జైశ్రీరామ్
ఆపాతాళ-నభఃస్థలాంత-భువన-బ్రహ్మాండ-మావిస్ఫురత్-
జ్యోతిః స్ఫాటిక-లింగ-మౌళి-విలసత్-పూర్ణేందు-వాంతామృతైః |
అస్తోకాప్లుత-మేక-మీశ-మనిశం రుద్రాను-వాకాంజపన్
ధ్యాయే-దీప్సిత-సిద్ధయే ధ్రువపదం విప్రోஉభిషించే-చ్చివమ్ ||
తాత్పర్యం:
ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురత్:
పాతాళం మొదలు ఆకాశం వరకు వ్యాపించి ఉన్న, ఆవిర్భవిస్తున్న విశ్వమనే బ్రహ్మాండం శివలింగం.
జ్యోతిః స్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతైః:
ఆ స్ఫటిక లింగం యొక్క శిఖరంపై (మౌళి) ప్రకాశించే పూర్ణచంద్రుని నుండి వెలువడే అమృతం.
అస్తోకాప్లుత మేకమీశ మనిశం రుద్రానువాకాన్ జపన్:
ఆ అమృత ధారలతో నిరంతరం అభిషేకింపబడుతున్న, ఏకైక ఈశ్వరుడైన రుద్రుని ధ్యానిస్తూ, రుద్రానువాకాన్ని జపించాలి.
ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువ పదం విప్రో2భిషించేచ్చివమ్:
కోరిన కోర్కెలు సిద్ధించడం కోసం ఆ శివుని ధ్యానించి, అభిషేకించాలి.
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.