గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, సెప్టెంబర్ 2015, ఆదివారం

రవీంద్రభారతిలో జరిగిన తెలుగు భాగవతం.ఆర్గ్ ద్వితీయ వార్షికోత్సవమ్.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీకృష్ణాష్టమి పర్వదినమైన ౦౫-౯-౨౦౧౫ న రవీంద్రభారతిలో తెలుగు భాగవతం.ఆర్గు ద్వితీయ వార్షికోత్సవం అద్వితీయంగా జరిగింది. ఆ కార్యక్రమమునకు సంబంధించిన చిత్రాలను, నా ప్రసంగములో చోటు చేసుకొన్న నా పద్యములను తిలకించండి.
తెలుఁగు భాగవతం.ఆర్గ్ అధిపతి బ్రహ్మశ్రీ ఊలపక్కి సాంబశివరావు గారి నివేదన.
నా ప్రసంగము
ఊలపల్లి వారి సంస్కృతి
అపురూపమైన భరతనాట్యము చేస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న చిన్నారులు., 
 అపురూపమైన భరతనాట్యము చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి, 
నాద్వారా సత్కరింపఁబడుతున్న  చిన్నారి.
 శ్రీకృష్ణుని పాత్రలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి, 
నాద్వారా సత్కరింపఁబడుతున్న  చిన్నారి.
భరతనాట్యముతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన చిన్నారులు.
మహనీయులమధ్యకు దూరిపోయిన నేను
శ్రీబాలాంత్రపు వేంకటరమణ గారిని పరిచయం చేస్తున్న 
భాగవత గననాధ్యాయి శ్రీ సాంబశివరావు గారు.
భాగవత గననాధ్యాయిచే సత్కరింపఁబడుచున్న శ్రీ వేంకట రమణ గారు.
ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అధినేతకు సత్కృతి.
ఉ) శ్రీ నవనీత మానస విశిష్ట గుణాఢ్యులు. సత్ కవీశ్వరుల్,
మాన ధనాఢ్యులున్, సుగుణ మంజుల వాఙ్మహనీయ భాగ్యులున్,
జ్ఞాన సుపూజ్యులున్, వినుత జాల సుసోదర సోదరీమణుల్
నా నుడులన్ గ్రహించి, మది నన్ను గణింప నమస్కరించెదన్. 
క) జాలోపలబ్ధ భగవత్ - శీలముగా భాగవతము చేతికినొసగన్
జాలుదురని తలపోసియె - హేలగ సూచించె భవిత నిట పోతనయున్. 
గీ) *వందిమాగాధ సూత కైవార రవము - వసుమతీ సురకోటి దీవనల మ్రోత,
లనుగమింపగ సతులు సౌధాగ్ర శిఖర - జాలములనుండి ముత్యాల జాలమొలుక.(భాగవతం"10.667)  
బహు కంద గీత గర్భ చంపకమాల.
చ)  వర కవితాకృతిన్ తెలుగు భాగవతంబిల దీప్తమౌనుగా!
భర భవులన్తటన్ వెలుగు భాగవతుల్మన పేరు నిల్పుగా!
పుర నవనీతులౌ సుకవి పుంగవులెల్లను శోభఁ దేలుఁగా!
వర నవధాత్రిగాన్ సకల భాగ్య వసుంధర సంతసించుఁగా! 
గీ) అనుపముఁడు భాగవతముడాట్టార్గుపతికి, - మాన్యులైనట్టి తన్మిత్ర మండలికిని,
సభను గలయట్టి సన్మిత్ర సరసులకును. - వందనము సేతు శ్రీహరి భక్తులకును. 
ఉ) మంగళమౌత భాగవత మాన్యుల బ్లాగుకు, నూలపల్లికిన్,
మంగళముల్ కణాదకు, ఉమా శివ మూర్తికి, సద్దిలీపుకున్,
మంగళమౌత బండికిని, మంగళముల్ సభనున్నవారికిన్,
మంగళమౌత శ్రీహరికి, మంగళముల్ మన భారతాంబకున్. 
స్వస్తి.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భముగా జరిగిన వార్షికోత్సవ కార్య క్రమములను అందలి తమ ప్రసంగములు చిన్నారుల సత్కారములు వీనుల విందగు పద్యములను కన్నుల కింపగు చిత్రములతో మాకందించి నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.