గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, సెప్టెంబర్ 2015, మంగళవారం

కృతి ఛందము. ... శ్రీవల్లభ.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

7, సెప్టెంబర్ 2015, సోమవారం

తెలుగు భాగవతం.ఆర్గ్ ద్వితీయ వార్షికోత్సవ చిత్రాలు.౩

2 comments

జైశ్రీరామ్.

జైహింద్.

ఉదారగుణ సంపన్న రాజమహేంద్ర వర పుత్రిక " ప్రజా పత్రిక " వారపత్రిక.

3 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!  సమాజం దృష్టిలో అతి సామాన్యమైన ఒక వార పత్రిక - ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిపుణులైన ఉపాధ్యాయులను గుర్తించి, వారిలో ఉన్న నిపుణతను సభాముఖంగా ప్రశంసిస్తూ, వారిని అత్యద్భుతంగా సత్కరించడం ద్వారా వారి సేవాపటిమను ద్విగుణీకృతం చేస్తూ సమాజంలోనే అసాధారణ మహోన్నతవిధానంతో సామాజికులను ఆశ్చర్యానికి లోను చేస్తోందంటే ..... అది సామాన్యమైన విషయం కాదు. 
ఈ క్రింది చిత్రాలను, 
ఆ పత్రిక ఎడిటర్ దేవీ సుదర్శన్. వ్రాసిన లేఖను, మీరు గమనించండి. 
ఆ పత్రిక తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరము నుండి సుమారు వందేళ్ళుగా వెలువడుతున్న 
" ప్రజాపత్రిక " వారపత్రిక.

సర్  /  మేడం,    
ఈ రొజు దర్మంచర కమ్యూనితి   హాల్లో టీచర్స్ డే చేశాం. సుదర్సన్ అధ్యక్షతన జరిగిన యీ  కర్యక్రమంలొ డా.కూర్మయ్య, పిల్లి డేవిడ్ కుమార్, మహీధర రామ శాస్త్రి, మాణిక్ రెడ్డి  సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.నెల్లూర్ లో ఏనుగు పై సన్మానం పొందిన షేక్ మస్తాన్  సాహెబ్  గారు ఈ సభలో చక్కటి ఉపన్యాసం ఇచ్చారు.`15 మంది తీచర్స్ కి సన్మానం జరిగింది. పి.వి.ఎస్ క్రిష్ణా రావ్,  ఎలిజిబెత్ రని ఫణి నాగేశ్వర రావ్, దెవీ సుదర్సన్ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు 
ఎడిటర్ 
దేవీ సుదర్శన్.
చూచారు కదా! ఇది ఎంతటి శ్రమ దమాదులతో కూడుకొన్నకార్యక్రమమో!
ఆదాయ వ్యయాలను పరిగణించకుండా ఎదుటి మనిషిలో మంచి అన్నది ఉన్నదంటే, దానిని గుర్తించి, అది వారి దృష్టికి తీసుకు వచ్చి ఆ మంచిని శతధా సహస్రధా ద్విగుణీకృతం చేయడం ద్వారా ఆ వ్యక్తిని సమాజానికి పరిపూర్ణంగా ఉపయోగపడేవానిగా మార్చుతున్న మహత్తర కార్యక్రమం ఇది.
ఇటువంటి పత్రికలు ఎంతగా ప్రోత్సహింపఁబడితే సమాజానికి అంతగా మేలు చేకూరుతుంది.
ఇట్టి మహత్తర కార్యక్రమాలను ఆదర్శప్రాయంగా చేపట్టి నిర్విఘ్నంగా అత్యద్భుతంగా నిర్వహిస్తున్న " ప్రజా పత్రిక " అధిపతులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియఁజేస్తున్నాను.
సన్మానితులందరినీ నేను మనసారా అబినందిస్తున్నాను.
ఐతే
ఈ సన్మానితులు తమలో పత్రిక ఏవైతే సుగుణాలను గుర్తించి సన్మానం చేసిందో ఆ సుగుణాలను మరింత పెంచుకొని, తమకు చేసిన సన్మానం యోగ్యమయినదే అని సమాజంలో అనిపించుకొనేలాగున తమ భవిష్యత్ కార్యక్రమావళిని తీర్చి దిద్దుకోవలసి, ఆవిధంగా తమ సేవలను సమాజానికి అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. చూద్దాం భవిష్యత్తులో ఎంతమంది తాము సత్కరింపఁబడటంలో గల ఔచిత్యాన్ని ఋజువు చేసుకుంటారో.
జైహింద్.

05-9-2015 న జరిగిన తెలుగు భాగవతం.ఆర్గ్ ద్వితీయ వార్షికోత్సవమ్ చిత్రాలు.

1 comments

జైశ్రీరామ్.

జైహింద్.

ఏకశ్చండ్యా, రవౌ సప్త,. మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. ఏకశ్చండ్యా, రవౌ సప్త, త్రిస్రో దద్యాత్ వినాయకః.
చతస్రం వాసుదేవస్య, శివస్యార్థ ప్రదక్షిణా!! 
ఆ.వె. అమ్మవారికొకటి, యా భాస్కరునకేడు,
గణపతికిని మూడు, గౌరవముగ
విష్ణువునకు నాల్గు,విశ్వ హర్తకునర్థ
సుప్రదక్షిణములు చొప్పుఁ జేయ.
భావము. అమ్మవారికి ఒక ప్రదక్షిణము, సూర్యునికి ఏడు, గణపతికి మూడు, విష్ణువుకి నాలుగు, శివునికి అర్థ ప్రదక్షిణ చేయవలయును.
జైహింద్.

అగ్నిహోత్రం గృహం క్షేత్రం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. అగ్నిహోత్రం గృహం క్షేత్రం , గర్భిణీం వృద్ధబాలకౌ ,
రిక్తహస్తేన నోపేయాత్ , రాజానాం దైవతం గురుమ్ .
ఆ. అగ్ని కడకు, స్వగృహ, మారాధ్యదైవమ్ము
సన్నిధులకు, గురుని సన్నిధికిని
క్షేత్రములకు, వృద్ధ, శిశువుల చూలింత  
వట్టి చేత పోకు ప్రభులఁ జూడ.
భావము. అగ్నిహోత్రము, స్వగృహము, పుణ్యక్షేత్రము, గర్భిణీ స్త్రీ, ముసలివారు, బాలురు, రాజు, దైవము, గురుడు - వీరివద్దకు బోవునప్పుడు వట్టిచేతులతోపోరాదు. ఏదో పండునైన, పూవునైన తీసుకొనిపోయి,  సమర్పించ వలెను. 
జైహింద్.

6, సెప్టెంబర్ 2015, ఆదివారం

రవీంద్రభారతిలో జరిగిన తెలుగు భాగవతం.ఆర్గ్ ద్వితీయ వార్షికోత్సవమ్.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీకృష్ణాష్టమి పర్వదినమైన ౦౫-౯-౨౦౧౫ న రవీంద్రభారతిలో తెలుగు భాగవతం.ఆర్గు ద్వితీయ వార్షికోత్సవం అద్వితీయంగా జరిగింది. ఆ కార్యక్రమమునకు సంబంధించిన చిత్రాలను, నా ప్రసంగములో చోటు చేసుకొన్న నా పద్యములను తిలకించండి.
తెలుఁగు భాగవతం.ఆర్గ్ అధిపతి బ్రహ్మశ్రీ ఊలపక్కి సాంబశివరావు గారి నివేదన.
నా ప్రసంగము
ఊలపల్లి వారి సంస్కృతి
అపురూపమైన భరతనాట్యము చేస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న చిన్నారులు., 
 అపురూపమైన భరతనాట్యము చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి, 
నాద్వారా సత్కరింపఁబడుతున్న  చిన్నారి.
 శ్రీకృష్ణుని పాత్రలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి, 
నాద్వారా సత్కరింపఁబడుతున్న  చిన్నారి.
భరతనాట్యముతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన చిన్నారులు.
మహనీయులమధ్యకు దూరిపోయిన నేను
శ్రీబాలాంత్రపు వేంకటరమణ గారిని పరిచయం చేస్తున్న 
భాగవత గననాధ్యాయి శ్రీ సాంబశివరావు గారు.
భాగవత గననాధ్యాయిచే సత్కరింపఁబడుచున్న శ్రీ వేంకట రమణ గారు.
ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అధినేతకు సత్కృతి.
ఉ) శ్రీ నవనీత మానస విశిష్ట గుణాఢ్యులు. సత్ కవీశ్వరుల్,
మాన ధనాఢ్యులున్, సుగుణ మంజుల వాఙ్మహనీయ భాగ్యులున్,
జ్ఞాన సుపూజ్యులున్, వినుత జాల సుసోదర సోదరీమణుల్
నా నుడులన్ గ్రహించి, మది నన్ను గణింప నమస్కరించెదన్. 
క) జాలోపలబ్ధ భగవత్ - శీలముగా భాగవతము చేతికినొసగన్
జాలుదురని తలపోసియె - హేలగ సూచించె భవిత నిట పోతనయున్. 
గీ) *వందిమాగాధ సూత కైవార రవము - వసుమతీ సురకోటి దీవనల మ్రోత,
లనుగమింపగ సతులు సౌధాగ్ర శిఖర - జాలములనుండి ముత్యాల జాలమొలుక.(భాగవతం"10.667)  
బహు కంద గీత గర్భ చంపకమాల.
చ)  వర కవితాకృతిన్ తెలుగు భాగవతంబిల దీప్తమౌనుగా!
భర భవులన్తటన్ వెలుగు భాగవతుల్మన పేరు నిల్పుగా!
పుర నవనీతులౌ సుకవి పుంగవులెల్లను శోభఁ దేలుఁగా!
వర నవధాత్రిగాన్ సకల భాగ్య వసుంధర సంతసించుఁగా! 
గీ) అనుపముఁడు భాగవతముడాట్టార్గుపతికి, - మాన్యులైనట్టి తన్మిత్ర మండలికిని,
సభను గలయట్టి సన్మిత్ర సరసులకును. - వందనము సేతు శ్రీహరి భక్తులకును. 
ఉ) మంగళమౌత భాగవత మాన్యుల బ్లాగుకు, నూలపల్లికిన్,
మంగళముల్ కణాదకు, ఉమా శివ మూర్తికి, సద్దిలీపుకున్,
మంగళమౌత బండికిని, మంగళముల్ సభనున్నవారికిన్,
మంగళమౌత శ్రీహరికి, మంగళముల్ మన భారతాంబకున్. 
స్వస్తి.

మంత్రపుష్పము.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
శ్రోత్రపేయంగా మంత్రపుష్పాన్ని ఆలకించండి.

మంత్రపుష్పము
ఓం ధాతా పురస్తాద్యముదాజహార
శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్త్రః |
తమేవం విద్వానమృత ఇహ భవతి
నాన్యః పంథా అయనాయ విద్యతే ||
సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువమ్ |
విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదమ్ ||
విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ం హరిమ్ |
విశ్వమేవ ఇదం పురుషః తద్విశ్వముపజీవతి ||
పతిం విశ్వస్యాత్మేశ్వరగ్ం శాశ్వతగ్ం శివమచ్యుతమ్ |
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణమ్ ||
నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః |
నారాయణ పరం బ్రహ్మ తత్త్వం నారాయణః పరః |
నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః ||
యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేజ్పి వా |
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః ||
అనంతమవ్యయం కవిగ్ం సముద్రేజ్ంతం విశ్వశంభువమ్ |
పద్మ కోశ ప్రతీకాశం హృదయం చాప్యధోముఖమ్ ||
అధో నిష్ఠ్యా వితస్త్యాంతే నాభ్యాముపరి తిష్ఠతి |
జ్వాలమాలాకులం భాతీ విశ్వస్యాయతనం మహత్ ||
సంతతగ్ం శిలాభిస్తు లంబత్యా కోశసన్నిభమ్ |
తస్యాంతే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్ ||
తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః |
సోజ్గ్రభుగ్విభజంతిష్ఠన్ ఆహారమజరః కవిః ||
తిర్యగూర్ధ్వమధశ్శాయీ రశ్మయః తస్య సంతతా |
సంతాపయతి స్వం దేహమాపాదతలమాస్తకః |
తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితాః ||
నీలతోయదమధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వరా |
నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా ||
తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః |
స బ్రహ్మ స శివః స హరిః స ఇంద్రః సోజ్క్షరః పరమః స్వరాట్ ||
యోజ్పాం పుష్పం వేద |
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి |
చంద్రమా వా అపాం పుష్పమ్ |
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి |
య ఏవం వేద |
యోజ్పామాయతనం వేద | ఆయతనవాన్ భవతి |
అగ్నిర్వా అపామాయతనమ్| ఆయతనవాన్ భవతి |
యోజ్గ్నేరాయతనం వేద | ఆయతనవాన్ భవతి |
ఆపో వా అగ్నేరాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద |
యోజ్పామాయతనం వేద | ఆయతనవాన్ భవతి |
వాయుర్వా అపామాయతనమ్| ఆయతనవాన్ భవతి |
యో వాయోరాయతనం వేద | ఆయతనవాన్ భవతి |
ఆపో వై వాయోరాయతనమ్| ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద |
యోజ్పామాయతనం వేద | ఆయతనవాన్ భవతి |
అసౌ వై తపన్నపామాయతనమ్| ఆయతనవాన్ భవతి |
యోజ్ముష్య తపత ఆయతనం వేద | ఆయతనవాన్ భవతి |
ఆపో వా అముష్య తపత ఆయతనమ్| ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద |
యోజ్పామాయతనం వేద | ఆయతనవాన్ భవతి |
చంద్రమా వా అపామాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
యశ్చంద్రమస ఆయతనం వేద | ఆయతనవాన్ భవతి |
ఆపో వై చంద్రమస ఆయతనమ్| ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద |
యోజ్పామాయతనం వేద | ఆయతనవాన్ భవతి |
నక్షత్రాణి వా అపామాయతనమ్| ఆయతనవాన్ భవతి |
యో నక్షత్రాణామాయతనం వేద| ఆయతనవాన్ భవతి |
ఆపో వై నక్షత్రాణామాయతనమ్| ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద |
యోజ్పామాయతనం వేద | ఆయతనవాన్ భవతి |
పర్జన్యో వా అపామాయతనమ్| ఆయతనవాన్ భవతి |
యః పర్జన్యస్యాయతనం వేద | ఆయతనవాన్ భవతి |
ఆపో వై పర్జన్యస్యాయతనమ్| ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద |
యోజ్పామాయతనం వేద | ఆయతనవాన్ భవతి |
సంవత్సరో వా అపామాయతనమ్| ఆయతనవాన్ భవతి |
యస్సంవత్సరస్యాయతనం వేద | ఆయతనవాన్ భవతి |
ఆపో వై సంవత్సరస్యాయతనమ్ | ఆయతనవాన్ భవతి |
య ఏవం వేద |
యోజ్ప్సు నావం ప్రతిష్ఠితాం వేద | ప్రత్యేవ తిష్ఠతి |
కిం తద్విష్ణోర్బల మాహుః | కాదీప్తిః కింపరాయణం |
ఏకో యద్ధారయద్దేవః | రేతసీ రోదసీ ఉభే |
వాతాద్విష్ణోర్బల మాహుః | అక్షరాద్దీప్తిః రుచ్యతే |
త్రిపదాద్ధారయద్దేవః | యద్విష్ణోరేకముత్తమమ్ |
రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే | నమోవయం వై
స్రవణాయకుర్మహే | సమే కామాన్ కామకామాయ
మహ్యం | కామేశ్వరో వై శ్రవణో దదాతు | కుబేరా
య వై స్రవణాయ | మహారాజాయ నమః |
ఓం తద్బ్రహ్మ | ఓం తద్వాయు | ఓం తదాత్మా |
ఓం తత్సత్యం | ఓం తత్సర్వం | ఓం తత్పురోణ్ నమః |
అన్తశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు | త్వం
యజ్ఞస్త్వం వషట్కారస్త్వమిన్ద్రస్త్వగ్ం రుద్రస్త్వం
విష్ణుస్త్వం బ్రహ్మ త్వం ప్రజాపతిః |
త్వం తదాప ఆపోజ్యోతీ రసోజ్మృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ |
ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్
బ్రహ్మణోజ్ధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివోమ్ |
తద్విష్ణో పరమం పదగ్ం సదా పశ్యన్తి సూరయః
దివీవ చక్షు రాతతమ్ |
తద్విప్రాసో విపన్వవో జాగృదాం సస్సమిన్దతే విష్ణోర్య
త్పరమం పదమ్ |
ఋతగ్ం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళమ్|
ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమోనమః |
ఓమ్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి|
తన్నో విష్ణుః ప్రచోదయాత్ |
ఆకాశాత్పతితం తోయం యథా గచ్ఛతి సాగరమ్|
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి |
ఓం శాంతి శాంతి శాంతిః ||
జైహింద్.

5, సెప్టెంబర్ 2015, శనివారం

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భముగా పరమ భాగవతులందరికీ శుభాకాంక్షలు.

1 comments

జైశ్రీరామ్.
శ్రీ కృష్ణమ్ వందే జగద్గురుమ్.
ఆర్యులారా! నేడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మాష్టమి. ఆపరమాత్మ యొక్క పాదారవిందములకు త్రికరణ శుద్ధిగా ప్రణమిల్లి, తనను విశ్వశించు వారి యోగక్షేమములను వహించు విషయములో ఉపేక్షించ వలదని మనసారా కోరుకొంటున్నాను.  ఆ పరమాత్మ యొక్క దృగమృతము మీకు ప్రాప్తించుగాక.

దేవకీ గర్భ సంజాత! దేవదేవ!
నిన్ను నమ్మిన భక్తులందున్నవాడ!
మేలు కూర్చఁగ సంకోచమేలనయ్య?
కాచి మమ్ముల రక్షించు కరుణ చూపి.

చిన్నికృష్ణయ్య మాయన్న యన్నవారు,
కన్నయా! యని నినుఁగనుచున్నవారు,
తమ్ముడా! మాకు నీవె మొత్తమ్మటంచు
నమ్మి యున్నట్టి యక్కల నయతఁ గనవొ?

నీదు పుట్టిన రోజని మోదమలర
నిన్నలంకరించుచు చూచుచున్నవారు,
బెల్లమటుకులు నీకిచ్చి యుల్లమందు
పొంగిపోవుచు నిన్జూతురంగనలిట.

చిలిపి కృష్ణుఁడ! మా దరి చేరి నిలుము.
నీవు కలవన్న ధైర్యంబు నేర్పునన్ని.
బ్రతుకగలవారమీవున్నభక్తిఁ జూపి,
వరములిమ్మని కోరము. సరస నున్న.

సప్తవింశత్యధిక ద్వివిధ కంద, గీత, గర్భ చంపకమాల.
భర! కనవేమిరా! పరమ పావన కృష్ణుఁడ బ్రోవ వేమిరా?
చిర ఘన తేజసా! తిమిర జృంభణ బాపర! దీన బంధువా!
స్థిర! వినవేమిరా!  నృహర! తృప్తిని నిన్గన నేర్పి యేలుదే?
వర గుణధీ నిధీ! సుగుణ భావన లీయవ? శోభఁ గూర్పవా?

చంపక గర్భస్థ తేటగీతి.
పరమ పావన కృష్ణుఁడ బ్రోవ వేమి?
తిమిర జృంభణ బాపర! దీన బంధు!
నృహర! తృప్తిని నిన్గన నేర్పి యేలు!
సుగుణ భావన లీయవ! శోభఁ గూర్ప!
జైహింద్.


ఉపాధ్యాయ దినోత్సవము సందర్భముగా యావద్వుపాధ్యాయ లోకానికి నా శుభాకాంక్షలు. .శ్రీ గురుస్తోత్రం

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి. మనము ఉపాధ్యాయ దినోత్సవము చేసుకొనే రోజు యిది.
ఈ సందర్భంగా మహనీయులైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చే విధంగా తత్పరత్వంతో తమ విధి నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు నా శుభాభినందనలు.
ఈ క్రింది గురు స్తోత్రము గురువుయొక్క మహనీయమైన బాధ్యతను తెలియజేయుచున్నది. ఈ మహనీయతను తమకు తాము ఆపాదింపచేసుకోడానికి గురువులందరూ హృదయపూర్వకంగా ప్రయత్నించితీరాలి. అట్టి ప్రయత్నం దీక్షా దక్షత లేనివారు ఈ వృత్తిని విడిచిపెట్టుటయే మంచిది. వృత్తికి మాత్రము అన్యాన్యాయము చేయరాదు.
శ్రీ గురుస్తోత్రం
అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవేనమః || 1

అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా |
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవేనమః || 2

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుదేవ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః || 3

స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవేనమః || 4

చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరం |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవేనమః || 5

సర్వశ్రుతి శిరోరత్న విరాజిత పదాంబుజః |
వేదాంతాంబు జ సూర్యోయః తస్మై శ్రీ గురవేనమః || 6

చైతన్యః శాశ్వతః శాంతో వ్యోమాతీతో నిరంజనః |
బిందునాదకలాతీతః తస్మై శ్రీ గురవేనమః || 7

జ్ఞానశక్తి సమారూఢః తత్త్వమాలావిభూషితః |
భుక్తి ముక్తి ప్రదాతా చ తస్మై శ్రీ గురవేనమః || 8

అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధవిదాహినే |
ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవేనమః || 9

శొషణం భవసింధోశ్చ జ్ఞాపనం సారసంపదః |
గురోః పాదోదకం సమ్యక్ తస్మై శ్రీ గురవేనమః || 10

న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
తత్త్వ జ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవేనమః || 11

మన్నాథః శ్రీ జగన్నాథః మద్గురుః శ్రీ జగద్గురుః |
మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవేనమః || 12

గురురాది రనాదిశ్చ గురుః పరమదైవతం |
గురోః పరతరం నాస్తి తస్మై శ్రీ గురవేనమః || 13

త్వమేవ మాతాచ పితా త్వమేవ | త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ | త్వమేవ సర్వం మమ దేవదేవ || 14
జైహింద్.

4, సెప్టెంబర్ 2015, శుక్రవారం

నమో గోభ్యః శ్రీమతీభ్యః ... మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయాభ్యయేవచ.
నమో బ్రహ్మ నుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమోనమః.
క. శ్రీమంత కామధేనువు 
ధీమంతపు సంతు, బ్రహ్మదేవ నుతోద్ధత్
శ్రీమద్గోమాతలకున్ 
క్షేమంబిడ వందనంబు చేసెద భక్తిన్.
భావము. శ్రీమంతంబులైన కామధేను సంతతులైన, బ్రహ్మచే స్తుతింపబడిన, పవిత్రములైన గోవులకు నా నమస్కారము.
శ్లో. గావో మమాగ్రతః నను గావోమే సంతు పృష్టతః.
గావోమే హృదయం నిత్యంవాం మధ్యే వసామ్యహమ్.
ఆ.వె. గోవులుండుగాక గొప్పగా నాముందు
వెనుకలందు నెపుడు, వినుతముగను.
నిలుచు నాదు మదిని నిరతము గోవులు.
మసలుదెపుడునాలమందలందు.
భావము. గోవులు నా ముందు వెనుకల నుండు గాక. గోవులే నాహృదయము. గోవుల మధ్య నివశించుచున్నాను.
శ్లో. సర్వతీర్థమయీం దేవీ! వేద దేవాత్మికాం శివమ్.
సురభిం యజ్ఞస్య జననీ! మాతరం త్వాం నమామ్యహమ్.
ఆ.వె. సర్వతీర్థములును సర్వ వేదంబులు
సర్వదేవతలును చక్కనెపుడు
కలిగియుండి శుభము కలిగించు గోమాత!
వందనములు సురభి భవ్య మాత!
భావము. సర్వ తీర్థములను నీలోనే కలిగిన ఓ గోమాతా! వేదములన్నియు నీలోనే ఉన్నవి.దేవతలందరు నీలోనే ఉండిరి. నీవు సర్వ శుభ రూపిణివి. ఓ సురభి మాతా! నీవు యజ్ఞమునకు తల్లివంటి దానవు. నీకు నా ప్రణామములు.
శ్లో. సర్వ దేవ మయే దేవీ!ర్వదేవైరలంకృతే!
మాభిలాషితం కర్మ సఫలం కురు నందిని.
ఆ.వె. దివ్యమైన సకల దేవతా రూపిణీ!
దేవతతికి నిలయ మీవె గోవ!
నిరుపమానవైన నీకు నా ప్రణతులు.
కోర్కెలెల్లతీర్చి కూర్చు శుభము.
భావము. ఓ గోమాతా! సర్వ దేవతా స్వరూపిణీ! సర్వ దేవతలచే అలంకరింపబడినదానా! నా కోర్కెలను సఫలము చేయుము.
జైహింద్.

3, సెప్టెంబర్ 2015, గురువారం

పురుష సూక్తము. తెలుగు భావ వివరణ సహితము.

1 comments

జైశ్రీరామ్.

జైహింద్.

2, సెప్టెంబర్ 2015, బుధవారం

www.తెలుగు భాగవతం.ఆర్గ్ ద్వితీయ వార్షికోత్సవము.

0 comments

జైశ్రీరామ్
జైహింద్.

1, సెప్టెంబర్ 2015, మంగళవారం

మన పూర్వీకులు శ్లోకరూపమున చేసిన విద్యుదుత్పత్తి వివరణము.

1 comments

జైశ్రీరామ్.
విద్యుదుత్పత్తి చేయు విధానము.
శ్లో. సంస్థాప్య మృణ్మయే పాత్రే తామ్రపత్రం సుసంస్మృతమ్!
ఛాదయే ఛ్ఛిఖిగ్రీవేన చార్థ్రాభిః కాష్ఠపాంసుభిః!!
దస్తాలోప్టో నిథాతవ్యః పారదాఛ్ఛాది దస్తతః!
సంయోగా జ్ఞాయతే తేజో మిత్రావరుణ సజ్ఞ్గితమ్!! (అగస్త్య సంహిత)
భావము. ఒక మట్టి కుండను తీసుకొని, దానిలో రాగి పలక పెట్టాలి. తరువాత దానిలో మైలు తుత్తం వేయాలి. తర్వాత మద్యలో తడిసిన ఱంపపు పొట్టువేయాలి. పైన పాదరసము మరియు యశదము (జింక్) వేయాలి తర్వాత తీగలను కలపాలి అప్పుడు దాని నుండి మిత్రావరుణ శక్తి ఉద్భవిస్తుంది
శ్లో. అనేన జలభంగోస్తి ప్రాణోదానేషు వాయుషు!
ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతః!!
వాయు బంధక వస్త్రేణ నిబద్దో యానమస్తకే!
ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్!!
భావము. ఒక వంద కుండల యెక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే, నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు, ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది. 
పాఠశాల విద్యార్థులకు ఈ ప్రయోగాలు సుపరిచితమే.
అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు.
1. తడిత్ – పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది.
2. సౌదామిని – రత్నముల ఘర్షణ నుండి పుట్టునది.
3. విద్యుత్ – మేఘముల ద్వారా పుట్టునది.
4. శతకుంభి – వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది
5. హృదని – స్టోర్ చేయబడిన విద్యుత్తు.
6. అశని – కర్రల రాపిడి నుండి పుట్టునది.

జైహింద్.