గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, ఏప్రిల్ 2018, బుధవారం

నెట్టెదు,మననజేయు,గర్భ"-కడినిడు"-వృత్తము. రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.
నెట్టెదు,మననజేయు,గర్భ"-కడినిడు"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
"కడి నిడు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.భ.న.న.య.న.జ.జ.గల.గణములు.యతులు.10,18
ప్రాసనీమముగలదు.
గణనలేని ముదిమిని కడుభరమౌ జీవన కను నెవ్వరు?దేవదేవ!
మనన జేతురె? సుతులు మడిసిన చాలందురు?మనుజాళికి!నీతిలేదు!
పనిగ నెట్టుదు రవని బడలిక యోచింపరు? పనిగా పలుమాటలాడి!
కనరు!తండ్రిని భువిని!కడి నిడ బాధింతురు!ఘనతందురు!జీవ మింతె!

1.గర్భగత"-నభనా"-వృత్తము.
బృహతీఛందము.న.భ.న.గణములు.వృ.సం.504.ప్రాసగలదు.
గణన లేని ముదిమిని!
మనన జేతురె?సుతులు!
పనిగ !నెట్టుదు  రవని!
కనరు తండ్రిని? భువిని!

2.గర్భగత"రాగతాళళా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.య.లల.గణములు.వృ.సం.208.ప్రాసగలదు.
కడు భరమౌ జీవన
మడిసిన చాలందురు
బడలిక యోచింపరు
కడి నిడ బాధింతురు!

3గర్భగగత"-గతిమా"వవృత్తము.
బృహతీఛందము.స.స.జ.గణములు.వృ.సం.348పప్రాసగలదు.
కనునెవ్వరు?దేవదేవ!
మనుజాళికి నీతి లేదు!
పనిగా!పలుమాటలాడి!
ఘనతందురు?జీవమింతె?

4.గర్భగత"-బాధిలు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.భ.న.న.య.లల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
గణన లేని ముదిమిని!కడు భరమౌ?జీవన!
మనన జేతురె?సుతులు!మడిసిన!చాలందురు!
పనిగ!నెట్టుదు రవని!బడలిక యోచింపరు!
కనరు తండ్రిని?భువిని!కడి నిడ! బాధింతురు!

5.గర్భగత"-బడలిక"-వృత్తము.
అత్యష్టీఛందము.న.య.న.జ.జ.గల.గణములు.యతి.9.వ.యక్షరము.
కడు భరమౌ జీవన?కనునెవ్వరు? దేవదేవ!
మడిసిన చాలందురు?మనుజాళికి!నీతిలేదు?
బడలిక యోచింపరు!పనిగా!పలు మాటలాడి!
కడినిడ బాధింతురు!ఘనతందురు!జీవమింతె?

6.గర్భగత"-భరజీవన"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.య.న.జ.జ.భ.స.న.లల.గణములుగయతులు.9.18.
ప్రాసనీమముగలదు.
కడుభరమౌ!జీవన!కనునెవ్వరు?దేవదేవ!గణనలేని?ముదిమిని!
మడిసిన!చాలందురు?మనుజాళికి!నీతిలేదు?మనన!జేతురె?సుతులు?
బడలిక!యోచింపరు?పనిగా!పలుమాటలాడి!పనిగ!నెట్టుదు రవని!
కడినిడ!బాధింతురు!ఘనతందురు!జీవమింతె?కనరు!తండ్రిని?భువిని!

7.గర్భగత"-దేవదేవ"-వృత్తము.
ధృతిఛందము.స.స.జ.న.భ.న.గణములు.యతి.10.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
కను!నెవ్వరు?దేవదేవ!గణన లేని? ముదిమిని!
మనుజాళికి!నీతి!లేదు?మనన జేతురె?సుతులు!
పనిగా!పలుమాటలాడి!పనిగ నెట్టుదు !రవని!
ఘనతందురు!జీవమింతె?కనరు?తండ్రిని!భువిని!

8.గర్భగత"-జీవతీరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.జ.న.భ.న.న.య.లల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కను నెవ్వరు?దేవదేవ!గణనలేని?ముదిమిని!కడు!భరమౌ?జీవన!
మనుజాళికి!నీతిలేదు?మనన జేతురె?సుతులు!మడిసిన!చాలందురు!
పనిగా!పలుమాటలాడి!పనిగ!నెట్టుదు! రవని?బడలిక!యోచింపరు?
ఘనతందురు!జీవమింతె?కనరు?తండ్రిని!భువిని!కడినిడ!బాధింతురు!

9.గర్భగత"-నెట్టెదు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.య.న.స.న.లల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కడు భరమౌ?జీవన!గణన లేని?ముదిమిని!
మడిసిన!చాలందురు!మనన!జేతురె?సుతులు!
బడలిక!యోచింపరు?పనిగ!నెట్టుదు రవని?
కడినిడ!బాధింతురు!కనరు?తండ్రిని!భువిని!

10.గర్భగత"-మననజేయు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.య.న.స.న.న.జ.జ.గల.గణములు.యతులు.9,18,
ప్రాసనీమముగలదు.
 కడుభరమౌ?జీవన!గణన లేని ముదిమిని!కనునెవ్వరు?దేవదేవ!
మడిసిన!చాలందురు!మనన జేతురె?సుతులు!మనుజాళికి!నీతిలేదు?
బడలిక!యోచింపరు?పనిగ!నెట్టుదు రవని!పనిగా!పలుమాట లాడి!
కడినిడ!బాధింతురు!కనరు?తండ్రిని!భువిని!ఘనతందురు?జీవమింతె?
 స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
పండితుల వారికి శిరసాభి వందనములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.