గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, సెప్టెంబర్ 2015, శుక్రవారం

నమో గోభ్యః శ్రీమతీభ్యః ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయాభ్యయేవచ.
నమో బ్రహ్మ నుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమోనమః.
క. శ్రీమంత కామధేనువు 
ధీమంతపు సంతు, బ్రహ్మదేవ నుతోద్ధత్
శ్రీమద్గోమాతలకున్ 
క్షేమంబిడ వందనంబు చేసెద భక్తిన్.
భావము. శ్రీమంతంబులైన కామధేను సంతతులైన, బ్రహ్మచే స్తుతింపబడిన, పవిత్రములైన గోవులకు నా నమస్కారము.
శ్లో. గావో మమాగ్రతః నను గావోమే సంతు పృష్టతః.
గావోమే హృదయం నిత్యంవాం మధ్యే వసామ్యహమ్.
ఆ.వె. గోవులుండుగాక గొప్పగా నాముందు
వెనుకలందు నెపుడు, వినుతముగను.
నిలుచు నాదు మదిని నిరతము గోవులు.
మసలుదెపుడునాలమందలందు.
భావము. గోవులు నా ముందు వెనుకల నుండు గాక. గోవులే నాహృదయము. గోవుల మధ్య నివశించుచున్నాను.
శ్లో. సర్వతీర్థమయీం దేవీ! వేద దేవాత్మికాం శివమ్.
సురభిం యజ్ఞస్య జననీ! మాతరం త్వాం నమామ్యహమ్.
ఆ.వె. సర్వతీర్థములును సర్వ వేదంబులు
సర్వదేవతలును చక్కనెపుడు
కలిగియుండి శుభము కలిగించు గోమాత!
వందనములు సురభి భవ్య మాత!
భావము. సర్వ తీర్థములను నీలోనే కలిగిన ఓ గోమాతా! వేదములన్నియు నీలోనే ఉన్నవి.దేవతలందరు నీలోనే ఉండిరి. నీవు సర్వ శుభ రూపిణివి. ఓ సురభి మాతా! నీవు యజ్ఞమునకు తల్లివంటి దానవు. నీకు నా ప్రణామములు.
శ్లో. సర్వ దేవ మయే దేవీ!ర్వదేవైరలంకృతే!
మాభిలాషితం కర్మ సఫలం కురు నందిని.
ఆ.వె. దివ్యమైన సకల దేవతా రూపిణీ!
దేవతతికి నిలయ మీవె గోవ!
నిరుపమానవైన నీకు నా ప్రణతులు.
కోర్కెలెల్లతీర్చి కూర్చు శుభము.
భావము. ఓ గోమాతా! సర్వ దేవతా స్వరూపిణీ! సర్వ దేవతలచే అలంకరింపబడినదానా! నా కోర్కెలను సఫలము చేయుము.
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
గోమాతకు శిరసాభి శత వందనములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.