జై శ్రీరామ్.
యతి ర్నవ పంచ చామర వృత్తము,
అస్థి ఛందము నందలిది, పాదమునకు16.అక్షరము లుండును, ప్రాస నియమము
కలదు, ప్రతి పాదము నందు, జ,ర,జ,ర,జ,గ,గణము లుండును, యతి,9.వ యక్షరమునకు చెల్లును,వృ,సం;21846.
నచో విచార!నామదిన్!నమో నమా మనారతున్!
వచో వరామి!రామకా!ప్రమాణ మాన రాజితా!
వచో విచార!రామతా!శ్రమా దమామి నా మనా!
సుచాను వాచి సోమకా!సుమా!సమాను సారమా!
1.గర్భగత,జర్జరా వృత్తము,
జగతి ఛందము నందలిది,పాదమునకు12.అక్షరము లుండును,ప్రాస నియమము
కలదు,ప్రతి పాదము నందు,జ,ర,జ,ర,గణము లుండును,యతి.9.వ యక్షరమునకు
చెల్లును,వృ,సం,1366.
నచో విచార!నా మదిన్!నమో నమా!
వచో వరామి రామకా!ప్రమాణమా!
వచో విచార!రామతా!శ్రమా!దమా!
సుచాను వాచి!సోమకా!సుమా!సమా!
2.గర్భగత"ప్రమాణీ"వృత్తము,
అనుష్టుప్ఛందము,నందలిది,పాదమునకు8.అక్షరము లుండును,పాదమునందు
జ,ర,లగ,గణము లుండును,ప్రాస నియమము కలదు,వృ,సం;86.
నచో విచార!నామదిన్!
వచో వరామి రామకా!
వచో విచార!రామతా!
సుచాను వాచి!సోమకా!
3.గర్భగత"జరజగా"వృత్తము,
పంక్తి ఛందము,నందలిది.పాదమునకు.10.అక్షరము లుండును,ప్రాస నియమము
కలదుపాదము నందు,జ,ర,జ,గ,గణము లుండును,యతి,6.వ యక్షరమునకు
చెల్లును,వృ,సం;192.
నచో విచార!నామదిం!నమో!
వచో!వరామి!రామకా!ప్రమా!
వచో విచార!రామతా!శ్రమా!
సుచాను వాచి సోమకా!సుమా!
4.గర్భగత"విభూతి"వృత్తము,
ఉష్ణిక్ఛందము నందలిది,పాదమునకు7.అక్షరము లుండును,
ప్రాస నియమము కలదు,పాదము నందుర,జ,గ గణము లుండును,
వృ,సం:43.
నామదిన్!నమోనమా!
రామకా!ప్రమాణమా!
రామతా!శ్రమా!రమా!
సోమకా!సుమా!సమా!
5.గర్భగత"జ్ఞాన నేత్ర-వృత్తము,
అనుష్టుప్ఛందము నందలిది,పాదమునకు8,అక్షరము లుండును,
ప్రాస నియమము కలదు,పాదమునందు జ,స,లగ,గణము లుండును,
వృ,సం,94.
నమో నమా మనారతున్!
ప్రమాణ మాన రాజితా!
శ్రమా దమామి నా మనా!
సుమా సమాను సారమా!
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.