గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, మార్చి 2026, సోమవారం

అనేకకందగీత గర్భ చంపకమాల. శ్రీ పంతుల వేంకటేశ్వరరావు. తపస్వి.

 జైశ్రీరామ్

అనేకకందగీత గర్భ చంపకమాల

రచన .. తపస్వి

చంపకమాల.

స్మరహరుడా!భవుండ!శశిమౌళి!రమాపతిమిత్ర! భీమ!లే

వురధనముల్ బలంబులునుపూజనుచేయగశూలపాణి!శం

కర!వరదా!గిరీశ!భవ!కావరనన్నుమహానటా!దివా

కరవినుతా!యొసంగుముసుఖంబునుసాంబ!సదాశివ!ప్రభూ!

చంపకమాల గర్భస్థ కందము - 1

హరుడా!భవుండ!శశిమౌ

ళి!రమాపతిమిత్ర!భీమ!లేవురధనముల్

వరదా!గిరీశ!భవ!కా

వరనన్నుమహానటా!దివాకరవినుతా!

చంపకమాల గర్భస్థ కందము - 2

ధనముల్ బలంబులునుపూ

 జనుచేయగశూలపాణి!శంకర!వరదా!

వినుతా!యొసంగుముసుఖం

బునుసాంబ!సదాశివ!ప్రభూ!స్మరహరుడా!

చంపకమాల గర్భస్థ కందము - 3

వరదా!గిరీశ!భవ!కా

వరనన్నుమహానటా!దివాకరవినుతా!

హరహరుడా!భవుండ!మదనా

రి!రమాపతిమిత్ర!భీమ!లేవురధనముల్

చంపకమాల గర్భస్థ కందము - 4

వినుతా!యొసంగుముసుఖం

బునుసాంబ!సదాశివ!ప్రభూ!స్మరహరుడా!

ధనముల్ బలంబులునుపూ

జనుచేయగశూలపాణి!శంకర!వరదా!

      తపస్వివిజయవాడ 

🙏🙏మా మామగారి దివ్యాశీస్సులతో

తపస్వికి అభినందనలు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.