గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, మార్చి 2026, బుధవారం

విభూషణాయమహతే - మేలిమి బంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్. 

శ్లో. విభూషణాయమహతే  -  తృష్ణా తిమిరహారిణే,

నమః సంతోషరత్నాయ  -  సేవావిష వినాశినే.


తే.గీ.  తృప్తి సంతోషమొసఁగెడి దివ్యరత్మ

మదియె నశియింపఁజేయు దురాశనిశిని,

విషసమానమౌ సేవక వృత్తి మాపు,

నట్టిసంతోషమునకు నేనంజలింతు.


భావము:  "సంతృప్తి" అనే మహారత్నము మంచి అలంకారము. దురాశ అను 

చీకటిని తొలగించును. "సేవ" అనే  విషాన్ని   నశింపజేయును. కనుక 

సంతోషము అనెడి రత్నమునకు నమస్కారము.


అమ్మ దయతో

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.