గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, మార్చి 2026, ఆదివారం

అనంతశాస్త్రం బహువేదితవ్యం ... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

||శ్లో|| అనంతశాస్త్రం బహువేదితవ్యం,
స్వల్పశ్చకాలో బహవశ్చ విఘ్నాః|
యత్సార భూతం తదుపాసితవ్యం,
హంసో యథా క్షీరమివాంబు మిశ్రమ్||

తే.గీ. నేర్వ శాస్త్రమనంతము, నిశ్చయముగ,
కాలమది స్వల్పమే, మనకు విఘ్నములు పెక్కు,
క్షీరనీరములను హంస క్షీరమొకటె
కొనువిధంబుగ, సారమే క్రోలవలయు.
భావము. మనకు అనంతములైన శాస్త్రములున్నాయి. తెలుసుకోవలసిన
విషయం మహాసముద్రమంతుంది. వున్న సమయమా, చాలా తక్కువ.
మరి విఘ్నములో లెక్క లేనన్ని. కావున, అత్యంత విలువైన విషయాలపైన
మనమే దృష్టి పెట్టి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవలెను.
ఏ విధముగా అయితే హంస "క్షీరనీర న్యాయం" అనుసరిస్తుందో,
అదే విధముగా మనము కూడా సదసత్ విచక్షణ కలిగి ఉత్తమమైన వాటిని
నేర్చుకునే ప్రయత్నము చేయవలెను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.