గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, ఫిబ్రవరి 2026, శుక్రవారం

జరామ,ప్రమాణీ,రజ రోలగ",గర్భ"రజ రజోవరీ "వృత్తము,.....రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి, జుత్తాడ,

జైశ్డ్రీరామ్. 

జరామ,ప్రమాణీ,రజ రోలగ",గర్భ"రజ రజోవరీ "వృత్తము,

రజరజోవరీ వృత్తము

   శక్వరీ ఛందమునందలిది,జ,ర,జ,ర,లగ,గణములు ప్రతి పాదమున

యుండును,యతి,10,వ యక్షరమునకు చెల్లును,ప్రాసనియమము కలదు,

పాదమునకు14.అక్షరము లుండును,వృ,సం,2742.


                         నిరీక్ష సేతురా!వరామ నీమ!రా వయా!

                        పరీక్ష దేలరా?వరామ వామవాసి!మా

                       నిరాశ!నీకురా!సురామ!నీమ సోమనా!

                       వరీయ మీయ రా!వరీయ!నీమ శ్రీ హరా!


1.గర్భగత"జరామ"వృత్తము,

గాయిత్రి ఛందము నందలిది,జ,ర,గణములు ప్రతి పాదమున యుండును

పాదమునకు.6.అక్షరము లుండును,ప్రాస నియమము కలదు,వృ,సం;22.


                          నిరీక్ష సేతురా!

                         పరీక్ష దేలరా?

                         నిరాశ!నీకురా!

                         వరీయ మీయ!రా!


2.గర్భగత"ప్రమాణీ"-వృత్తము,

అనుష్టుప్ఛందము నందలిది,జ,ర,లగ గణములు ప్రతి పాదమున యుండును,

పాదమునకు 8.అక్షరము లుండును,ప్రాస నియమము కలదు,వృ,సం;86.


                వరామ నీమ రావయా!


                వరామ వామ వాసి!మా!

                సురామ నీమ సోమనా!

               వరీయ నీమ శ్రీ హరా!


3.గర్భగత"రజ రజోలగ"వృత్తము,

త్రిష్టుప్ఛందము,నందలిది,ర,జ,ర,జ,లగ,గణములు ప్రతి పాదమున యుండును,

పాదమునకు11.అక్షరము లుండును,యతి ప్రతి పాదమున7.వ యక్షరమునకు

చెల్లును,వృ,సం:683.


              నీమ రావయా!నరీక్ష సేతురా!

              వామ వాసి మా!పరీక్ష దేలరా?

             నీమ సోమనా!నిరీక్ష నీకురా!

             నీమ శ్రీ హరా!వరీయ మీయరా!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.