశ్వరులెల్ల "ఓట్లు"-కోరుట తప్పా!           .--36.వ.పద్యం.
సుతి మెత్తగా మతులు పోనాడుతారు  స్తుత్య వచో వైభవంతో  సుకవి
సత్తములు.
         38.కం. కాకియు కోకిల రూపున్
                    ఏకీభవమందుగాని!ఎవ్విధి నైనన్
                    కాకియు గోకిల కూతల
                    ఏకీభవమొనరునె?భువి!యెంచవలెనన్!
ఈపద్యం
శ్లో: కాకః కృష్ణః , పికః కృష్ణః,కో భేదః పిక కాకయోః
     వసంతకాలే సంప్రాప్తే!కాకః కాకః పికః పికః!!
అనే శ్లోక భావాన్ని అందంగా ఆవిష్కరించిందికదా!ఇది నేటి సమాజానికి
ఓ పదునైన చురక.
           46. కం: చదివిన వినయము కలుగును
                        పదిలపు పాత్రతను-వినయభావమ్ము నిడున్
                       మృదుపాత్రత!ధనమొసగును
                      అదియే!పరమార్ధమంచు-నరయగ వలెన్!
ఈచక్కటి పద్యం
శ్లో:-విద్యా దదాతివిననయం,వినయాద్యాతి పాత్రతాం,
      పాత్రాత్వాద్ధనమాప్నోతి',ధనాద్ధర్మం,తయః సుఖం!
అనే!శ్లోకానికి!వెలుగు నిచ్చే సొగసైనతెలుగు.నేటి విద్యార్ధి లోకానికి మంచి
కనువిప్పు.బాలబాలికల నడవడికి మేటిమె్పు
                  58.కం:-తినతిండి కొదువ యయ్యును
                               తనయుల నెందరినొ కనుట! తగునే? ధాత్రిన్.
                               మునుపటి దినములు కావివి?
                               కనుగొని జీకలికాలమునన్-కలికాలమునన్!
చిన్నకుటుంబం చింతలేని కుటుంబం అని కుటుంబ నియంత్రణ సూత్రాన్ని
సరళ సుందరంగా తెలియజెప్పే!సొంపైనపద్యం ఇది.కవిగారి సామాజిక స్పృహ,సంస్కరణ శీలత,అనేవాటికి,ఈపద్యం అద్దం పడుతుంది.
                 64..కం.నేడో రేపో పోయెడి
                             పోడిమి చెడు దేహభ్రమ-పూజ్యంబౌనే?
                            మూడగు రోజుల ముచ్చట!
                           వేడుకగా!నెంచకుమయ! విశ్వ విధేయా!
"శ్రీద్యతే ఇతి శరీరమ్"-శిధిలమయ్యేది!అని శరీరపదానికి వ్యుత్పత్తి.దేహంపై
మోహం తగదని,ఈ కాయాశాశ్వతంగా!కాయడం  సాధ్యంకాదనిమూనాళ్ళ
ముచ్చటకు భ్రమసిపోవద్దనిభర్తృహరిలా,ఓధూర్జటిలా,పరమవైరాగ్యభావాన్ని
చాటిచెప్పిన!కవిగారు గొప్ప తత్త వేత్త.విలువలుశిలువకెక్కకుండా!పట్టు
వలువలు కట్టి పదిలంగా కాపాడి,నేటి సమాజానికి , నేటి బాలలకు!అందించే
ప్రయత్నం అడుగడుగునా!ఇందులో కానవస్తుంది.ఓ సుమతీ శతకంలా,బాగా
వినియోగ పడాలని,కవిగారి పరిశ్రమ,సార్ధకం కావాలని,మనసారా!
కోరుకొంటున్నాను.ఇది ఒక వల్లభాష్టకంబు, అంతా మధురంగా తత్త
                                 ఇట్లు
                      సుకవి విధేయ
          మేడూరి సూర్య సత్య నారాయణ మూర్తి.
                        శ్రీకాకుళం.
జైహింద్.

1, ఏప్రిల్ 2018, ఆదివారం

శ్రీలక్ష్మణాచార్య విరచిత అష్టోత్తర శత రామ నామములతోనొప్పారుచున్న నామ రామాయణము.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా.
శ్రీలక్ష్మణాచార్య విరచిత అష్టోత్తర శత రామ నామములతోనొప్పారుచున్న నామ రామాయణమును సావధానంగా వినండి.
జైహింద్