జైశ్రీరామ్.
1.సీ:-శ్రీ వరాహ నృసింహ క్షేత్ర సంపన్నమౌ!
సింహాచలంబది సింహ పురియె!
గుడి గోపురంబుల గుణకీర్తి విలసిల్ల!
భక్తాళి యుక్తమౌ ముక్తి పథము!
సౌశీల్య గరిమాన!సంపత్సు థా భిద!
శోభాయ మానంబు స్తుతి మతంబు!
కళలకు కాణాచి!కమనీయ శోభాశ్రి!
శివ విష్ణు మందిర జీవ ధాత్రి
తే,గీ:-నార సింహుని ప్రభ లెల్ల!తారక మవ!
వెల్గు లందించి పల్చోట్ల!వినుతి కెక్కె!
వరలు ఋత్తాడ మల్లేశ వాగధీశ!
కలి వికారత బోనాడి!కల్ము. లిమ్మ!
2.సీ:-శివ కేశ వేకత్వ!జీవాత్మ పరమాత్మ!
చేకూర్చు మార్గంబు చెలగె నిచట!
వేయి వత్సర శోభ!వెల్గు లీనె నిచట!
చిహ్నాల మత్స్యాలు చెలగె గుడుల!
మావసి కానంద!మందార సుమ గంథి!
భక్తి ముక్తి నిరతి బరగె నిచట!
వర శిలా శాసన!వాస్తవ్య వచనాలు
ఋత్తాడ పుర కీర్తి నెత్తి చూపె!
తే,గీ;-అట్టి మహి యందు జన్మింప!హర్ష మవదె?
కోటి జన్మాల పుణ్యంపు!కూర్మి గనదె?
వరలు ఋత్తాడ మల్లేశ వాగ ధీశ!
కలి వికారత బోనాడి కల్ము లెమ్మ!
3.సీ:-వినుకలి తీర్పది!కన నౌనె?సత్యంబు!
సత్యంబు గననీని సాక్ష్య మదియె!
నిత్య నిర్మల మౌచు నీతి నేపారునే?
జాతి కల్మష చింత!జగతి మిథ్య!
మిథ్య జీవన జీవ సద్యశం బిడ బోదు!
నిర్జీవ ప్రేతంబు!వర్జిత మటు!
కంటకాభరణమై!కడతేర్చు సత్యంబు!
నిత్య నిర్మల మది నీరుగారు!
తే,గీ;-విడువ బోకుమి సత్యంబు!విమల రూప!
ఆచరింపుమి ధర్మంబు!నహరహములు!
వరలు ఋత్తాడ మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి కల్ము లిమ్మ!
4.సీ;-యెవ డబ్బ సొమ్మును యెవరికి పంచెదు!
నీయబ్బ సొమ్మంచు!నీతి బల్కి!
నీపెంపు యింపంచు నిక్కి నీల్గుచు నుండ!
పరపంపు నోపునా?వసుథ యందు!
కడు పేద ముదుసలి!కమికె డన్నము తిన్న!
పరమం బది యటంచు పరగ రేల?
గాలిలో పుట్టియు గాలిలో పెరిగిన!
గౌరవ హీనులా?కలి జనంబు!
తే,గీ:-స్వార్ధ భూయిష్ట పథకాల సంద డేల?
పనిని గల్పించి!భాగ్యంబు పరగ నిమ్మ!
వరలు ఋత్తాడ మల్లేశ వాగ ధీశ!
కలి వికారత బోనాడి కల్ము లిమ్మ!
5.సీ:-మనుకలి సమ మీని!మనుజాళి జీవంబు!
సహకార భావంబు!సరగు నెట్లు?
చెడు పట్టు తుదముట్టు చేష్టలే!కాష్టమై!
జ్వలితమై కుల మంటి!జరుగు చుండ!
సమత మమత లవి సాక వేనాటికి?
భ్రమల దేలుటె తప్ప!భవిత సున్న!
భిన్నత్వ మందేక మున్నట్టు గన్పట్టు!
ఛేదింప శూన్యంబు చేష్ట లందు!
తే,గీ:-మిథ్య మభ్యత చిగురొత్తు!విద్య సుమ్మ!
దీని సరిజేయ!దివ్యులే?దిగులు గొనరె?
వరలు ఋత్తాడ మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
6.సీ:-కని విని యెరుగని!కబురు లెన్నియొ జెప్పి!
కలదు భవిత యంచు!మెలుగు టేల?
మనసు నిలక డేది!మంచేది?చెడ్డేది?
సరి వారి మేలుకు సాక రేమి?
అప్పు గొప్పలు జెప్ప నుప్పతిల్లు ప్రగతి!
తప్పు గొప్ప తగదు!తలచు మదిని!
కొనియాడ జనములు కొమరారు నీతిని!
జాతి మేలును గోర!జగము మెచ్చు!
తే,గీ:-రక్షకుడ వౌచు సర్వుల!రక్ష గనుమ!
నిరుప యోగాల పడబోకు!నేర్ప రౌచు!
వరలు ఋత్తాడ మల్లేశ వాగ ధీశ!
కలి వికారత బోనాడి కల్ము లిమ్మ!
7.సీ:-కన్ను మిన్ను గనని!కలి యధర్మం బిది!
ధర్మాన్ని బంధించి ధర యెసంగె!
అవి నీతి పరులకే?యగ్ర తాంబూలంబు!
నీతి వంతుల కది ఘాతుకంబు!
హింస కాకర మది!హీన సంస్కారంబు!
ప్రగతి బాటకు చేటు!విగత మేర్చు!
పరులు మెచ్చని జన్మ!పాప సంక్లిష్టంబు!
వరదంబు కాదది?వన్నె నిడదు!
తే,గీ:-అన్ని తెలిసియు మూర్ఖులై!యలరు వారు!
జగతి కుప కర్త లనుటది!సరియు గాదు!
వరలు ఋత్తాడ మల్లేశ వాగ ధీశ!
కలి వికారత బోనాడి! కల్ము లిమ్మ!
8.సీ:-మంచి నెంచెడు వాని!మట్టి నెట్టుదు రిల!
స్వార్ధ పెంపు కొఱకు వ్యర్ధు లౌచు!
కడకాల మవి నీతి కాష్టంపు మంటల!
చలి కాచు కొనియెడు!చతురి తలర!
జనమును చెడదీసి జాగ్ర దావస్తల!
సత్యంబు చెరతురు నిత్య మవని!
భవి లేని జగమేర్చి!పాపంబు చేకూర్చి!
పటు మేథ మాదంచు పలుకు లొలుకు!
తే,గీ;-వర వికార చేష్టలు వారి!వాస మౌచు!
కలవరంబైన జీవమే?కలుగ జేసి!
వరలు ఋత్తాడ మల్లేశ వాగ ధీశ!
కలి వికారత బోనాడి కల్ము లిమ్మ!
9.సీ:-మితి మీర గడియించి!మతిమాలి చరియింప!
నుతి గతి యుతు లవి!చితికి పోవు!
చితికి పోయిన జీవి!మెతుకుకు దూరమై!
మతిలేని జీవాన మసలు తుదికి!
పరహాని నాశించి!పాపంబు నొడిగట్ట!
కట్టి కుడుపు తుది కాలమునను!
నేరాల బేరాలు నీతి కెగ నామంబు!
ధర్మానికే గెల్పు!తగను గూర్చు!
తే,గీ;-మితిని మీరిన చర్యలు గతిని మార్చు!
గతియు మాలిన జీవంబు!కడకు హాని!
వరలు ఋత్తాడ మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
10.సీ:-వినరాని కనరాని!వెత లేర్చు!చెడుగది!
గతి మాలి చేకొన్న!కనదు నిజము!
నిజముకనని చెడు!నీర్ష్య ద్వేషము పెంచు!
పెంచిన ద్వేషంబు!చించు భవిత!
చినిగిన భవితెల్ల!చింతాల వాలమై!
మంత్రానలము నంటి మాడి పోవు!
మాడిన జన్మంబు!మహి నొప్పు తుది కెంచ!
కన లేని విన లేని!గతి గడంగు!
తే,గీ:-ఇట్టి నిర్వీర్య చెడుగును పట్ట బోకు!
పట్టి సుఖియింప వేనాడు?పరగు నీతి!
;;వరలు ఋత్తాడ మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
11.సీ:-పంచేంద్రియంబులు పట్టు తప్పిన నాడు!
పాపాలు మదినెంచి బాధ పడెదు!
కోపాగ్ని పరహింస!కొంప లార్పును తుది!
కుష్టు రోగము బట్టి!కూల జేయు!
కండకావర ప్రభ!కాస్త తగ్గిన చాలు!
కనెదు!ప్రతీకార!కర్మ చరణ!
మట్టి గొట్టుకు పోవు మార్గంబు నెంచకు!
మంచికై పాటిడు మనిషి కమ్ము!
తే,గీ;-దేశ సౌభాగ్య!గరిమంబు దిక్కు లంట!
పాటు పడుమోయి!జనమాన్య!భరత వీర!
వరలు ఋత్తాడ మల్లేశ!వాగ ధీశ!
కలి వికారము బోనాడి కల్ము లిమ్మ!
12.సీ:-సత్య వాక్పాలన!సన్మార్గ గమనంబు!
సాటి మేటి జనుల సానుభూతి!
మిత్ర లాభము కోరు!మిత్ర భేదము తప్పు!
క్షేత్రజ్ఞు డా హరి చిత్త మెంచు!
మిత భాషణము మేలు హితకరి వీవను
భావాన ప్రజ మెప్పు బడయు మెపుడు!
గౌరవం బెంచుము!గర్వంబు గన నీకు!
గారాబు మూర్తివై!గడగు భువిని!
తే,గీ:-మెత్త దనమేల?దుష్టుల మొత్త కున్న!
నీదు ప్రతిభయు నీఱగు!నేర్పు గనక!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
13.సీ:-పచ్చని పైరులు పండించు రైతులు!
ప్రకృతి విపత్తులు పట్టి పీడ్చె
తిన తిండి గనరాక!తిరిపె మవస్తకు!
దిగజారె!కర్మాన!దిగులు గూర్చె!
చేదోడు సాయంబు చేబూని!ప్రభులెల్ల!
పథకాల తంత్రంబు!భ్రమల ముంచె!
మమత లేని సమత!మర్మాన వర్తింప!
పూర్ణ ఫలము నీక!పోరు గూర్చె!
తే,గీ:-పనిని గల్పించి పథకాలు వరల జేయ!
బలము!ఆయుష్షు!భాగ్యంబు!బడయ గలరు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
14.సీ:-విషపు చుక్కయు చాలు!వెస క్షీరమును మార్చు!
ఖలు డొకండు చాలు!మలిన మేర్చ!
విష పురుగుల నేరి!వెస పార వేయంగ!
మంచి చేకురు నిల!మహిమ మలర!
తప్పుకు సరియైన దండన విధియింప!
సత్యంబు నిల్చును సత్వరంబు!
నా పర భేదంబు!నాప కున్నచొ?జాతి
భ్రష్టు పట్టి భవిత!భంగ పడును!
తే,గీ:-భంగ జీవన భావన!భరతి కేల?
అన్ని రంగాల!విలువైన అమ్మ కిలను!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
15.సీ;-ఆగతం బెరుగని!అన్యాయ జీవంబు!
ఆటు పోటుల కెటు?లాదు కొనునొ?
భీత చేతన జన్మ!భీభత్స భరితమై!
ఏకాలమున కేమొ?యెరుగ గలమె!
నుదుట వ్రాసిన వ్రాలు!నూరేండ్లు చింతింప!
మార్చ శక్యము గాదు!మనుజ తతికి!
భగవ దేచ్ఛను బట్టి!పరగు లోకము తీరు!
తీరు మార్ప వశమె?తెలిసి కొనుమ!
తే,గీ:-తిరుగు నెరుగని జన్మంబు!మరుగు గనునె?
మరుగు గన నట్టి భాగ్యంబు!మహికి!మేలు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత! బోనాడి!కల్ము లిమ్మ!
16.సీ;-జననిని వేధించి!జన్మించి భూతలి!
జగతిని వేధించి!సాగి సాగి!
తనువును వేధించి!తగనొప్ప!గొప్పెంచి!
తను వసువులు బాయ!తల్లడిల్లి!
వేదనా జీవీవై!వేధింపు! నీ దౌచు!
తనువు వెఱ్ఱిగ జేసి తరలె దేల?
జీవిగా యేనాడు జీవాత్మ నెంచక!
దోషాన్వితుండవై!దొర్లె దేల?
తే,గీ:-నేను!నాదను జీవంబు!నీది కాదు!
పొందు సజ్జీవ ధాతృత్వ!భూరి తత్వ!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
17.సీ;-అమ్మకు క్షోభేర్చి!కమ్మనౌ!భూమాత!
బ్రతుకు బ్రద్ధలు జేసి!పరగె దేల?
నిను మోయు దేహంబు!నీర్ష్య ద్వేషా లేర్చి!
మరణ వేదన గూర్చి!పారె దేల?
ప్రాణంబు విడు నాడు!పాత రోత గనక!
పక్షపాతివి యైన!బాగు గనెదె?
తప్పు నీవు జేసి తనువుకు ముప్పేర్చి!
జీవ వేదన గూర్ప!శ్రీ కరంబె?
తే,గీ:-అట్టి మోసంపు ప్రాణంబు!దిట్ట తనము!
తనువు కనజాల దాయెనే?కన వదేల?
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
18.సీ;-అవినీతి కోరిక యంతంబు గావించు!
నీతి నిలకడ గూర్చు!ప్రీతి నిడుచు!
ఆగమ జ్ఞానంబు యవినీతినే!నెట్టు!
నిగమాంత వేద్యులు నీతి చరులు!
పరమార్ధ మెంచని పాపిష్టి జన్మంబు!
నరకంపు బాధల!నలుగు చుండు!
సుగుణ సంస్కారంబు చూడ ముచ్చట గొల్పు!
దుశ్చర్య లోకంబు!దుష్ట మేర్చు!
తే,గీ;-మాయ సర్వత్ర మంచిని మంట గల్పు!
పనికి మాలిన ధర్మంబు పాప మిడును!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి కల్ము లిమ్మ
19.సీ:-తేలు కుట్టిన దొంగ తీరు గాబోకుమా!
మంచి మనసు నెంచి మసలు నీతి!
నీతి జాతిని దీర్చు!జాతికే!మేలది!
మేల్మేలు జీవనే!కలిమి బలిమి!
బంధాల బంధాలు !భద్రతా!భావాలు!
నిర్ణిద్ర తేజాల నీతి నిల్పు!
కవికులాలంకార!కమనీయ దీప్తులు!
తేజాన జగమెల్ల!తీర్చు నీతి!
తే,గీ:-దురిత సంకట మబ్బిన దుష్ట జనులు!
కలిని నిందింతు రిహమున!మలిన బుద్ధి!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
20.సీ:-గురి జూసి షాశంబు కుత్తుక పెనవేసి
యము డసువులు దీయ!యార్తి గనవె?
సంపాదనంబెల్ల స్వజనములు మేయ!
పాపంపు శిక్షను!పడెద వేల?
మిథ్య బ్రతుకు లేల?మిడిసి పాటది యేల?
సద్యశ మెంచక!సరగె దేల?
కుదువ బెట్టిన సోమ్ము!కొదువయే?బ్రతుకంగ!
శాంత మేదిర?జీవ!జగతి యందు!
తే,గీ:-ఆశ కంతేది?లోకాన!హాయి సున్న!
జగతి బంధాలు!తెగుగాదె?సాగు నాడు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
21!సీ:-గతుకు బాట నడచు!కమనీయ దేహంబు!
యెగుడు దిగు డెసంగు!యెరుగ దేమి?
పుట్టిన దాదిగా!గిట్టు నాటి వరకు!
ఒకరీతి!యుండునా?యోర్మి కూర్మి!
పొగడుట!దిగుఢుత!పొడ చూపు జీవాన!
అన్నిట నీ యాత్మ యలరు నెపుడు!
అవరోధముల పుట్ట!అన్యాయముల తట్ట!
పట్టి పుచ్చు కొనక!నెట్టె దెట్టు?
తే,గీ:-జీవనంబది చరమనే !భావ మేది?
భక్తి ముక్తికి మార్గంబు!పట్టు తెలివి!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
22.సీ;-అంత రంగము నందు!వింత చైదపు చింత!
మనుజాళి ప్రగతికి మట్టి గుంట!
మట్టి గుంటను పడ్డ!తట్టి లేప రెవరు!
నీచ బుద్ధి వలదు!పింఛ మణచు!
ఆత్మీయ భావాన!అన్నదమ్ముల వోలె!
కలిసి మెలసి బ్రతుక!కలదు సుఖము!
సంతతి వర్ధిల్లు!సఖ్యత సమకూరు!
ప్రగతి చేతనముల !ప్రతిభ!గనును!
తే,గీ:-పంప కంబులు గావివి!పెంపె సుమ్మ!
చపల చిత్తాలు!విడనాడి!సాగు డిలను!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
23.సీ:-కదలాడు దైవాలు!కమనీయ తేజాలు!
నిండు మనసుల బ్రోచెడినిర్మలాలు!
బ్రతుకు నిచ్చెడు వారు భద్ర స్వభావులు!
సృష్టి మూలము వారు!సృష్టి వారు!
భక్షించు సంఘాన్ని రక్షించు వారెపో?
రమణులు జాతికే!రామ కంబు!
జ్ఞాన దీప్తులు వెల్గ!జగతినే!శాసించు!
జీవ ఖనులు వారు!శ్రీలు వారు!
తే,గీ;-అమ్మ లయ్యలు దైవాలు!నమ్మి గొలువ!
వమ్ము గానట్టి జన్మయై!వసుధ వెలుగు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
24.సీ:-సోదరాదర ప్రీతి సొంపేర్చి!పెంపేర్చి!
యింపైన జీవంబు యిహ మెసంగ!
పుర మమరావతి!పుణ్యాల సిరి ధాత్రి!
దేవాళి నడయాడు!దివ్య ధాత్రి!
భూగర్భ రత్నాలు!భువనైక!చిత్రాలు!
జీవ నదుల పంట!శివ తమంబు!
కర్మ భూమి!భరతి!కైవల్య సంధాయి!
ఇట జన్మ పటు జన్మ!యెరుగ రేల?
తే,గీ:-జగతి శాసన జేసెడి!జ్ఞాన మయులు!
కలరు గమనింప!రేలయ్య?కరము నిష్ట!
వరలు!ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
25.సీ:-అంతిమ కాలాన!అంతంత మాత్రమే!
వినరు కనరుమాట!విస్తు చెంది!
చేయుశక్తియు లేని చేవ హీను డితడు!
వానితో పనియేమి!వసుధ మనకు!
చేర రా రెవ్వరు?ఛీదరింతురు తుది!
యెంత బ్రతుకు బ్రతుక!నేమి?ఫలము!
ఇట్టి !వికారత!పట్టి విడ దదేమొ?
తలపవే?ముదుసలి తనపు!తీరు!
తే,గీ:-ఒదిగి బ్రతికిన,మిడిసిన!నోడు తుదికి!
జయము జీవికి లేదెంచ!జగతి యందు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.