జైశ్రీరామ్
అణిమా ఛందాంతర్గత పంక్తి ఛందము,
వెలసిన వృత్తములు,1024.
రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,
జుత్తాడ,
10.పంక్తి ఛందము,
ఇందుగల 1024ఛందములలో గుర్వంత్యములు512 మాత్రమే.
వాటిని మదించి,శక్త్యాను సారము ఛందోదర్పణ మందుంచితిని,
ఈఛందమున పద్య ప్రతీ పాదమున10.అక్షరము లుండును,
ప్రాస నియమము కలదు,
1.రసనీ వృత్తము,
నేవ మేర్చుచు!నీతి నిలుమా!
నీవశంబయి!నిల్చు!పదవుల్!!
నే వచించెదు!నీదుశప్రతిభన్!
సేవ జీవము!నింపు సుఖమున్!
రసనీ వృత్తము,ర,స,న,గ,గణములుండును,యతి6.వ యక్షరము,వృ,సం;475.
2.సురాశ్రిత వృత్తము,
శ్రీరాజ!శ్రీకార!సురాశ్రికా!
మా రామ!శ్రీరామ!తమోప హా!
మారాజ!శ్రీలేమ!సుమాశ్రితా!
మా!రాజితః సోమ!నమామి రా!
సురాశ్రిత వృత్తము,త,త,జ,గ,గణము లుండును,యతి 6.వ యక్షరము,వృ,సం:357.
3.చేరువ వృత్తము
మిడిసే వేలను?మేలు గనూ!
ఘడియల్డాసిన!కాలుదువే!
తుడియుం!శ్రీలను!ద్రోలును పో!
వడి ప్రార్ధింపుమి!భద్రు నిలన్!
భద్ర+అని రక్షకుడా యని,
చేరువ వృత్తము,స,భ,భ,గ,గణములుండౌను,యతి,7.వ యకంషరము,వృ,సం:436.
4.నిదానీ వృత్తము,.
వేద భాష్య వెకిలి తీరుకా!
నాది రోజు నగునె?భారతీ!
బోధి సత్వ!బుధత!నేర్చునే?
ఛీదరించి!చిదుమ!జూడుమా!
నిదానీ వృత్తము,ర,న,జ,గ,గణము లుండును,యతి5.వ,యక్షరము,వృ,సం:379.
5.భజామి వృత్తము,.
భద్రం కర్ణుని భజించు మదిన్!
ఛిద్రం బొందక!సృజించు మహిన్!
భద్రం జీవిగ!వజీరు వవన్
క్షుద్రం బొప్పక! సు జీవమగున్!
భజామి వృత్తము,మ,న,భ,గ,గణము లుండును,యతి,6.వ,యక్షరము,వృ,సం:431.
6.రయజగా వృత్తము,
పాప భూషలున్!వ్యస్ధమే!కదా?
కా పురుషులున్!కర్ధ మాళురే?
పాపు లిద్ధరన్!వర్ధమానులే?
చేపు పాపమున్!శ్రద్ధ నౌనొకో?
రయజగా వృత్తము,ర,య,జ,గ,గణము లుండును,యతి.6.వ,యక్షరము,వృ,సం,331.
7.ఊహక వృత్తము,
వారి శిరోరుధారి వరదున్!
నేరిపె!చిత్ర గర్భ నిరతుల్!
సా రసమా!తెఱంగు!చరితన్!
పారగు సత్కరాన!వరతన్!
ఊహక వృత్తము,భ,ర,న,గ,గణములు,యతి 8వయక్షరము,వృ,సం;247.
8.నరజగా వృత్తము,
వరద సోమ!శ్రీ వరామ రా!
సిరుల ప్రోవు!నీ జపంబురా!
గిరి ధరుండ!శ్రీకి!వల్లభా!
పరము డీవు!నా భవుండవే!
నరజగా వృత్తము,న,ర,జ,గ,గణములు,యతి.7వ,యక్షరము,వృ,సం:344..
9.భా రజాంగి వృత్తము,
నేవము లేని నేర్పరే వయా!
భావన లేని భక్తి భాసురా!
శ్రీవర మెట్లు?జీరు సన్నిధిన్!
బ్రోవ నుమాధవు న్భజింపరా!
భారజాంగి వృత్తము,భ,ర,జ,గ,గణము లుండును,యతి 6.వ,యక్షరము,వృ,సం:345.
10.న భీరగా వృత్తము,
నరుల పాలిట!నారసింహా!
పరుల కాచెడి!భాగ్య దేవా!
నిరుపమెంచుమ!నీతి జాతిన్!
గురు తపంబున!గోరు చుంటిన్!
న భీరగా వృత్తము,న,భ,ర,గ,గణము లుండును,యతి 7.వ యక్షరము,వృ,సం:184.
11.నద్వయజగా వృత్తము,
నరము లనరు ననారతన్!
చరము నమరు శరీరమున్!
వరము కురుత!పరంతపా!
నిరత స్థిరత!నిమీలతన్!
నద్వయ జగా వృత్తము,న,న,జ,గ,గణము లుండును,యతి7.వ,యక్షరము,వృసం:384.
12.నయుత ద్విభగ వృత్తము,
పెరల మాటలు భీతి నిడున్!
తిరము గావవి!తీరు చెడున్!
సిరులు పొందగ!శ్రీ హరి నిన్!
గురు తపంబున!గొల్వ వలెన్!
నయుత ద్విభగ,వృత్తము,న,భ,భ,గ,గణము లుండును,యతి,,7.వ యక్షరము,వృ,సం:430.
13.త్రిభగా వృత్తము,
నీమము మీరకు!నీతి యదే!
సామము సర్వద!సాకరమౌ!
రామము రామము!రామ మయమ్!
సోమము నీమము!శూలి వరమ్!
సాగర సంగమ సవ్వడులే!
భా గణ భీమక!బాధితముల్!
రాగిణి!యాగత రాగతముల్!
నాగిని!నృత్యపు!నాట్య తతుల్!
త్రిభగా వృత్తము,భ,భ,భ,గ,గణము లుండును,యతి,7.వ యక్షరము,వృ,సం:439.
14.భరభాగ వృత్తము
నేరము జేయ రానేరకుమా!
వీరము జూపరా వేటికిటన్?
కూరిమి ముక్తినిం గోరు మిలన్!
జీరుమి!శాంతమున్!జీవి వయున్!
భరభాగ వృత్తము,భ,ర,భ,గ,గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం:407.,
15.త్రినగా వృత్తము,
చరిత నిలుచు చతురుడా!
వరము లరయు!పరముచే!
కరము పరుల కదలికల్!
పరుల నెలుప!కదలుమా!
త్రి నగా వృత్తము,న,న,న,గ,గణము లుండునుశయతి,7.వ యక్షరము,వృసం;512..
16.జననగా వృత్తము,
వరాల నిడెడు!వరదమున్!
చిరాశ!వరదు!శివతమున్!
పరోప!కరుని!పరమునిన్!
నిరంత తపత!నెరిగెదన్!
జననగా వృత్తము,జ,న,న,గ,గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం:510.
17.యననగా వృత్తము,
పరార్ధాలు విడి!బ్రతికెదన్!
నిరార్ధంబు దరి!నిల్వకన్!
వరార్ధాలు గని వరలెదన్!
వరీయాలు గని!వలచెదన్!
యననగా వృత్తము,య,న,న,గ,గణములుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం:536.
18.నుతగణ వృత్తము,
నిగమ సారంబు!నీవే!శివా!
ప్రగతి సారింతు!వీవే!సుమా!
సుగతి చూపంగ!సూరీ వెగా!
తగు తగం బ్రోవ!ధర్మాత్మ రా!
నుతగణ వృత్తము,న,త,త,గ,గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృ.సం:296.
19.త్రిత గార్ణవ వృత్తము,
నేడేమొ?రేపేమొ?నీ వెంచవే!
పాడేమొ?పీడేమొ?పట్టింపవా!
ఏడేడు లోకాలు!యీడేదిరా!
చేడేల?జీవించు!శీలంబు నన్!
త్రిత గార్ణవ వృత్తము,త,త,త,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:292..
20.గురుతాగ్రణీ వృత్తము,
యోగిణి రాగిణిన్!హేరంబు నిన్!
త్యాగిణి భోగిణిన్!తా దృశ్యతన్!
రాగ సరోరివా! రమ్యం బగున్!
నాగ!విభూషణా!నన్నేల!రా!
గురుతాగ్రణీ వృత్తము,భ,ర,త,గ,గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం:279.
21.నతోనగ వృత్తము,
వరదు డీవేను!పరముడా!
సుర దయాంబోధి!చొరు మయా!
పరుడ గానేను!వరదుడన్!
సిరి వరాజీవె? శివమిడన్!
నతోనగ వృత్తము,న,త,న,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:488.
22.సా మనంగ,వృత్తము,
వరదం బీవేరా!పరముడా!
సు రతింగొల్తుంరా !సురవరా!
పరమంబెంచంగా!వలెను రా!
సిరు లావేశంబౌ!చివరి కిన్!
సా మనంగ వృత్తము,స,మ,న,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:452.
23.సావధాన,వృత్తము,
మా వారేలనొ?రమ్మన నంగా!
నీవే!నా మదిలో!నిలి చేవే!
నేవే!రా వనుచో!నిరసంబౌ!
చావేలే?తుదికిన్!శరణంబౌ!
సావధాన వృత్తము,మ,స,స,గ,గణములుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం;217.
24.సమసాగినీ వృత్తము,
సరి రాదేదీ?నీసరి నెంచుమ్!
మరపే!తోడౌచున్!మరి రాదే!
తరుగేదీ?బీదాతప మేగా!
కొరుకం!పండ్లేవీ? గుణ ధీరా!
సమ సాగినీ వృత్తము,స,మ,స,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం;196.
25.గరిమాతి వృత్తము,
చరితం నిలువం చాతుర్యంబే!
గరిమం బనుచో?కాలం తీరున్!
నిరతుం డనుచో?నేర్పౌ!జ్ఞానమ్!
పిరి కేలనయా? బీరా వేశా!
గరిమాతి వృత్తము,స,స,మ,గ,గణములుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:28.
26.చతురతా వృత్తము,
నరుడ!నేనంచుం!నటనేలన్?
చరుడ వీవంచుం!తలపేదీ?
పరువ మేమౌనో?పడు రోజున్!
తిరిగి రాదేదీ?తెలి వెంచుమ్!
చతురతా వృత్తము,న,మ,స,గ,గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం:232.
27.రంభజా వృత్తము,
రాము డీవే!నయ!రమంబునన్!
కామిదా లిచ్చెడు!క్రమంబునన్!
నీమజుండీవయ!నిరామయా!
నా మదిం నిల్చుమా!నరేశ్వరా!
రంభజా వృత్తము,ర,భ,జ,గ,గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం:371.
28.రంభోర్మిల వృత్తము,
రావురా!పారగా!రాజితుడా!
మా వరా!బ్రోవగా!మా పితవై!
నా వరాశీవన!నమ్మితిరా!
శ్రీవరా!జీవక!చేరు ననున్!
రంభోర్మిల వృత్తము,ర,భ,భ,గ,గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృ.సం:425.
29.మనోవికార వృత్తము,
మనోవికార!మార్భటాయెనే!
వినాశ చింతన!వీర మేర్చెననే!
సనాతనం బది జారి పోయెనే!
వినూత్న చైదము విశ్వ మంటెనే!
మనోవికార వృత్తము,జ,భ,ర,గ,గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృ.సం;182.
30.భారతీ వృత్తము,
భావము!భక్తియు!భాసిలంగన్!
శ్రీ వరదంబులు శ్రేయ మేర్చెన్!
జీవన సౌఖ్యము!శ్రీ వరంబై!
నేత లనంతము!నీతి నిల్చెన్!
భారతీ వృత్తము,భ,భ,ర,గ,గణము లుండును,యతి7.వ,యక్షరము,వృ,సం:181.
31.కోమలా వృత్తము,
కోమలం బేదియు?కోర రిలన్!
స్వామి కార్యంబున!జారుదురే!
నీమ నీత్యాదులు!నేర మయెన్!
కామితార్ధంబుల!కాల మయెన్!
కోమలా వృత్తము,ర,భ,భ,గ,గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం:435.
32.ముక్తిపద వృత్తము,
భారము నీదని బ్రతికితిన్!
సారము జీరని జగమయెన్!
పారము!లేదిక?భవ హరా!
కోరెదు!మోక్షము!గుణ గణున్!
ముక్తి పద వృత్తము,భ,భ,న,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:493.
33.క్షీరదా వృత్తము,
భీరము లలమ!భీతియే గా!
శూరత బలుక!క్షోభయే!లే!
క్షీరదము లవి!శ్రీ వరాలే!
మారనిమనసు!మాధవంబౌ!
క్షీరదా వృత్తము,భ,న,ర,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:191.
34.భద్రతా వృత్తము,
హరి!గనంగనౌ!హాయి సదా!
బరి తెగించుచొ!పాడు గనున్!
నిరత!నీమత!నిండు గనున్!
పరము గాంచుమ!భద్ర మదే!
భద్రతా వృత్తము,న,ర,భ,గ,గణము లుండును,యతి7.వ,యక్షరము,వృ,సం;408.
35.క్షేమదా వృత్తము,
విరులే!హారమై!ప్రీతి నిడున్!
సిరు లేపారగన్!క్షేమమగున్!
వర వృక్షంలుం వారు లిలన్!
పరమౌ!భాగ్యముల్భద్ర భువిన్!
క్షేమదా వృత్తము,స,ర,భ,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:304.
36.భావరమ్య,వృత్తము,
విరులే!హారము!ప్రీతేర్చుగా
సిరులే! పారగ!క్షేమంబగున్
వరమౌ!భూధర!వారంబు లే!
పరమే!రమ్య!స్వభావం బగున్!
భావరమ్య వృత్తము,స,భ,త,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:308.
37.జరజగా వృత్తము,
సుధీయ పాలనే!శుభాభిదమ్!
బుధాశ్రి జీవమే!పురోగతిమ్!
నిధాన చర్యలే!నిధీ బుధమ్!
సుధీ వరామమే!సుగంథినమ్!
జరజగా వృత్తము,జ,ర,జ,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:192.
38.ప్రభూతి వృత్తము,
సరే యనంగను!సరౌనెపో?
విరాగ మేలయా?వెరంగదే!
పరోపకారమె!ప్రభూతిదమ్!
వరీయ పాలనే?వరం ప్రభుమ్!
ప్రభూతి వృత్తము,జ,భ,జ,గ ,గణము లుండును,,యతి7.వ,యక్షరము,వృ,సం;374. 39.సురతేజ వృత్తము,
వరదమ నీతి వాసమనన్
సురసన తేజ సోమ మగున్
గురుచరణాలు గొల్వవలెన్
తరియుదు వీవు దివ్యమదే!
సురతేజ వృత్తము న,జ,భ,గ గణము లుండును,,యతి7.వ,యక్షరము,వృ,సం;432
40.ప్రణమిలు వృత్తము,
విభూతి భూతిద!విశారదున్
నభోంతరాళ!ప్రణామునిన్!
సు భూతి భూతి!విశుద్ధునిన్!
ప్రబోధి!గొల్తు!ప్రభు న్శెవున్!
ప్రణమిలు వృత్తము,జ,భ,జ,గ గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం:438.
41.రమ్యతా వృత్తము,
సౌమ్యుడ వీవు!సర్వ మీవె!
రమ్య రమణీయ!రాజి వీవె!
గుమ్యమగు తీరు గావ రావె!
తమ్యహము మాపు!దైవ మీవె!
రమ్యతా వృత్తము,భ,జ,ర,గ,గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం;175.
42.బెడగెడంగు వృత్తము,
నడం గలనేను!నా మనానన్!
బెడంగెడమాయె!గె!!ప్రీతి గావన్?
కడంగిడ మాని! కావ రావే?
వడిం శివ మేర్చ భద్ర రుద్రా!
బెడగెడంగు వృత్తము,జ,జ,రగ,గణము లుండును,యతి 7.వ,యక్షరము,వృ,సం:174.
43..రాగరంజినీ వృత్తము,
చరించు జీవమా!జరతకున్!
భరంబు!తల్పకన్!వరలుమా!
సరాగ రంజితన్!చరిత మౌ!
విరాగి నీమతం!వెలుంగుమా!
రాగ రంజినీ!వృత్తము,జ,ర,న,గ,వృత్తము లుండును,యతి .7.వ,యక్షరము,వృ,సం:470.
44..సచ్ఛరితా వృత్తము,
వచ్చు నే విలను!వరాశలే!
పెచ్చు లన్నిటను!విచారమే!
మెచ్చగా!నదుమ!ప్రభావతన్
నచ్చగాబ్రతుకు!నరుండనన్!!
సచ్ఛరితా వృత్తము,ర,న,జ,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:379.
45.ప్రభూతి వృత్తము,
సరే యనంగను!సరౌనె పో?
విరాగ మేలయ?వెడం గదే!
పరోప కారమె?ప్రభూతిదమ్!
వరియ పాలనె!పరంబిడున్ఖఋఛధ
ప్రభూతి వృత్తము,జ,భ,జ,గ,గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం:347.
46..శోభాయన వృత్తము,
సుధీయ!పాలనే!శోభాయమౌ!
బుధాశ్రి జీవమే!పూజ్య మిడున్!
నిధాన చర్యలే!!నేవం బిడున్!
సుధీ వరామమే!శోభించును లే!
శోభాయన వృత్తము,జ,ర,త.గ,గణము లుండును,యతి,7.వ,యక్షరము,,వృ,సం,279.
47..నీరజ వృత్తముమ
మారుతీ వరీయ వరంబులన్!
సారసా సరోరు సరాగముల్!
నీరజాతముల్! వని కింపిడెన్!
గారవంబునన్!సుకవిం బలెన్!
నీరజ వృత్తము,ర,జ,జ,గ,గణములుండును,యతి7.వ,యక్షరమునకు చెల్లును,వృ,సం:363.
48..మదీయ వృత్తము,
మారామేల?నయా!మదీయుడా!
క్షీరాంబోధి సిరిం జెలంగుమా!
బీరంబేల?నయా!వెరంగదే?
పోరాటం బదియే!పునీతమా!
మదీయ వృత్తము,మ,స,జ,గ, గణములుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:245.
49.పురోగమ వృత్తము,
సరాగ వరాగమ్! సమతేర్చన్!
పురోగతి గూర్చున్!బుధ మేర్చున్!
సురామ వరామం సురదంబే!
వరాల సురేశు!పరమాత్మున్!
పురోగమ వృత్తము,స,జ,స,గ,గణము లుండును,యతి7.వ,యక్షరము,వృ.సం:204..
50.కాజేయు వృత్తము,
పురాల వరతన్ బ్రోచేవులే!
కరాళ కటుతన్!కాజేతువీ!
నిరాశ నరులన్!నేర్పెంచెదే
గరీయ శివతం!గాపాడవే!
కాజేయు వృత్తము,జ,స,త,గ,గణములుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:286.
51..భాగ్యదా వృత్తము,
కరమౌ!స్తుత్యంబు కాపాడులే!
స్థిరమౌ!కీర్తెంచు!జీవార్భటిన్!
వరమౌ!భోగ్యంబె!భాగ్యంబిలన్!
పరమే!మోక్షంబు భక్తాళికిన్!
భాగ్యదా వృత్తము,స,త,త,గ, గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం:290.
52..విధించు వృత్తము,
యేదేదొ?పల్కంగ యిరికించున్!
వేదాల భావాలు!విధియించున్!
శోధించు నయ్యది!సుథ నొందున్!
ఛేదంబు దోషాల పెకలించున్!
విధించు వృత్తము,త,త,స,గ,గణములుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం:229.
53.తపనీ వృత్తము,
తాతయ!తనదౌ!తపంబునన్!
వ్రాతెంచి పలుకన్!వరంబులన్!
పోతెంచు భవముల్!పొడం గనున్!
గాతెంచి తినుమా!క్రమంబు నన్!
తపని వృత్తము,భ,స,జ,గ,గణములుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:351.
54..శ్రమతా వృత్తము,
గమించు సరళే!కాల్జేర్చున్లే!
శ్రమించు తనువే!సౌభాగ్యంబౌ!
రమించు బ్రతుకే!రాగార్ణంబౌ!
నమామి బుధతే!నారాధ్యైబౌ!
శ్రమతా వృత్తము,జ,స,మ,గ,గణములైడును,యతి.7.వ,యక్షరము,వృ,సం;30.
55..స్వమత వృత్తము,
సమతం బేదేనా?సాధింతువే!
మమతే!లేదాయెనే?మర్మాంబుధే!
కమతం బెంచేలె!కామంబయెన్!
స్వ మతంబైచే లే!సాగెన్భు విన్!
స్వమత వృత్తము,స,మ,త,గ,గణము లుండును,యతి 7.వ,యక్షరము,వృ,సం:260.
56.గరీయతా వృత్తము,
శ్రీమదెంచె దేను శివంబవన్!
నా మదేది నీదన బోకుమా!
క్షేమ మెంచినాడ!చిరంబుగన్!
కామిదాల దీర్చు గరీయతన్!
గరీయతా వృత్తము,ర,జ,జ,గ,గణములుండును,యతి7.వ,యక్షరము,వృ,సం:219.
57.శ్రీ వీవే వృత్తము,
మామాశ్రీ నీవేనా!మామకమై!
లేమాశ్రీ రామంబే!లీల గనెన్!
కౌమారీ కాదంబీ!కామితమై!
క్షేమంబై!హర్మ్యంబై! శ్రీలిడగన్!
శ్రీవీవే వృత్తము,మ,మ,భ,గ,గణమౌలుండును,యతి ,7.వ,యక్షరము,వృ,సం;385.
58..నీమార్తి వృత్తము,
నీమంబారంగ నీ నేర్తువయా!
శ్రీమంతంబే గనున్!శ్రీలవియే!
రామంబే!రమ్యమౌ!రామమదే!
కామార్తే!భీమమౌ!కామిదమై!
నీమార్తి వృత్తము,మ,ర,భ,గ, గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం:401.
59..కామిద వృత్తము,
మోసమే!నాగమై!ముద్దిడున్లే!
పాశమే!దోషమై!పాడిడున్లే!
నాశమే!యార్ద్రమై!నార్తిడున్లే!
శాశనే! శాసనై! శాశిలున్లే!
కామిద వృత్తము,ర,ర,ర,గ,గణములుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం;147.
60..కమనీయ వృత్తము,
కమనీయంబే. దీ కాలమునన్!
రమణీయంబౌనే?రాజ్యమునన్!
శ్రమయే!దక్కున్లే?జాలమునన్!
గమియం!పర్మంబున్గా దిక చోన్!
కమనీయ వృత్తము,స,మ,భ,గ,గణములుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:388.
61.పూజార్హ వృత్తము,
రాజాధి రాజరా!నర పాలా!
పూజార్హ రాముడా!భువనేశా!
భోజార్హ కీర్తివే!భువి లోనన్!
నీజన్మ మీశ్వరం!నిథి యౌన్లే!
పూజార్హ వృత్తము,త,ర,స,గ,గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృసం:213.
62.సంచిత వృత్తము,
మంచిగా!జీవించే!మహితుడా!
కొంచెమే?లేదెంచ!గురుగుణా!
సంచితార్ధా లెంచన్!సరిసరే!
వంచనం బెంచన్!వరదమా?
సంచిత వృత్తము,ర,మ,స,గ,గణములుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:451.
63.తారసిలు వృత్తము,
సమ సామ్యంబది!సాగునొకో?
తమ స్వార్ధంబులు!తారసిలన్!
మమతా!రాగము మాటలకే!
చరితో ద్వర్తన!సార మిదే!
తారసిలు వృత్తము,స,భ,భ గ,గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం:244.
64.పరాశ్రి,వృత్తము,
పరమేశంబది!భాగ్యమే నౌ!
పరదాస్యంబిల!పాపమౌలే
నర మేథంబెపొ?నాణ్యమౌతన్!
సుర సేవ్యంబది శోభనౌ!లే!
పరాశ్రి వృత్తము,స,భ,ర,గ,గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం:180.
65..జయదమ వృత్తము,
బోధన జేయుమా!బుధ నుతిన్!
సాధన సర్వద!జయమిడున్!
కాదన రాదుర కలిమినిన్!
వేదన లేలయ?విధుల లోన్!
జయదమ వృత్తము,భ,ర,న,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:471.
66.రాజీవా వృత్తము,
రా దదేది?గను రాజీవాక్షా!
పోదు వేదినమొ?పొంకంబేలన్!
సాధనం బదియే?సర్వేశంబౌ!
వేదివై దనరు!విశ్వాశానన్!
రాజీవా వృత్తము,ర,న,మ,గ, గణము లుండును,యత్,7.వ,యక్షరము,వృ,సం:59..
67.నరేశ వృత్తము,
నరుల పాలించే!నరేశుండే!
వరదమా లిచ్చే పరంతపా!
సిరి వరాలీవే!చిరన్మయా!
చర చరాలందే?జగంబనన్!
నరేశ వృత్తము,న,మ,య,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:72.
68.మితి మీరు వృత్తము,
కోరుకొందు నయ్యా!సుఖంబులున్!
చేర నేర నోయీ?చికాకులున్!
మేర దాట లేనూ?మితిం సదా!
చారు విక్రమానం!చరింతు నే!
మితి మీరు వృత్తము,ర,జ,జ,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:363.
69..సారనిథి వృత్తము,
నమకా చమకానంద మయిన్!
సమతా!మమతా!సార నిథిన్!
గమితా!వరతా!గారబునిన్!
క్రమతా!కురుతా!కామిదముల్!
సార నిథి వృత్తము,స,స,భ,గ,గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృ.సం:412.
70..ఆగత,వృత్తము,
కంగా రేల నోయీ?కలియందున్!
సింగారంబు లేలెన్!స్థిరమౌచున్!
రంగండేలా?రాడో!రస నేలన్!
భంగాలందె!జీవా!భవియూహల్!
ఆగత వృత్తము,మ,య,స,గ,గణములుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం:201.
71.వాసిలు వృత్తము,
వాసంబీ!ధరలో!పాశంబేరా!
భాసిల్లే వసువుల్!వాస మౌనే?
గాసిల్లే!వరము ల్కాటు వేయున్!
వాసాలే!తుదికి వాస మాపున్!
వాసిలు వృత్తము,మ,స,ర,గ,గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం:153.
72..బుద్ధిమత వృత్తము,
రాజకీయ మదే?రాగమయమ్!
రాజ నీతి వరం!రామ మయమ్!
భూజ రాజి తమం!బుద్ధి మతామ్!
నాజి వీరవరం!నామ మిదమ్!
బుద్ధిమత వృత్తము,ర,స,భ,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:395.
73..నీరదా వృత్తము,
వారధీ!నీరజ!పరమేశా!
సారధీవే?నయా!జగధీశా!
చేరుమా!కావగ!స్థిరు డీవే!
భారమే!నీదయా!పరమాత్మా!
నీరదా వృత్తము, ర,భ,స,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృ.సం:243.
74..వీఠజా వృత్తము,
వారిద నీర మీవయ!శూలీ!
శారద! రాత్రులం!జయు డీవే!
ధీరమా!వీరజా! దివి వీవే?
చేరెద!నీదరిం!శివ యంచున్!
వీరజా వృత్తము,భ,ర,స,గ,గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం;219.
75..వరామయ వృత్తము,
శారద!నీరదా!సరోరుహా!
వారిద భీమరా!వరామయా!
పారగ నేరనే!పరాత్పరా!
చేరుమి!నా దరిం!శివానితోన్!
వరామయ వృత్తము,భ,ర,జ,గ,గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృ.సం:359.
76.వారణీయ వృత్తము,
వలదంచు మావారు వారించిరే!
విలువెంచ దేమాయె?వీరంబొకో!
తలవంచి తర్కించి ధర్మంబుకై!
నిలువంగ రారేమి?నేర్మెంచకన్!
వారణీయ వృత్తము,స,త,త,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:420.
77..పాలయా వృత్తము,
త్రాతీవు!దాతీవు!నను గనన్!
పోతెంచు!పాపాలు!పురుషతన్!
వ్రాతెంచి రక్షించు!వరదయన్!
నీతెంచి పాలించు!నిరతమున్!
పాలయా వృత్తము,త,త,న,గ,గణములుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం:485.
78..పురుషతా వృత్తము,
శ్రీకాంత వరము!స్థిర మౌనే?
రాకాసుల!చెడు!నడతేలన్?
పోకెంచి నడువ!పురుషంబౌ!
రాకెంచు సిరుల!రమ మారన్!
పురుషతా వృత్తము,త,న,స,గ,గణములుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:253.
79..నడవడి వృత్తము,
చెడు నడతయే!జీవ కర్మమ్!
కడ గడగుటే!కర్మ మౌగా!
సుడి విడినచో?సోకు నీతిన్!
పుడిసెడు జలం!పుణ్య మిడున్!
నడవడి వృత్తము,న,స,ర,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:160.
80.వర్ధిత వృత్తము,
వరమౌ!జీవనే!వర్ధితంబౌ!
చిరమౌ!కీర్తియే!జీవ ధాత్రౌ!
భరమేదీ?భువిన్!బంధమేగా!
నిరతంబెంచుమా!నేర్ప రౌచున్!
వర్ధిత వృత్తము,స,ర,ర,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:148.
81..గమి జేరు వృత్తము,
జీవమా రామమే!శివ మౌలే!
భావముం భక్తియుం!పరమే!లే!
కావరం బూనకం!గమి జేర్మా!
పావనం బెంచుమా!భద్ర మేర్చన్!
గమిజేరు వృత్తము,ర,ర,స,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము వృ.సం:211.
82..నిగమా వృత్తము,
రాగ మాలికలే?రమ్యంబిడున్,!
భోగమే!నిరతిం పూజ్యంబొకో?
త్యాగివై!చరితం!తారాడుమా!
నీగమం!నిగమం!నిల్పోపుతన్!
నిగమా వృత్తము,ర,స,త,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:283.
83.వినుతించు వృత్తము,
వినుతింతు!నిన్నే!విశ్వేశ్వరా!
కనులార చూడం!కన్పించవా?
మనసంత నీపై!మాటేసురా!
కనరాని కష్టాలు!కానీకుమా!
వినుతించు వృత్తము,స,య,త,గ,గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం:268.
84..రాజీవ వృత్తము,
రామకా!సోమకా!రాజీవ రా!
భీమకా!భద్రకా!భీతార్ప రా!
నీమకా!నామకా!నీతీవె రా!
తావకా!గావరా!ధర్మేశ్వరా!
రాజీవ వృత్తము,ర,ర,త,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:275.
85..పరమా వృత్తము,
పారమేది?బుధ పరమంబే?
నేర కేగు టది!నిరుపంబౌ!
చేరి కొల్వ హరు!శివమౌ లే!
కోరి పిల్వ నిలు!గురు వంబౌ!
పరమా వృత్తము,రన,స,గ,గణములుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:251.
86..చారుశీల వృత్తము,
పోరుటేగు టదే!పుణ్య మౌనే?
నీరసింతు వయా!నీరు లేకన్!
పౌర నీతి గనం!పార మౌ లే!
చారు శీలమునన్!సర్వ మేవే!
చారు శీల వృత్తము,ర,స,ర,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం;155.
87..ఉపశమన,వృత్తము,
కరోతి సుఖాలు!కరమౌ లే!
వరాల సురాలు వరదా లే!
పరోప శమాలు!పరమే లే!
విరించి వరించు!వినోదా లే!
ఉపశమన వృత్తము,జ,జ,స,గ,గణములుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం:238.
88.చిందిలు వృత్తము,
బంధుడ వీవేగా?పరమాత్మా!
సుందర మందిరా!సుర ధీరా!
వందనమందవె?భవ హారీ!
చిందులు త్రొక్కెదన్!శివ మీవే!
చిందిలు వృత్తము,భ,ర,స,గ,గణములుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం;215.
89..వాజపేయ వృత్తము,
రాజితా లవియే!రసం గనెన్!
పూజితా లలమెన్!పురంధరా!
మా జరా భరముల్!మహేశు వే!
వాజపేయ ఫలం!వరంబిడున్!
వాజపేయ వృత్తము,ర,స,జ,గ,గణములుండును,యతి,7.వ,యక్షరము,వృ.సం:345.
90..నిరామయ వృత్తము,
సరసీ వరాశ్రి సరోరుహా!
నిరసింతు వేమి?నిరామయా!
భరమెంచరాదు!ప్రమాణతన్!
చర జీవ రక్ష చరింపవా?
నిరామయ వృత్తము,స,జ,జ,గ,గణములుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం:364..
91.చటాపట వృత్తము,
నటీ నటాను నటనమే!
పటా పటోప వరదమౌ!
ఘటీ గటాను గమకమే?
చటా నటాను చరితమౌ!
చటాపట వృత్తము,జ,జ,న,గ,గణములుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:494.
92..వరామ వృత్తము,
సరాగ భరిత సారములే!
విరాగి మథుర వీవనలౌ!
వరాది వసుథ భావనముల్!
వరామ భరిత!వాదనలే!
వరమ వృత్తము,జ,న,భ,గ, గణములుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:446.
93..కరణ వృత్తము,
చిరాయు వరయం!శ్రీవరంబౌ!
వరామ సిరులం!భద్రు డీయున్!
పరోపకరణం!భాగ్య మేర్చున్!
తరింపు యవనిం!ధర్మ చర్యలే!
కరణ వృత్తము,జ,స,ర,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:238.
94.చారణ వృత్తము,
భారణమునను!భవుండవే!
చారణమునను!స రాముడవే!
తారకుడ వయ!ధరా తలిన్!
వీర వర శివ !భిషక్కువే!
చారణ వృత్తము,భ,న,జ,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:383.
95.మెట్టిడు వృత్తము,
ఉట్టెల వెన్నలు యూడ్చితీవే!
గట్టివి!దిట్టవు!కన్న డీవే!
మెట్టెడి!స్వర్గపు!మోద మందన్!
పట్టితి!నిన్నిట!బాంధవంబున్!
మెట్టిడు వృత్తము,భ,భ,ర,గ,గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం;183.
96..కలాప వృత్తము,
లలాటం వ్రాసే!వ్రాతేగా!నిటన్!
విలాపంబేరా!వేధించెడిన్!
సలాపంబెంచేవా!సాధింతవే!
కాలాపంబుల్!శ్రీలౌ!కల్యాణతన్!
కలాప వృత్తము,య,మ,త,గ,గణములుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం:258.
97..బెడంగు వృత్తము,
చరింతు!వరింతు!శశి ధరా!
భరింతు బెడంగు!భరములన్!
సరెంతు దిగంత!సమతకున్!
తరింతు!తదీయ!తపంబునన్!
బెడంగు వృత్తము,జ,జ.న,గ,గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం:492.
98.సునీతి వృత్తము,
నీమాంతార్ధంబౌనునీతి తానై!
క్షేమంబేర్చుం గా!శ్రీయుతంబౌ!
భీమంబారం జేయ!పేలవంబౌ!
రామంబే!రమ్యంబు!రక్ష దక్షౌ!
సునీతి వృత్తము,మ,త,త,గ,గణములుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:298.
99..నారస వృత్తము,
రాజీవ లోచనా!రసాలమా!
భోజాను రాజమా!బుధీ వరా!
రాజాధి రాజమా!రమా!వరా!
పోజేయ కష్టముల్!పూజింతురా!
నారస వృత్తము,త,ర,జ,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం:341,
100..సృజామి వృత్తము,
చంద్ర శేఖరా!సృజామి రా!
సంద్ర ధీరమా!వశంవరా!
చంద్ర మేలరా?సుజాతమా!
యాంధ్ర మేలుమా!నయంబుగా!
సృజామి వృత్తము,ర,జ,భ,గ,గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృశసం:427.
101.తెరంగు వృత్తము,
పురాల నేలెడు!పురుషుడా!
వరాల నిచ్చెడు!పరముడా!
పురాణ పురుషా!భూ ధవుడా!
తిరంబు కావగ!తిరిగెదన్!
తెరంగు వృత్తము,జ,భ,న,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృ,సం;502.
102.రసికత వృత్తము,
భారము నరయు!భగవంతా!
రావము వరలె!రసికితమై!
సేవను గనుమశివ రమ్యా!
దీవెన నొసగు!దివి జేశ.!
రసికత వృత్తము,భ,న,స,గ,గణము లుండును,యతి.7.వ,యక్షరము,వృసం;255.
103..కరివరద వృత్తము,
కరి వరదునిం!కనంగా నౌ!
చిర వరదముల్!శివం బౌతన్!
వరదము మదిం!వసంతంబౌ!
సిరి వరదుడే!శివ మేర్చున్!
కరి వరద వృత్తము,న,స,య,గ,గణము లుండును,యతి,.7.వ,యక్షరము,వృ,సం:96.
104..మథురిమ వృత్తము,
మదిలో నిలిచే!మాథవుడా!
సుథలో!మథువును జుఱ్ఱగ రా!
ప్రధమంబుగ నే!ప్రార్ధితుడన్!
వదలం దగునా?వల్లభుడా!
మథురిమ వృత్తము,న,స,భ,గ,గణములుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం;444.
105..కొలమాన వృత్తము,
వరద మేదయ?వసుందరన్!
సుర దమంబులె!సు ధీరతన్!
గురు తమంబులె!కొలందగున్!
పరము నెంచుమి!పరంతపా!
కొలమాన వృత్తము,న,భ,జ,గ గణము లుండును,యతి,7.వ,యక్షరము,వృ,సం;366.
106.పూర్ణతా వృత్తము,
భువన భాండాల పూర్ణు డీవే?
జవము నిచ్చేటి!జంగ మాధ్యా!
శివము చేకూర్చు!జీవ ధాత్రిన్!
భవుడి?శర్వుండు!పాప హారీ!
పూర్ణతా వృత్తము,న,త,ర,గ,గణములు,యతి.7.వ యక్షరము,వృ,సం:168.
107.సదానంద వృత్తము,
జీవన భద్రత!శివం బేర్చున్!
పావన భక్తియు పరంబీయున్!
సేవన భాగ్యము!చిదానందమ్.
జీవన సారము!శివౌక్యంబే!
108.రక్షమాం వృత్తము,
జీమూత సంఘంబు!ఛేదించుమా!
కామార్తి దోషముల్! కాల్జేర్చుమా!
జీవార్తి బాపుమా!జీవేశ్వరా!
భీమార్తి క్షోభలన్!వే తర్ముమా!
రక్షమాం వృత్తము,త,ర,త,గ,గణములుండును,7.వ,యక్షరము యతి,వృ,సం:277.
పంక్తి ఛందము నందలి కొన్ని వృత్తములుమాత్రమే
గైకొన బడినవి,
మంగళమ్ మహాత్,
శ్రీ,శ్రీ,శ్రీ,శ్రీ,శ్రీ,
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.