జై శ్రీరామ్.
1.,విభూతి"-వృత్తము
అభిజ్ఞా ఛంథాంతర్గత.ఉష్ణిక్ ఛందము నందలిది,
ప్రతి పాదము నందు.ర,జ,గ,గణము లుండును,
ప్రాస నియమము కలదు.వృ,సం,42.
శ్రీ మనా!శీరో రుహమ్!
కామిదం!శివా శ్రితమ్!
మామకం!మనోరమమ్!
రామమే!రమాశ్రితమ్!
2.జరామ"-వృత్తము
అభిజ్ఞా ఛందాంతర్గత.గాయిత్రి"ఛందము లోనిది.
ప్రతి పాదము నందు,జ,ర,గణము లుండును.
ప్రాస నియమము కలదు.వృ,సం,22.
రమం రమా రమమ్!
శమం శ్రమా శ్రమమ్!
తమం తమాశ్రితమ్!
క్షమం!సు ధీరజమ్!
3.ప్రమాణీ"వృత్తము.
రమం రమం!వరామకమ్!
సుమంతకం!శమంతకమ్!
సమీర సార సార జమ్!
నమామి శ్రీ వరం!హరిమ్!
4.ప్రమాణే"వృత్తము,
జటా కటాహ!సంభ్రమమ్!
నటా జటోర్వి నర్తనమ్!
కటా కటార్తి!కౌముదిమ్!
నటీ నటా మనా!శివమ్!
5.ప్రమాణీ"వృత్తము.
నమామి!శంకరం!శివమ్!
క్షమామి!భీకరం!భవమ్!
సుమా!వరామ!రామకమ్!
శమం!వరా మిదం!శీవమ్!
స్వ స్తి.
1.సీ:-శ్రీ వరాహ నృసింహ క్షేత్ర సంపన్నమౌ!
సింహాచలంబది సింహ పురియె!
గుడి గోపురంబుల గుణకీర్తి విలసిల్ల!
భక్తాళి యుక్తమౌ ముక్తి పథము!
సౌశీల్య గరిమాన!సంపత్సు థా భిద!
శోభాయ మానంబు స్తుతి మతంబు!
కళలకు కాణాచి!కమనీయ శోభాశ్రి!
శివ విష్ణు మందిర జీవ ధాత్రి
తే,గీ:- నార సింహుని ప్రభ లెల్ల!తారక మవ!
వెల్గు లందించి పల్చోట్ల!వినుతి కెక్కె!
వరలు ఋత్తాడ మల్లేశ వాగధీశ!
కలి వికారత బోనాడి!కల్ము. లిమ్మ!
2.సీ:-శివ కేశ వేకత్వ!జీవాత్మ పరమాత్మ!
చేకూర్చు మార్గంబు చెలగె నిచట!
వేయి వత్సర శోభ!వెల్గు లీనె నిచట!
చిహ్నాల మత్స్యాలు చెలగె గుడుల!
మావసి కానంద!మందార సుమ గంథి!
భక్తి ముక్తి నిరతి బరగె నిచట!
వర శిలా శాసన!వాస్తవ్య వచనాలు
ఋత్తాడ పుర కీర్తి నెత్తి చూపె!
తే,గీ;-అట్టి మహి యందు జన్మింప!హర్ష మవదె?
కోటి జన్మాల పుణ్యంపు!కూర్మి గనదె?
వరలు ఋత్తాడ ల్లేశ వాగ ధీశ!
కలి వికారత బోనాడి కల్ము లెమ్మ!
3.సీ:-వినుకలి తీర్పది!కన నౌనె?సత్యంబు!
సత్యంబు గననీని సాక్ష్య మదియె!
నిత్య నిర్మల మౌచు నీతి నేపారునే?
జాతి కల్మష చింత!జగతి మిథ్య!
మిథ్య జీవన జీవ సద్యశం బిడ బోదు!
నిర్జీవ ప్రేతంబు!వర్జిత మటు!
కంటకాభరణమై!కడతేర్చు సత్యంబు!
నిత్య నిర్మల మది నీరుగారు!
తే,గీ;-విడువ బోకుమి సత్యంబు!విమల రూప!
ఆచరింపుమి ధర్మంబు!నహరహములు!
వరలు ఋత్తాడ మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి కల్ము లిమ్మ!
4.సీ;-యెవ డబ్బ సొమ్మును యెవరికి పంచెదు!
నీయబ్బ సొమ్మంచు!నీతి బల్కి!
నీపెంపు యింపంచు నిక్కి నీల్గుచు నుండ!
పరపంపు నోపునా?వసుథ యందు!
కడు పేద ముదుసలి!కమికె డన్నము తిన్న!
పరమం బది యటంచు పరగ రేల?
గాలిలో పుట్టియు గాలిలో పెరిగిన!
గౌరవ హీనులా?కలి జనంబు!
తే,గీ:-స్వార్ధ భూయిష్ట పథకాల సంద డేల?
పనిని గల్పించి!భాగ్యంబు పరగ నిమ్మ!
వరలు ఋత్తాడ మల్లేశ వాగ ధీశ!
కలి వికారత బోనాడి కల్ము లిమ్మ!
5.సీ:-మనుకలి సమ మీని!మనుజాళి జీవంబు!
సహకార భావంబు!సరగు నెట్లు?
చెడు పట్టు తుదముట్టు చేష్టలే!కాష్టమై!
జ్వలితమై కుల మంటి!జరుగు చుండ!
సమత మమత లవి సాక వేనాటికి?
భ్రమల దేలుటె తప్ప!భవిత సున్న!
భిన్నత్వ మందేక మున్నట్టు గన్పట్టు!
ఛేదింప శూన్యంబు చేష్ట లందు!
తే,గీ:-మిథ్య మభ్యత చిగురొత్తు!విద్య సుమ్మ!
దీని సరిజేయ!దివ్యులే?దిగులు గొనరె?
వరలు ఋత్తాడ మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
6.సీ:-కని విని యెరుగని!కబురు లెన్నియొ జెప్పి!
కలదు భవిత యంచు!మెలుగు టేల?
మనసు నిలక డేది!మంచేది?చెడ్డేది?
సరి వారి మేలుకు సాక రేమి?
అప్పు గొప్పలు జెప్ప నుప్పతిల్లు ప్రగతి!
తప్పు గొప్ప తగదు!తలచు మదిని!
కొనియాడ జనములు కొమరారు నీతిని!
జాతి మేలును గోర!జగము మెచ్చు!
తే,గీ:-రక్షకుడ వౌచు సర్వుల!రక్ష గనుమ!
నిరుప యోగాల పడబోకు!నేర్ప రౌచు!
వరలు ఋత్తాడ మల్లేశ వాగ ధీశ!
కలి వికారత బోనాడి కల్ము లిమ్మ!
7.సీ:-కన్ను మిన్ను గనని!కలి యధర్మం బిది!
ధర్మాన్ని బంధించి ధర యెసంగె!
అవి నీతి పరులకే?యగ్ర తాంబూలంబు!
నీతి వంతుల కది ఘాతుకంబు!
హింస కాకర మది!హీన సంస్కారంబు!
ప్రగతి బాటకు చేటు!విగత మేర్చు!
పరులు మెచ్చని జన్మ!పాప సంక్లిష్టంబు!
వరదంబు కాదది?వన్నె నిడదు!
తే,గీ:-అన్ని తెలిసియు మూర్ఖులై!యలరు వారు!
జగతి కుప కర్త లనుటది!సరియు గాదు!
వరలు ఋత్తాడ మల్లేశ వాగ ధీశ!
కలి వికారత బోనాడి! కల్ము లిమ్మ!
8.సీ:-మంచి నెంచెడు వాని!మట్టి నెట్టుదు రిల!
స్వార్ధ పెంపు కొఱకు వ్యర్ధు లౌచు!
కడకాల మవి నీతి కాష్టంపు మంటల!
చలి కాచు కొనియెడు!చతురి తలర!
జనమును చెడదీసి జాగ్ర దావస్తల!
సత్యంబు చెరతురు నిత్య మవని!
భవి లేని జగమేర్చి!పాపంబు చేకూర్చి!
పటు మేథ మాదంచు పలుకు లొలుకు!
తే,గీ;-వర వికార చేష్టలు వారి!వాస మౌచు!
కలవరంబైన జీవమే?కలుగ జేసి!
వరలు ఋత్తాడ మల్లేశ వాగ ధీశ!
కలి వికారత బోనాడి కల్ము లిమ్మ!
9.సీ:-మితి మీర గడియించి!మతిమాలి చరియింప!
నుతి గతి యుతు లవి!చితికి పోవు!
చితికి పోయిన జీవి!మెతుకుకు దూరమై!
మతిలేని జీవాన మసలు తుదికి!
పరహాని నాశించి!పాపంబు నొడిగట్ట!
కట్టి కుడుపు తుది కాలమునను!
నేరాల బేరాలు నీతి కెగ నామంబు!
ధర్మానికే గెల్పు!తగను గూర్చు!
తే,గీ;-మితిని మీరిన చర్యలు గతిని మార్చు!
గతియు మాలిన జీవంబు!కడకు హాని!
వరలు ఋత్తాడ మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
10.సీ:-వినరాని కనరాని!వెత లేర్చు!చెడుగది!
గతి మాలి చేకొన్న!కనదు నిజము!
నిజముకనని చెడు!నీర్ష్య ద్వేషము పెంచు!
పెంచిన ద్వేషంబు!చించు భవిత!
చినిగిన భవితెల్ల!చింతాల వాలమై!
మంత్రానలము నంటి మాడి పోవు!
మాడిన జన్మంబు!మహి నొప్పు తుది కెంచ!
కన లేని విన లేని!గతి గడంగు!
తే,గీ:-ఇట్టి నిర్వీర్య చెడుగును పట్ట బోకు!
పట్టి సుఖియింప వేనాడు?పరగు నీతి!
;;వరలు ఋత్తాడ మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
11.సీ:-పంచేంద్రియంబులు పట్టు తప్పిన నాడు!
పాపాలు మదినెంచి బాధ పడెదు!
కోపాగ్ని పరహింస!కొంప లార్పును తుది!
కుష్టు రోగము బట్టి!కూల జేయు!
కండకావర ప్రభ!కాస్తంత తగ్గిన !
కనెదు!ప్రతీకార!కర్మ చరణ!
మట్టి గొట్టుకు పోవు మార్గంబు నెంచకు!
మంచికై పాటిడు మనిషి కమ్ము!
తే,గీ;-దేశ సౌభాగ్య!గరిమంబు దిక్కు లంట!
పాటు పడుమోయి!జనమాన్య!భరత వీర!
వరలు ఋత్తాడ మల్లేశ!వాగ ధీశ!
కలి వికారము బోనాడి కల్ము లిమ్మ!
12.సీ:-సత్య వాక్పాలన!సన్మార్గ గమనంబు!
సాటి మేటి జనుల సానుభూతి!
మిత్ర లాభము కోరు!మిత్ర భేదము తప్పు!
క్షేత్రజ్ఞు డా హరి చిత్త మెంచు!
మిత భాషణము మేలు హితకరి వీవను
భావాన ప్రజ మెప్పు బడయు మెపుడు!
గౌరవం బెంచుము!గర్వంబు గన నీకు!
గారాబు మూర్తివై!గడగు భువిని!
తే,గీ:-మెత్త దనమేల?దుష్టుల మొత్త కున్న!
నీదు ప్రతిభయు నీఱగు!నేర్పు గనక!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
13.సీ:-పచ్చని పైరులు పండించు రైతులు!
ప్రకృతి విపత్తులు పట్టి పీడ్చె
తిన తిండి గనరాక!తిరిపె మవస్తకు!
దిగజారె!కర్మాన!దిగులు గూర్చె!
చేదోడు సాయంబు చేబూని!ప్రభులెల్ల!
పథకాల తంత్రంబు!భ్రమల ముంచె!
మమత లేని సమత!మర్మాన వర్తింప!
పూర్ణ ఫలము నీక!పోరు గూర్చె!
తే,గీ:-పనిని గల్పించి పథకాలు వరల జేయ!
బలము!ఆయుష్షు!భాగ్యంబు!బడయ గలరు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
14.సీ:-విషపు చుక్కయు చాలు!వెస క్షీరమును మార్చు!
ఖలు డొకండు చాలు!మలిన మేర్చ!
విష పురుగుల నేరి!వెస పార వేయంగ!
మంచి చేకురు నిల!మహిమ మలర!
తప్పుకు సరియైన దండన విధియింప!
సత్యంబు నిల్చును సత్వరంబు!
నా పర భేదంబు!నాప కున్నచొ?జాతి
భ్రష్టు పట్టి భవిత!భంగ పడును!
తే,గీ:-భంగ జీవన భావన!భరతి కేల?
అన్ని రంగాల!విలువైన అమ్మ కిలను!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
15.సీ;-ఆగతం బెరుగని!అన్యాయ జీవంబు!
ఆటు పోటుల కెటు?లాదు కొనునొ?
భీత చేతన జన్మ!భీభత్స భరితమై!
ఏకాలమున కేమొ?యెరుగ గలమె!
నుదుట వ్రాసిన వ్రాలు!నూరేండ్లు చింతింప!
మార్చ శక్యము గాదు!మనుజ తతికి!
భగవ దేచ్ఛను బట్టి!పరగు లోకము తీరు!
తీరు మార్ప వశమె?తెలిసి కొనుమ!
తే,గీ:-తిరుగు నెరుగని జన్మంబు!మరుగు గనునె?
మరుగు గన నట్టి భాగ్యంబు!మహికి!మేలు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత! బోనాడి!కల్ము లిమ్మ!
16.సీ;-జననిని వేధించి!జన్మించి భూతలి!
జగతిని వేధించి!సాగి సాగి!
తనువును వేధించి!తగనొప్ప!గొప్పెంచి!
తను వసువులు బాయ!తల్లడిల్లి!
వేదనా జీవీవై!వేధింపు! నీ దౌచు!
తనువు వెఱ్ఱిగ జేసి తరలె దేల?
జీవిగా యేనాడు జీవాత్మ నెంచక!
దోషాన్వితుండవై!దొర్లె దేల?
తే,గీ:-నేను!నాదను జీవంబు!నీది కాదు!
పొందు సజ్జీవ ధాతృత్వ!భూరి తత్వ!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
17.సీ;-అమ్మకు క్షోభేర్చి!కమ్మనౌ!భూమాత!
బ్రతుకు బ్రద్ధలు జేసి!పరగె దేల?
నిను మోయు దేహంబు!నీర్ష్య ద్వేషా లేర్చి!
మరణ వేదన గూర్చి!పారె దేల?
ప్రాణంబు విడు నాడు!పాత రోత గనక!
పక్షపాతివి యైన!బాగు గనెదె?
తప్పు నీవు జేసి తనువుకు ముప్పేర్చి!
జీవ వేదన గూర్ప!శ్రీ కరంబె?
తే,గీ:-అట్టి మోసంపు దుష్కర్మ!దిట్ట తనము!
తనువు కనజాల దాయెనే?కన వదేల?
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
18.సీ;-అవినీతి కోరిక యంతంబు గావించు!
నీతి నిలకడ గూర్చు!ప్రీతి నిడుచు!
ఆగమ జ్ఞానంబు యవినీతినే!నెట్టు!
నిగమాంత వేద్యులు నీతి చరులు!
పరమార్ధ మెంచని పాపిష్టి జన్మంబు!
నరకంపు బాధల!నలుగు చుండు!
సుగుణ సంస్కారంబు చూడ ముచ్చట గొల్పు!
దుశ్చర్య లోకంబు!దుష్ట మేర్చు!
తే,గీ;-మాయ సర్వత్ర మంచిని మంట గల్పు!
పనికి మాలిన ధర్మంబు పాప మిడును!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి కల్ము లిమ్మ
19.సీ:-తేలు కుట్టిన దొంగ తీరు గాబోకుమా!
మంచి మనసు నెంచి మసలు నీతి!
నీతి జాతిని దీర్చు!జాతికే!మేలది!
మేల్మేలు జీవనే!కలిమి బలిమి!
బంధాల బంధాలు !భద్రతా!భావాలు!
నిర్ణిద్ర తేజాల నీతి నిల్పు!
కవికులాలంకార!కమనీయ దీప్తులు!
తేజాన జగమెల్ల!తీర్చు నీతి!
తే,గీ:-దురిత సంకట మబ్బిన దుష్ట జనులు!
కలిని నిందింతురిహమున!మలిన బుద్ధి!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
20.సీ:-గురి జూసి పాశంబు కుత్తుక పెనవేసి
యము డసువులు దీయ!యార్తి గనవె?
సంపాదనంబెల్ల స్వజనములు మేయ!
పాపంపు శిక్షను!పడెద వేల?
మిథ్య బ్రతుకు లేల?మిడిసి పాటది యేల?
సద్యశ మెంచక!సరగె దేల?
కుదువ బెట్టిన సోమ్ము!కొదువయే?బ్రతుకంగ!
శాంత మేదిర?జీవ!జగతి యందు!
తే,గీ:-ఆశ కంతేది?లోకాన!హాయి సున్న!
జగతి బంధాలు!తెగుగాదె?సాగు నాడు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
21!సీ:-గతుకు బాట నడచు!కమనీయ దేహంబు!
యెగుడు దిగు డెసంగు!యెరుగ వేమి?
పుట్టిన దాదిగా!గిట్టు నాటి వరకు!
ఒకరీతి!యుండునా?యోర్మి కూర్మి!
పొగడుట!దిగుఢుత!పొడ చూపు జీవాన!
అన్నిట నీ యాత్మ యలరు నెపుడు!
అవరోధముల పుట్ట!అన్యాయముల తట్ట!
పట్టి పుచ్చు కొనక!నెట్టె దెట్టు?
తే,గీ:-జీవనంబది చరమనే !భావ మేది?
భక్తి ముక్తికి మార్గంబు!పట్టు తెలివి!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
22.సీ;-అంత రంగము నందు!వింత చైదపు చింత!
మనుజాళి ప్రగతికి మట్టి గుంట!
మట్టి గుంటను పడ్డ!తట్టి లేప రెవరు?
నీచ బుద్ధి వలదు!పింఛ మణచు!
ఆత్మీయ భావాన!అన్నదమ్ముల వోలె!
కలిసి మెలసి బ్రతుక!కలదు సుఖము!
సంతతి వర్ధిల్లు!సఖ్యత సమకూరు!
ప్రగతి చేతనముల !ప్రతిభ!గనును!
తే,గీ:-పంప కంబులు గావివి!పెంపె సుమ్మ!
చపల చిత్తాలు!విడనాడి!సాగు డిలను!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
23.సీ:-కదలాడు దైవాలు!కమనీయ తేజాలు!
నిండు మనసుల బ్రోచెడినిర్మలాలు!
బ్రతుకు నిచ్చెడు వారు భద్ర స్వభావులు!
సృష్టి మూలము వారు!సృష్టి వారు!
భక్షించు సంఘాన్ని రక్షించు వారెపో?
రమణులు జాతికే!రామ కంబు!
జ్ఞాన దీప్తులు వెల్గ!జగతినే!శాసించు!
జీవ ఖనులు వారు!శ్రీలు వారు!
తే,గీ;-అమ్మ లయ్యలు దైవాలు!నమ్మి గొలువ!
వమ్ము గానట్టి జన్మయై!వసుధ వెలుగు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
24.సీ:-సోదరాదర ప్రీతి సొంపేర్చి!పెంపేర్చి!
యింపైన జీవంబు యిహ మెసంగ!
పుర మమరావతి!పుణ్యాల సిరి ధాత్రి!
దేవాళి నడయాడు!దివ్య ధాత్రి!
భూగర్భ రత్నాలు!భువనైక!చిత్రాలు!
జీవ నదుల పంట!శివ తమంబు!
కర్మ భూమి!భరతి!కైవల్య సంధాయి!
ఇట జన్మ పటు జన్మ!యెరుగ రేల?
తే,గీ:-జగతి శాసన జేసెడి!జ్ఞాన మయులు!
కలరు గమనింప!రేలయ్య?కరము నిష్ట!
వరలు!ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
25.సీ:-అంతిమ కాలాన!అంతంత మాత్రమే!
వినరు కనరుమాట!విస్తు చెంది!
చేయుశక్తియు లేని చేవ హీను డితడు!
వానితో పనియేమి!వసుధ మనకు!
చేర రా రెవ్వరు?ఛీదరింతురు తుది!
బ్రతుకెంత? బ్రతికిన!ఫలము సున్న!
ఇట్టి !వికారత!పట్టి విడ దదేమొ?
తలపవే?ముదుసలి తనపు!తీరు!
తే,గీ:-ఒదిగి బ్రతికిన,మిడిసిన!నోడు తుదికి!
జయము జీవికి లేదెంచ!జగతి యందు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
26.సీ;-ఋత్తాడ వరపురి చిత్తజాహితు వరము!
పాడి పంటల వెల్గు భాగ్య సేమ!
శారదా నది గర్భ స్థగిత దేవళ మొండు
ప్రాచీన కళలకు!పట్టు గొమ్మ!
దేవతా మూర్తుల దివ్య చెక్కడములు!
కంబాల వెలుగొందె!కనుల విందు!
లక్ష్మి,విష్ణు,శివుల,లావణ్య విగ్రహ
పంచలోహ కలిత!భాసితములు!
తే,గీ:- త్రవ్వకాల వెలసె తగ!రమ్య మలర!
గుడిని వెలిదీయ!రేలనో?కొమరు భక్తి!
వరలు ఋత్తాడ మల్లేశ!వాగధీశ!
కలి వికారత!బోనాది కల్ము లిమ్మ!
27.సీ:-తన పెంపు యింపంచు తగనొప్ప!జీవింప!
తగునుకో?ధర్మంబు ధాత్రియందు!
అందరి పెంపును యాశించి మనినచో!
సత్యంబు నిల్చును జగము నందు!
కలుపుకోరు తనము కావలె నరులందు!
ఈర్ష్యయే!భూతంబు యిహమునందు!
భూతి సంకల్పంబు ప్రేత సాదృశ్యమౌ!
ఆగత మది సున్న యవని నెన్న!
తే,గీ:-బన్నముల. యందు వెన్నంటి ప్రభల వలెను!
కనుము సఖ్యత జనులందు!కలిమి నెలిమి!
వరలు ఋత్తాడ!మల్లేశ !వాగ ధీశ!
కలి వికారత బోనాడి !కల్ము లిమ్మ!
28.సీ:- భూగర్భ నిక్షిప్త! భువనైక మోహాలు!
గతకాల వైభవ స్తుతి మతాలు!
మణులు,గుడులు!రత్న మాణిక్య భద్రాలు!
వెలిదీయ గన్పట్టు!విశ్వ ప్రగతి!
భూత ప్రకోపాన భూమిలో జేరిన!
తల్లి నిక్షేపాలు తనయుల కగు!
నాటి!వీనాటికి!కోటరంబులు కావె?
పసిగట్టి వెలిజేయ!భవిత మెరుగు!
తే,గీ;-మెరుగు టూహల మెరుగైన!మేథ జూపి!
త్రవ్వకాలను చేపట్ట!తల్లి మెచ్చు!
సరలు ఋత్తాడ మల్లేశ!వాగధీశ!
కలి వికారత పోనాడి కల్ము లిమ్మ!
29.సీ:-వాగులు,కొండలు!వసుధైక మోహిత!
రంగు రాళ్ళ ప్రభలు రహిని మెచ్చ!
త్రవ్వకాలను జేసి!తమపెంపు నింపేర్ప!
ధర్మ దూరము కాదు!కర్మ సాక్షి!
సర్వ మేకము జేసి!సద్భావ గరిమాన!
సాయ మేర్చిన చాలు!జగము మెరుగు!
బీదరికపు గుండె!బేజారు నొందక!
సర్వ సంపన్నతం !సామ్య మలరు!
తే,గీ;-గనులు పెద్దల భుక్తమై!గడగ రాదు!
ముష్టి మూర్ఖత!సరిగాదు!మోదమిడదు!
వరలు ఋత్తాడ మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
30.సీ:-పనికి మాలిన పథకాల పంపకాలు
పనిని గల్పించి సద్భావ మలర!
త్రవ్వకాలకు శ్రమదాన తత్వ మమర!
తనబాగు ధరబాగు!దనరు గాదె!
కూర్చుండి మేపిన!కువలయంబుకు దెబ్బ!
బోడి తలపు లేల?బుద్ధి నెంచ!
పని జేయ లేనట్టి వారిని పోషింప!
ధర్మంబు నిల్చును!ధాత్రి మెచ్చు!
తే,గీ:-ఓట్ల గెల్పు తపన మౌత!యుర్వి సరియె!
ధర్మ మెట్లగు?తమసొత్తు!దనర నౌనె?
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
31.సీ:-రాజకీయపు సొంపు!రాజ్యావ బృధమున!
బీజమై!తేజమై!ప్రీతి గొల్ప!
కలి యొప్ప నెడబాటు!కాన నీయక జేయ!
మనుజ తత్వము గాదు!మహి తెరంగు!
దౌర్భాగ్య జీవుల ధాష్టీక వలయాన!
ఉక్కిరి బిక్కిరై!చిక్కి నీల్గె!
అర్ధ సౌభాగ్యమే!ఆద్యంతముల నొప్పె!
వ్యోమగామ సరళి!భీమ మగుచు!
తే,గీ:-ఇట్టి వైచిత్రి చిత్రంబు!యిహము నబ్బె!
ఉబ్బి తబ్బిబ దేలయా?యుర్వి నాధ!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము!లిమ్మ!
32.సీ:-ఆలు బిడ్డల చింత!యవరోధముల చింత!
ప్రాణావసానాన!పరము చింత!
పొర పొక్కెముల చింత!పోటి నెగ్గెడు చింత!
గోట మీటను చింత!కులపు చింత!
ఘాతుక వర చింత!కర్మ మోపని చింత!
తప్పు నొప్పని చింత!గొప్ప చింత!
న్యాయ మెంచని చింత!నర దండనపు చింత!
శుంత శాంతత లేని!పంత చింత!
తే,గీ:-చింతలందున!నడయాడు!జీవ తతికి!
కొంత శాంతంబు గూర్చుమా!కూర్మి దేవ!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము!లిమ్మ!
33.సీ:-సింజిణీ!రావముల్!మంజరీ ద్విపదలై!
ప్రాస లేక పరమ పావనంబవగ!
రాగ రంజిత రావ!రసమయ భావాలు
గతుల నందించెడు గమక మలర!
పాటయై!కోటయై!మేటియై!భావార్ధ!
భాసుర కళికియై!భాసిలంగ!
శ్రావ్య కావ్య నినద!సర్వమై!పర్వమై!
జనుల కాహ్లాదంబు!చక్క గూర్చి!
తే,గీ:-భుక్తి యుక్తికి!ముక్తికి!భూష యౌచు!
మోక్ష మార్గంబు జూపించి మోద మొదవ!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
34.సీ:-నుతుల మతుల!స్తుతు లతులిత మధురాలు!
మథురాలు రస రమ్య!బుధ నుతాలు!
గల గలా పారేటి గంగమ్మ!నినదాలు!
దుంధుభీ నిశ్వన!చందనాలు!
మందార మకరంద!మాధుర్య!మమరాలు!
కొమరారు నమరాలు!కోటి దాలు!
కోవిద శతకోటి!కోటక రత్నాలు!
రత్నాలు విటనట రాక్షసాలు!
తే,గీ;-రక్క సత్వంబు భూతలి చిక్కు లేర్చు!
మంచి మార్గాన నడువుడీ!మాన్యులార!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
35.సీ:-రాజిత కల్యాణ రస రమ్య!ద్వీపాలు!
గంగామతల్లికా!గారబాలు!
భాషా విశేషాలు భవ బంధ మోదాలు!
భువన త్రయ వరద భూషితాలు!
ఖనిజాలు వనజాలు!కలిమిల క్షేత్రాలు!
బంగారు గర్భస్థ!భరత మాత!
వేదాల నినదాల!విద్వ ద్వరేణ్యమై!
కర్మ సిద్ధాంతాన!గడగు భూమి!
తే,గీ::భూమి!ధర్మంబు!భాగ్యంబు భుక్తి నిడగ!
యుక్తి రక్తులు సూక్తులు ముక్తి గనుత!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
36.సీ:-కర్మాన వర్తించి!ధర్మాన్ని!రక్షించి!
సర్వ మీశ్వరమంచు సాగ ముక్తి!
భోగాలు యోగాలు!భువి నిల్చు నెన్నాళ్ళు?
సత్య దీక్ష గనని జనుల యందు!
ముక్కాలముల యందు!మోక్షంబు!నార్జించు!
జన్మ సార్ధకమది జగతి యందు!
రామ భీజాలవి రక్షించు!రస నెల్ల!
స్మరియించు రాముని!సత్య నిష్ట!
తే,గీ:-బ్రతుకు సుఖమగు!భవ బంధ!భాగ్యమిడును!
అంత్యమందున!పరమాత్మ!యాదు కొనును!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము!లిమ్మ!
37.సీ:-అందమౌ!ఛందము లారాధ్య దైవాలు!
బంధ మాలిక ప్రభ వందనంబు!
రసరమ్య భావాలు రాజన్య పూజ్యాలు!
బంధాల భావాలు బహు పసందు!
మర్మ గర్భ కవిత!మారాధ్య ఛందాలు!
చిత్ర గర్భ కవిత!చిన్మయంబు!
వెల్గు తెల్గు మహిమ వివరింప శక్యమా!
ఆది శేషునికైన!యవని యందు!
తే,గీ:-అట్టి తెనుగు భాషను!నెట్ట జూడ!
పట్టి పాపంబు పీడించు!ప్రజల నెపుడు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
38.సీ:-సహకార పరపతి చావు దెబ్బ తినెను!
అహరహంబులు స్వార్ధ!మావహింప!
గోమూత్ర బంధంబు గోకులానందంబు!
ఆనంద రసబంధ మందలేక!
మాయ కల్పిత బుద్ధి మహనీయ తేజమై!
కలి వికారత కది!యలిమె!చూడ!
గుది బండ జీవమై!గుణనిధి!జీవమై!
రాగ రంజిత ప్రభ!రాల నేల?
తే,గీ:-ఇట్టి రసవత్తర స్థగిత!మెట్టి నిల్లు!
కలి విహార దుర్ముఖి కార్ము కంబు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారము బోనాడి కల్ము లిమ్మ!
39.సీ:-అమ్మ బ్రతు కయోమయం బాయె నన్నట్లు!
పుత్ర సంతతి మెల్గ!పూజ్య మౌనె?
తల్లి తాకట్టుకే?తపియించు!సుతులుండ!
తప్పునా?ముప్పది!తల్లి కిలను!
మాతృ దేశ ప్రభలు !మట్టి గల్పగ జూడ!
భవి లేని!ప్రగతేర్చ!పాడు గాదె?
నేటి బ్రతుకె!బ్రతు కేటికీ?జీవంబు!
బండ రాతగు?గుండె!బండ సమము!
తే,గీ:-కాలవశమున!కదలాడు!కర్మ ఫలము!
బావి తరముల మేలుకై!వరల వేల?
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
40.సీ;-భవిత మేలెంచెడు!భగ్యోదయులు గల!
పుణ్యావనీ!మాత పూజ్య మిడగ!
మేల్జేయు ప్రభులను!మీది కెగయ నీక!
దోషాలు కల్పించు దూర్తు లలర!
భవి భాగ్య మలరునా?భద్రత గనునె పో?
త్యాగ నిరతి లేని?భోగు లలర!
భోగ భాగ్యాల!భూమాత!పూజ్య మలర!
చెండాడ వలె దుష్ట!శిక్షణమున!
తే,గీ:-క్రూర బుద్ధితొ నడయాడు కుఠిలుర!వడి!
కోరలను పీక!జగమెల్ల!పారు నీతి!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
41.సీ:-చెడు తెల్వి మోసంబు చి న్ముద్ర వేయునా?
భద్రాని కది యాట పట్టు గాదు!
భద్రంబు విడనాడి రుద్రంబు పాటింప !
వర కపర్ధి యొడలు పగుల గొట్టు!
దైవంబునకు మిన్న తానంచు నర్తింప!
తునియలై!దేహంబు తూలి రాలు!
నడుపు దైవంబునే?గడి మీరి హింసింప!
కాలు డూరక యున్నె?కాల్చ కుండ!
తే,గీ:-ఏమి జూచియు ?నీవిల!యెగిసి పడెదు!
రేపు నీదను భ్రమ మాను!చేపు నీతి!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
42.సీ;-ఋత్తాడ ప్రోలుకు పుత్తెంచి వెలసిన!
మరు మల్లె.విరి ఛాయ!మహిత!లింగ!
మల్లేశ!సర్వేశ!మహనీయ గుణ సాంద్ర!
బ్రహ్మ సూత్ర విభావ!భాను తేజ!
కొంగు బంగారమై!భంగు రంబులు బాపి!
అండయై!కొండయై!యవని బ్రోవ!
ఆరాధ్య దైవమై యవనికే?మూలమై!
భక్త రక్షణ దీక్ష బరగు తండ్రి!
తేగీ:-అమ్మ పార్వతమ్మ! నుమగ!నవతరించి!
ప్రభలు వెద జల్లి లోకాన్ని!రమ్య మేర్చె!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
43.సీ;-పరిమళ గంథాన!భాగ్యోద యుండౌచు!
నమక,చమక వర్తి!నాదు తండ్రి!
నటరాజు!పటుకీర్తి!నర నారి! రూపాన!
వర గంగ జడలందు!నురుకు లేయ!
నెలవంక!తన వంక!పులకించి తిలకింప!
గరళ తాప శమన!గంగ గూర్చ!
వర విరించి మగువ!వాగధీశుని మెచ్చ!
భీజ శక్తిని గూర్చి తేజ మేర్చ!
తే,గీ:-అణువు యణువున శక్తిగా!నవత రించె!
తల్లి భూదేవి!ప్రభ లవి!తార లంట!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
44,సీ:-బ్రహ్మ మానస పుత్ర ప్రాభవం బేపార!
కయ్యాలు లేకున్నె?కలియుగాన!
కయ్యాల వియ్యాలు!వియ్యాల నెయ్యాలు!
శయ్యాట పాటాలు సాగ కున్నె?
కన్నీటి కధనాలు!మున్నీటి ప్రళయాలు!
తిన్నింట వాసాల తిక్క లెక్క!
టెక్కు టక్కుల లెక్క!దిక్కు మాలిన చింత!
తల బిరుసు తనము!తగ్గు నొక్కొ?
తే,గీ;-సమ సమాజము!సరిజేసి!విమల యశత!
బ్రోవ!రావేగ!సురవర!భోగి భూష!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
45.సీ:-దశ గుణ ఛేదియౌ!దండన లేకున్న!
గుణములు వ్రణములై!కూల్చు జగతి!
దండంబు నీతిని తగనొప్ప!నిల్పంగ!
ధర్మ గ్లానియు వీడి దశ తిరుంగు!
నిత్య నిర్మల సత్య కృత్యాల వర్తియై!
గురుతర బాధ్యత!వరలు భువిని!
బాధ్యతా యుతమైన భవ బంధ చింతన!
సర్వత్ర వ్యాపించి జయము గూర్చు!
తే,గీ:-దుష్ట జనశిక్ష!రక్షయౌ!నిష్ట!ప్రగతి!
భూత శాంతియు జేకురి!భువి వెలుంగు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి కల్ము!లిమ్మ!
46.సీ:-సాధు రక్షణ భువి!సశ్య శ్యామల మేర్చు!
పరవ సింప!జగము!ప్రగతి! మెరుగు!
మెరుగైన భవితయే! మేలుగా జీవింప!
మానవాళి పరమ పావనమగు!
జాతి ధర్మము నిల్చు!జగతి భంగ పడదు!
సూక్తి మార్గ మలరు!సూక్తి దనరు!
అత్యాశ దోషంబు యవని నంతము జేయు!
మిగులవు జీవులు!జగము నందు!
తే,గీ:-పొగరు నెసగుట పాపంబు!పుడమి యందు!
నిండు!నీతిని సఖ్యత!నిల్చు ధాత్రి!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి కల్ము లిమ్మ!
47.సీ:కాకర చేదును!గండ చెక్కర తీపి!
నటు నిటు చేయంగ నగునె?భువిని!
కుల గజ్జి యమ రజ్జు!కూల్చదే?జీవంబు!
రస విష చర్యల రాల నీక?
సఖ్యత చెడదీసి!సంకుల సమరాన!
మట్టి గరిపింపక!మాను నొక్కొ?
ఉక్కు పాదము మోప యున్నతి చెడదీయు!
భవిత ప్రగతి జారు!భంగ మలము!
తే,గీ:-స్వార్ధ రోగంపు చింతన!వ్యర్ధ మేర్చు!
బుద్ధి సత్యంబు నంటిన!పూజ్య మలము!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము!లిమ్మ!
48.సీ:-చమకము సమ తత్వ!సాకరం బేర్చును!
నమకంబు నర జన్మ!నడవ డేర్చు!
చమక నమకములు!సత్య నిష్టను పెంచు!
ధర్మంబు నిలబెట్టు!ధాత్రి యందు!
ధర్మమే!కర్మమై!దనరారు జగమెల్ల!
భుక్తి యుక్తి ముక్తి భువిని వెలయు!
వెలసిన సజ్జన విశ్వంబు శ్రేయమై!
శివ మౌచు ప్రగతికి జీవ మిచ్చు!
తే,గీ:-జన్మ సాక్ష్యము!సత్యము కమ్ము!నిజము!
బ్రతికె దెందుకొ?మదినెంచి!పరగ వలెను!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
49.సీ;-అస్థి నాస్థీతి దేహ నిస్థుల జీవంబు!
పొదిగిన యా బ్రహ్మ!పూజ్యు డరయ!
ప్రాళుబ్ధ కర్మంబు పట్టి నూగిస లాడు!
విడిచి కనుమరుగై!వేథ గూర్చు!
స్థిర కల్ప జీవంబు!చేరును పరమాత్మ!
జీవ భక్తియె ముక్తి!శ్రీ కరంబు!
భావ భాసుర లీల!పరగంగ జగ మెల్ల!
ముక్కాల ముచ్చట్ల ముద్దు గొల్పు!
తే,గీ:-అట్టి మార్గంబు నెట్టుచో?హాయి గనునె?
నీతి మార్గాన!నదువుమా!నింద పదక!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ
50.సీ:-ఏకాల మేమైన యీకాలమే కలి!
ఆకలి కాకర పోకడిదియె!
నిత్య నిర్మల కృత్య!సత్యాలునీ వైన!
తృప్తి జీవన గల్గి దివెరె దీవు!
కష్టించి పని జేయ!నిష్టాలు నెరవేరు!
ముష్టి బ్రతుకు తొలగి మోద మలరు!
మిన్నింటు యూహలు మేటిగా దీర్చునా?
మాతృ రక్షణ లేని!మనుజు కిలను!
తే,గీ:-సద్యశంబును కాంక్షించు!జన్మ నెత్తి
పాడు తలపులు విడనాడి!బ్రతుకు నీతి!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
51.సీ:-శ్లేషార్ధ భావాలు చెవి కింపు గాకున్న?
పలుకుచో!పాపంబు పట్టి కుడుపు!
గొప్పలు చెప్పకు!తప్పులు చేయకు!
సరివారి మేలుకే!సాయ పడుము!
పరహింస పాపంబు!ప్రజ్ఞను !దిగ జార్చు!
నింద నొంద కిలను!నీతి నిల్పు!
జాగ్ర దావస్థల!జయమునే!కాంక్షించు!
పరభుక్త మాశించి!బ్రతుక బోకు!
తే,గీ:-కష్ట మిష్ట మటంచు నీ కదలికలర!
ఆయు రారోగ్య భాగ్యాలుడాయు!నిన్ను!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
52.సీ;-సాను భూతియు లేక!సంసార నిధులను!
యంత్రాల లాగించి వరలె దేల?
తల్లి ధనము దోచి!తమ భుక్తి దము జేసి!
పరభుక్త మా సించి!బ్రతుక! నేల?
తల్లి నిస్సారయై!మెల్లగా!క్షిణింఫ!
వైద్య మందించెడి!భద్రు డేడి?
మారుటూహలవేల?మసలుమా! నీతిని!
కనుమయ్య! న్యాయంబు!కలి యుగాన!!
తే,గీ;-ధైర్య మూనుమి!పర రక్ష!దీక్ష గొనగ!
జన్మ ధన్యత!నొందుత!జగము మెచ్చ!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
53.సీ:-చక్కిర వ్యాధిని చకచకా పెంచుటే?
పథకాల తీరుగా!ప్రజల జేరె!
పని జేయ రారైరి!పథకంపు టాశల!
బద్ధకం బలమెను ప్రజల యందు!
శుద్ధ మొద్దులను జేసి!నుద్దరించు టేల?
దేశ ప్రగతి కది!దిగుడు కాదె?
ఓటు పరమార్ధమే!కాటకం బేర్చెను!
కన లేరు నిజమును!కల్ల లలమ!
తే,గీ:-తెలిసి ధర్మానపాలింప!తెలియు నిజము!
తప్పుటూహల విడనాడి దనరు నీతి!
వరలు జుత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
54,సీ:-నీవాడు నావాడు !యేనాడు తలపక!
నీతి సమత నెంచ!నిండు కాదె!
జాతి మత కుళ్ళది సర్వత్ర వ్యాపింప!
సంకుల సమరాన జగము మాయు!
ఏగూటి కాపక్షి యిలజేరు!నిజ మది!
గూడులు మార్చంగ!గోడు గనెదు!
లేశ మూహింపక!లేని పోనివి లేపి!
యిచ్చ వచ్చి నటుల యెసగ తప్పు!
తే,గీ:-తెలిసి ధర్మము పాటింప!దివురు నిజము!
నిజత నేలిన వాడెపో?నిలుపు నీతి!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి కల్ము!లిమ్మ!
55.సీ:-అండంబు పిండమై!పిండాయు గర్భాన
కాయ కష్టము లోర్చి!కనును తల్లి!
ప్రాణావ సానాన్ని!పట్టుగా నిలదన్ని!
ప్రభవించు తల్లియె!ప్రాణ దాయి!
జనని ఋణము దీర్ప!సరిపోదు జన్మంబు!
అట్టి జనని చూడ నట్టి!సుతరుండిల!
నరకయాతననొంది!నలమటించు!తుదికి!
తల్లి ఋణముతీర్చు తత్పరమతి!
తే,గీ:-తెలివి గలజన్మ నెత్తిన జీవి వీవు!
ఆడ జన్మంబు నందున యమ్మ గనుమి!
వరలు ఋత్తాడ మల్లేశ!వాగధీశ!
కలి వికారత బోనాడి కల్ము లిమ్మ!
56.సీ:-ఏడనో?పుట్టి యేడనో పెరిగుచు!
మెట్టి నింటికి వచ్చు చిట్టి తల్లి!
కష్ట సుఖము లోర్చి!కడుపు పంటను యెంచి!
కుల గౌరవము పెంచు కలిమి తల్లి!
సుతులు ప్రాపును గోరి!గతియు భర్తగ నెంచి!
తలి దండ్రుల కెడమ!నిలుచు తల్లి!
అత్త మామల పోరు చిత్తాన భధియించి!
మెత్తనౌ మనమున మేటి యౌచు!
తే,గీ:-ముక్తి జీవన మెంచెడి మోద మాంబ!
తల్లి లేకున్న బ్రతుకేది?తలపు మయ్య!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
57.సీ:-అత్తింటి పెంపుకే!యహ రహంబులు నెంచి!
యిరు వంశముల పేరు!యిహము నింప!
కష్టమే యిష్టమై!యిష్టమే!నిష్టయై!
మొక్కవోని ప్రతిభ!మోది యౌచు!
ఎట్టి భీకర కష్ట మిట్టులే!తెలివితో!
తృటిలోన ఛేదించు దిట్ట!మగువ!
కలకంఠి కన్నీరు కలిమికే!దోషంబు!
ఆడుదాని యుసురు యంత మేర్చు!
తే,గీ:-జగతి కణిమాది సిద్ధులు ఛాన లేను!
క్రిందు నెంచంగ!హేయంబు!కీడు!ప్రగతి!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
58.సీ:-చెల్లిగా!అక్కగా!తల్లిగా!భార్యగా!
మేన కోడలు!కోడలు!కనగ కనగ!
అన్ని రూపంబుల!యవతార మెత్తిన!
ఆది పరాశక్తి!మన యాడు బిడ్డ!
ఆడదే!లేకూన్న!యవనియే!లేదింక!
మూల మెరుగ వేర!మూర్ఖ జనుడ!
జీవ వృక్షపు మూల! శ్రీ! స్త్రీ వరామ భువిని!
చిత్ర నటనలు మాని!జీరు నిజము!
తే,గీ:-కన నిమిత్త మాతృడవు కాన!నరుడ!
గడిని మీరిన పాపంబు!పట్టి కుడుపు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
59.సీ;-కోప తాపావేశ!కుటిల సంస్కారంబు!
పుఱ్ఱె వ్రాతను బట్టి!పుణికి పుచ్చు!
ప్రతికూల చర్యకు ప్రాతి నిధ్యము వహించి!
అనుకూలతను మాపి యలరు చుండు!
ప్రాణ హానియు గల్గు!పర భీత చేతన!
యెట్టు లుండునొ?భువి!యెరుగ గలమె?
క్షేత్ర ధర్మము నెంచు!శత్రు నైను సరె!
మిత్రత్వమును గూర్చు!మేటి ప్రజ్ఞ!
తే,గీ:-ధర్మ యుతులను జేయుమా!ధాత్రి జనము!
నిండు వూరేండ్లు!జీవించి నీతి దనర!
వరలు ఋత్తాడ! మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి కల్ము లిమ్మ!
60సీ:-నేడు నాదని నిక్కి నీల్గుట తప్పగు!
రేపు నీదియు కాదు!రెచ్చి పోకు!
తృటి లోన ప్రాణంబు!కటి జేరు నేనాడొ?
తెలియ దేరి కిలను!దిగులు లేదె?
బ్రతుకు కలమునందు భ్రమల దేలితి గాని!
ఒరగ బెట్టిన దేది?యుర్వియందు!
దాన ధర్మములవి దలిజేర నీనైతి!
మర్మ కర్మల దేలి!మలిను నైతి!
తే,గీ:-నేటి కైనను నీతిగా నిలిచి!జగతి
తల్లి ఋణమునుతీర్చుకో!దలచి నాడ!
వరలు ఋత్తాడ మల్లేశ!వాగధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
61.సీ:-హక్కులు గావలె!యవసరంబులు దీర్ప!
భాద్యత పట్టదే!ప్రజ కదేల?
శిక్ష ధనయుతు!శిబిరంబు చేరదు!
బీద వానిని జేరి భీతి గొల్పు!
ధనికువి నేరంబు ధర్మ భూయిష్టంబు!
పేద కదియె!కత్తి పోటు సుమ్మ!
వినికిడి మాటల విశ్వ ధర్మము!మాసె!
కనుగొన నిజముకే!కలిగె శిక్ష!
తేగీ:-ఇట్టి కలితత్వ వ్యవస్థలు వట్టి వేను!
నీతి నిల్చెడి మార్గంబునెంచు మదిని!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
62.సీ,-దర్ప మూలంబు నౌ!తామసా హారంబు!
గుణ మనోభావాల!గుత్త గొనదె?
తమి మదంబున జిక్కి!ధర్మంబు!తరుమంగ!
నీతి నీతని గెంత!నిజ మదెంత?
యవినీతి దోషాలుయాత్మ క్షోభను గూర్ప!
సాధించునది యేది?జగతి యందు!
కాలకూట విపపు కాఠిన్య భావంబు!
కాల్చి వేయు ప్రగతి!కల్మి! బల్మి!
తే,గీ;-ప్రగతి సుగతిని నడుపంగ!పట్టు పట్టి!
నడచి రారండు నరులా!నారు వోయ!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
63:-సీ;-పొట్ట కూటికొఱకు పుట్టెడూహల నొప్పి!
పరహింస!పాపంబు పట్ట దగునె?
ఒడలు కందని చర్యలు విడిచి పెట్టి!
కష్టార్జితము నెంచ కలగు సుఖము!
అన్యాయ విత్తంబు ఆత్మ సంక్షోభమ్ము!
వంటబట్ట దదియె!కుంటి!నడత!
ఆయు రారోగ్యాల!ఐశ్వర్య! తుల్యంబు.
యవని నిల్చు నదియెయాత్మశుద్ధి!
తే,గీ:-శుద్ధి బుద్ధుల!జీవించి!పద్దు గనుడి!
అదియె! జన్మార్ధ సాధక!మవని యందు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము!లిమ్మ
64.సీ:-చతురంత యానమే!సర్వులు సేయంగ!
మోయ బోయ యేడి?మూర్ఖ జనుడ!
అందర రందల మొక్క!యందలం బెక్కించు!
మనుజు లేరయ?నెంచ!భూమి యందు!
కర్తవ్య నిర్వహణ!గడ్డు మార్గము నెంచు!
ముప్పు తెప్పలు గాక!మోదమగునె.
కార్య నిర్మగ్నుడు!కనడాశ!యేనాడు!
సుఖ జీవిగా నతడు చూఢ బఢును!
తే,గీ:;-మార్పు- సరిమార్గ మంటుచో?మంచి దగును!
లేక యున్నచొ?కష్టమే!సాకు భువిని
రమ్య ఋత్తాడ!మల్లేత !వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
65.సి:-మనుకలి వినుకలి వినుతవు శంకరా
సంకట భరమాయె!జర ముడిగెను!
అక్కను బాసితి!పొక్కితి నిడుమలు.
అక్క స్వర్గంబు చేరియుఅమర మాయె!
ఏకాకి నైయుండి!పాపానలంబును
తప్పించు కొననెంచి!తపన జేసి!
మల్లి కార్జని గొల్చి!మదిని!మసలు చుంటి!
పాప హరణమౌత!ప్రార్ధ నమున!
తే,గీ,-రమ్ము వేవేగ!నను బ్రోవ!రమ్య తేజ!
పరమ కల్యాణ వర మూర్తి!భాగ్య!దేవ!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్లు!లి మ్మ!
66.సీ:-కర్మ ఋణాను బంధ కరణంబది గాన!
జన కుల జాత కాదది!జగతి యందు
మానవ సంసేవ్య!మనోజ్ఞత విష్ణ్వంశ!
శివంబు సర్వత్ర సేవ నంబు!
వేదనం బదియేది? విచ్ఛి పోదుర భవా!
కర్మ కర్తృక భావ!మర్మ మిద్దె!
విష వలయానృత!విద్యనెర్చుట ముప్పు!
మంచి విద్య నేర్చి!మనిషి కమ్మ!
తే,గీ:-సమత మమతాను భావన!సర్వ జగతి!
మసల వలెనయ్య!భూమిపై!మనిషి వయ్యు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లెమ్మ!
67.సీ:-జన్మతా వేదన!జరయందు వేధన!
జగజీవనా వేధ!సర్వ వేద!
వేద నందని జీవి!విశ్వాన లేదింక!
కర్మ కర్టృత్వమే!కాచు నిలను!
చర్మధారియు!కర్మ చర్యుడు కావలె!
కర్మ సత్కర్మత!గడగ వలెను!
ముక్తి యదియె!జీవ నామోద!వరదంబు!
సుక్తు లాలించుడీ!సుజను లార!
తే,గీ:-రేపు నాదన నేలయా?నేడీవు!చేపు నీతి.
ముక్తి మార్గము నెంచుమా!మోహ నాంగ!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
68.సీ:-అందరి సుఖములు.యందరి కష్టములు!
యెందెందు నం జూడ!పొందు సమత!
యుక్తియు భక్తియు ముక్తియు సరినెంచ!
పంచ కష్టా లతో! వసుధ చెరచె!
కుంచితాగ్ర బుద్ధి వంచనా పరమైన!
లోకము చేజారు శోక మమరు!
కొని తెచ్చి పాపాలు కొంపలే ముంచంగ!
బుద్ధి రా దేలను? శుద్ధ జగతి!
తే,గీ:- కోర దేలను?సుఖమును కొంచె మైన!
నీదు చేతయె!వేటాడు!నిన్ను విడక!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
69.సీ:-దివ్య భామ కీర్తి!దీర్ఘ సుమంగళి!
భవ్య రత్నోపేత!భాగ్య మాత!
సుర వర సంపన్న!సూక్ష్మ గ్రాహి విమల!
సత్సంపదల పెట్టు!సర్వ శుభగ!
కల్యాణ వరదాయి!కమనీయ తేజస్వి !
తేజో విరాజిత దీప్తి చరణ!
అంబో రుహాక్షిరా!అమ్మల మన యమ్మ!
భారతాంబ ప్రభలు భద్ర ములిల!!
తే,గీ;-మర్మ దార్తుల తల దన్న!కర్మ నిలచి!
పేరు గన్నది భరతాంబ!చారు శీల!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
70.సి;-రస వీర పటుధీర!రాజిత!కల్యణి!
రాణి రుద్రమ గన్న!రత్న సీమ!
అలనాటి విలు విద్య!యిలనాటి యణు విద్య!
భూ నభోంతర కీర్తి భాసమాన!
కమనీయ కబ్బాలు కమనీయ గేహాలు!
చిత్ర కళా పూర్ణ జీవ ధాత్రి!
మేరు మందర ధర!మేధురీ!సుమ గంథి!
సోయగాల భరతి!శుభగ!మనది!
తే,గీ:-ఋషి,ముని భరిత!వరధాత్రి!కృషి భూమి!
జన్మ నొండుట ధన్యంబు!జయము జయము!
వరలు ఋత్తాడ మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
71.సీ:-కమనీయ మందిర కల్మి సంపన్నాలు!
సురగంథి శ్యామల తరులు విరులు!
వర విరించి సఖియ వర విద్య లందించి!
తీర్చి దిద్దె భరతి!దివ్య మేర్చి!
యరవింద లోచన!యవరావతీ!మాత?
క్రొంగొత్త రూపుల కొలువు దీరె!
అమ్మ భారతి ముద్దు యమరావతి యన.
మేలి ముంగురు లెల్ల!లీల దనరె!
తే,గీ:-మంచి నారాధ్యమున నిల్చె!మాత!మహిమ!
చేదు నిజమిది!యెరుగుడీ!శ్రీల నేల!
వలరు ఋత్తాడ మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
72.సీ:-పరశు వేది విద్య పట్టె నెకి మీనికి!
ధర్మసంభవుడన!తక్కువేను!
నీతియే!ధర్మంబు!ఖ్యాతికి మూలంబు!
జన్మ మశాశ్వతం!చరిత!స్థిరము!
చరిత తిరగ తోడి!చైతన్యమును గూర్ప!
ముందు చూపు గలట్టి!ముఖ్య మంత్రి!
పెంపు నాశ్వాదించి!పేరెన్నికను గన్న
ప్రగతి బాటను వేసి ప్రభలి తీవు!
తే,గీ:-మల్లినాధుండు మహనీయ!మహిమ గూర్చు!
సాగి పోవయ్య!తీరుగా!సత్య మలర!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
73.సీ':-గుట్టుగా కోట్లను కొల్ల గొట్టిన వారు!
మేటులై!ధీటులై!మెలగు చుండ!
కలి ప్రభావ గరిమ!కల్లొలమును గూర్ప!
జనుల బ్రతుకు లెల్ల చతికిల బడు!
కష్ట కాల మందు కను విప్పు గలిగెను!. ,
నూరటిల్లె జనము!నోర్చి యోర్చి!
క్లిష్ట కాలము నందుకించ దోర్మియు గల్గ!
శాంతించె!జగమెల్ల!సంతసమున!
తే,గీ:-అట్టి శాంతిని నిల బెట్టి!పట్టు పట్టి!
నిల్చి నావయ్య!విష్ణ్వశ!నీతి చరణ!
వరలు ఋత్తాడమల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి కల్ము లిమ్మ!
74.సీ:-విరుల బాటను ముండ్లు!విరజుమ్ము వారిని!
జనము ప్రక్కను బెట్టి!జగతి వెల్గె!
వెల్గిన జగతికి!వెల్గులు పెంపేర్చ!
వచ్చితీవు!!ప్రగతి బాగు కోరి!
అవధులు మారిన అత్యాశ పరులకు!
నోట బెడ్డను గొట్టి యోటు తోడ!
గెలుపు నొందితివి!దివ్య కీర్తిని గొని!
మంచియూహల యేలు!మహిమ జూపి!
తే,గీ:- శాప గ్రస్తులు నోడిరి!శాంత పడెను!
శాంత మశాంతి బొడనీక!సాగు మంచి!
వరలు ఋత్తాఢమల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
75.సీ:-కంచెయే!మేసెను కడుపార చేనును!
కనువారు!కన లేక!కాల్చి వేయ
!మొలచిన చేనిది!!మురిపాల పెంచుమి!
నేటి చేనుయె!భవి!నిండు పంట!
ప్రగతి!భక్తియు!గోరి!పూజ్య భావమందు!
పుణ్యాల నిధి వౌదు!భూమి యందు!
శాశ్వత కీర్తుల జగమెల్ల!భాసిల్లు!
చిరకీర్తి నిల్తువు!చరిత యందు!
తే,గీ; -చరిత గననట్టి జన్మంబు జన్మ గాదు!
తృణము కన్నను హేయంబు!తెలిసి మసలు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!!]
76.సీ:- పట్టాలు తప్పితా పరిగిడు పొగ బండి!
తీరు జీవన సరళి!దీప్తి చెరచ!!
భవిత కష్ట మెరిగి!పట్టించు కోకున్మ!
యిడుము లందుట గల్గు యెరుగ రేమొ!
భవిత కనుల ముందు బాగుగా కన్ప్పింప!
పట్ట నట్లుండుట!భద్ర మగునె?
రేప టూహయు లేని!పాప జన్మము తప్పు!
మందుగా మేల్కొని! ముదము నొందు!!
తే,గీ:-నేటి సుఖము సరి యంచు పాటు పడుచొ?
అరయ గలమె?సుఖము!అవని యందు!.
వరల ఋత్తాద!మల్లేశ!వాగధ్శ!
కలి వికారత!బోనాడి కల్ము లిమ్మ!
77.సీ:-దేవ దత్తఝె వెల్ల దిగ మ్రింగు చీవాడు!
తమ గొప్ప చాటుట తగునె?జేపుమ!
గురి వెంద నలుపును!గుర్తుపట్ట రదేమొ?
తప్పుటూహల నొప్పు దర్ప మేమొ?
వెంకన్న సొమ్మునే!గొంకక మేయంగ!
గొప్పగా నొప్పుట తప్ప గాదె?
పద్మనాభు నిధులు పసిగట్టి లాగంగ!
భంగంబు కాదొకో?భవిత మేలు?
తేగీ:-క్రాంతినెలకొను మార్గన కదలి రండు!
దేవ దత్తంబు జేర్పంగ!దివిజు లకును!
వరలు ఋత్తాడ! మల్లేశ!వాగ ధీశ!
కలి వికారము బోనాడి కల్ము లిమ్మ!
78.,సీ:-శారదా వర నది సంపన్న!జుత్తాడ!
తటి వటపము దరి!నలరారు
పట్ట మాంబ పట్టు వరదమం బిచ్చోట!
మూడు మఱ్ఱెల మధ్య!ముచ్చటలరి!
పాడి పంటలు నిండు పరిఢ విల్లెడు సీమ!
మత్స్య రాజుల నాటి మహిమ చాట
కూపత్య్రయం బిట!కుటిలాల వాలమై!
వర కుబేరుల కావాస మాయె!
తే,గీ:-ఇసుక మెసగిడి వారలే!యిందు పెచ్చు!
ఋషుల సీమ!కదేల??విష పరీక్ష!
వరలు ఋత్తాడ మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
79.సీ:-వేయేండ్ల చరితగా!వెలసిన వేంకన్న!
శివ లింగముల ఖ్యాతి శివ తమంబు!
మల్లేశు డిచ్చోట!మహిమాన్వితుండౌచు!
బ్రహ్మ సూత్ర ప్రభల బాసి లెండు!
స్ఫటిక లింగపు ప్రభలు జగదభి రామంబు!
నమక చమకములు!యలరు నిచట!.
పరమార్తి!గురు భక్తి!వర్ధమాన జనులు!
సర్వ దార్చన లందు! సంత సిల్లు!
తే,గీ:-జయము జయమయ్య భక్తుల జప తపాలు!
వర పురీంద్రము ఋత్తాడ!వాసి కెక్కె!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి కల్ము లిమ్మ!
80.సీ:-పాడి పంటల వెలుగీను పరమ సీమ!
జనులెల్ల వరభక్తి!సరగు చుండ!
పల్లె కీర్తిని దెల్ప వశము కా! దేరికి!
భక్తి యుక్తి ముక్తి భాసు రంబు!
ఏనోట విన్నను!యిల రామ ధ్యానమే!
శివ నామ స్మరణమే!చెలగు చుండు!
విష్ణు పూజలందు!విశ్వేశు గాంతురు!
విమల యశులు వీరు!విభుదు!లవని!
తే,గీ:-వర విశేషత దనరారు!పురము యిద్ది!
దేవళంబుల పూజల దివురు చుండు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
81.సీ:-భూమియందు సిరులు!భూభుజ వరమాయె!
ప్రజ పెంపు కయ్యది?పనికి మాలె!
కనరాని వినరాని కబురులే!ప్రజకాయె!
అసలు సిసలు సొమ్ము!యంటె!ప్రభుల!
ప్రకృతి విపత్తులు ప్రజలకు మాత్రమే?
ప్రభుల దరికి రావు!ప్రళయములును!
అతల వితలము లందు!యవ్వారి దేముంది?
కుతలమందు ప్రబల వెతలు తప్ప!
తే,గీ:-వెతల బాంధవ్య సంధాయి!వితరణుండు!
నరుడు.సామాన్యు డిద్ధర!నరయు మయ్య!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
82.సీ:-తనలోన తా దిర్గి!తానైన కష్యలో!
పరి భ్రమించ బడుచు పగలు రేలు!
విసుగు నొందని తల్లి!విమల భూమాతకు!
భ్రమిత బుద్ధియు లేదు!ప్రజల యట్ల!
నిశ్చలత్వపు చూపు!నిర్మూల మాయెను!
ప్రకృతాకృతి!వికృతి బడసె నేమొ?
దుర్భేద్య భేద్యాలు దుష్ట తాకృతి దాల్చె!
దుర్ని మిత్తాలకు తోడు పడెను!
తే,గీ:-తెలియ రాదేమొ?పరదేశ!దితి వితరణ!
కదియె?సరిసాటి!విదిత మాయె!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
దితి వితరణ=దెత్యుల జాలి గుణము.
83.సీ;-ఎదురు బెదురు లేని!మేథ!సంపత్తిని!
విశ్వ వినుతి గనిన!వేష మూని!
నాశన హేతువై!నంతంబు నకు వాడ!
జగము శూన్య మగును!జాతి మాయు!
సృష్టించు ధీ శక్తి పుష్టిలేనిది మేథ!
చంపుట కెవడిచ్చె?శక్తి నీకు!
నక్తంచరత్వమ్ము!నరులకే?గన్పట్టు!
దేవతాళియు నది!దివుర దోయి!
తే,గీ:-దేవ తత్వంబు!నొందుచు!దివిరి!మసల!
పరము కృప నొంది!పరమును!బడయ గలవు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
84.సీ:-ఎడమ కుడుల తేడ!యెరిగె జీవించుమా!
ఎడము కుడియు గాదు!యెరుగ వేమి?
హెచ్చు తగ్గులు!జన్మ నిచ్చినవే!గాని!
నీవెంత యత్నింప!నీతి వంత!
పంతాలు రేపుచు!పబ్బాలు గడుపంగ!
పనికి వచ్చు కొంత వరకు నయ్య!
సమత జేతు వెటుల?సమ ధర్మ మేదిరా!
భూది బూసన్నవా?భూమి యందు!
తే,గీ;- భూది లేపన దైవమే?భూది కోరి!
సమత మరుభూమి యని దెల్పి!సరగె నటకు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
85.సీ:-దు స్వప్న హారియౌ!ధూర్వంపు పటు శక్తి!
దుష్ట జన్మ కెటుల?దొరకొనంగు?
శతమూల అంకుర!సాహసోపేతమై!
గణపయ్య పూజల!గడగు నెపుడు!
అట్టి దూర్వంబు నీ వెట్టు?తాకగలవు!
పాప కూప వికార!పాడు బుద్ధి!
చీల్చి ఛెండాడి!నిశ్చింత!స్వచ్ఛ తలమ!
పూర్ణ మానవు డౌదు!పూజ్యు డౌచు!
తే,గీ:-శక్తు లన్నియు జేకురి!యుక్తి నడతు!
పావనంబైన జీవంబు!బడసె దపుడు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
86.సీ;-బుడి బుడి నడకల!నడయాడు పసి వాడు!
దైవతుల్యత వాడు!ధరణి నడచు!
పాప పుణ్యము లవి!పట్టవు ముట్టవు!
పరమాత్ము లీలల!పరగు చుండు!
పసివారి చేష్టలు!పరమార్ధ మూహింప!
యాడు కొనిన చాలు!యమర మదియె?
అవినీతి స్వార్ధంబు యల్లనల్లన నేర్పి!
పాడు టూహ!జగతి పాడు చేయు!
తే,గీ:-ఏమి పాపమొ?యిహతల!మెటుల?మారొ!
జీవ చైతన్యమును గూర్చు!శివ మహేశ!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
87.సీ;-దేహమే!దేవళం!దేవుడే?జీవము!
దేహ సుషుమ్నాన!దివురు జీవి!
దేవాలయంబున దివ్య లింగం బదే?
జీవ పరమాత్మంబు!జేగు రించు!
ఆత్మ జ్ఞానముగల!యాత్మ లింగము!శివం!
శివ మది జీవాత్మ సాక్షి గాన!
సాక్షి వీవౌ చిల!సాక్షాత్తు జీవ ముక్తి!
మార్గ దర్శక మెంచు!మంచి నడత!
తే,గీ:-ముక్తి సోఫాన పథకాన!మురియు మెపుడు!
జన్మ సార్ధక మది రయ్య!జగము నందు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
88.సీ:-మంచి చెడులు రెండు!మానవుని యందుండు!
సహజ భావంబది!జనుల యందు!
మంచియే?పూర్తిగ మానవు డొందిన!
మహనీయుడాతడు!మహి రాము డన బొల్చు!
చెడు పెచ్చు పెరిగిన!చెడు!రావణుని మాడ్కి!
సరి సమాన మీనాడు సాకు చుండు!
మంచి గాకను చెడు మభ్యత!చెలరేగె!
పనులు పూర్ణతగాని!భవము నాయె!
తే,గీ;-మంచి పాలన మందించి!మనుడి జగతి!
మహిమ లోకంబు దనరారు!మహిత బుద్ధి!
వరలు ఋత్తాడ,మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
89.సీ:-నీర క్షీర విభాగ నిపుణత!రాయంచ!
నీరము విడదీయు నేర్పు గల్గు
బ్రహ్మ జ్ఞానివి గమ్మ!భవ బంధయోచన!
భాగ్యోదయు డవు కమ్మ!భద్ర మదియె!
చెడు జీవ చైత్యంబు!ఛిద్రంబు గావించు!
ప్రతిభ మాపి నశుల వరల జేయు!
క్షుద్ర జన్మంబది!భద్రంబు కాదయా!
సూక్ష్మ జ్ఞానివి గమ్ము!సూరి కమ్ము!
తే,గీ:-పాప కర్ముల పరిమార్చి ప్రగతి గనుమ!
మంగళంబగు లోకంబు!మహిమ నెసగు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
90.సీ:-ఓషధీ నిక్షిప్త!భిషగామృత!రసాళి!
గంగా వరామ!సౌగంథి!జగతి!
గంగ నీరము!సర్వ!గాంభీర్య రుగ్మతల్!
చిటికెలో పోజేయు!జీవ మిచ్చు!
పరమ పవిత్ర జల భాగ్యంపు!భారతి!
భవిత నెంచ రేమొ?భద్ర రుద్ర!
కర్మ భూమి మనది!మర్మ జన్మము గాదు!
మంచి సంచితమైన!మాన్య భూమి!
తే,గీ:-జనన మందిన జను లెల్ల!స్వచ్ఛ!జనము!
తుచ్ఛ జోలికి నేగెడు!నిచ్ఛ విడుడి!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
91.సీ:-నీదు ప్రతిభ కాదు!నీశ్వరేచ్ఛ యిది!
ఏది?యే సమయాన నిచ్చు నొక్కొ?
వేచి చూచి బ్రతుకు వెఱ్ఱి చింతే లయా?
విశ్వ వినుత కీర్తి!విశ్వ మిచ్చు!
నిమిత్త మాత్రుడ!వేమి!?చేయగ లేవు!
చేసిన నీగొప్ప!చెప్ఫు కొనకు!
ప్రగతి యూహను జేయు భాగ్యంబు!శివు డీయ!
నాదు ప్రతిభ నకు!నరుడ!వీవు!
తే,గీ:-కర్మ జేయగ!సృజియించె!కనవె?మనుజ!
వెఱ్ఱి చేతన!విడనాడి!వెలుగు మయ్య!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
92.సీ:-దేహ ధారుడ్య!జీవ దీప్తిదా!హర శివా!
భవ బంధ మోచనా!బంధ సింధు!
మందిరా వాస ధీమాంబుధీ!వారమా!
నీరమా!క్షీరమా!నిఖిల లోకాల
సారమా!జీరమా!మార ధీ!రామమా!
కీరవాణి సరాగ!కించ దా లాపమా!
నాధమా!రావ గానామృత!సేవ్యమా!
సర్వోత్తమంబైన!శమము దమము!
తే,గీ:-అట్టి శమమును తమిమీర!నాశ్రయింప!
సర్వ సుఖమయ జీవంబు!సాగు!భువిని!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
93.సీ:-చతురంగ బల వీర్య!సద్యశో మేథమ్ము!
మేథనామృత ధార!మేధి నేలు!
శస్త్రోప శమనాది!సాయుజ్య విద్యల!
శత్రు భీకర సృష్టి!జయము గొనిరి!
సర్వ మంత్ర తంత్రాలు జాగృతి!చర్వాలు!
మతి,స్తుతి,గతి తట్టి!మాయు సగము!
రణ విద్య!రసరమ్య!రాజిత!గుణ విద్య!
విద్య నేర్వని ఱేడె!విగత జీవి!
తే,గీ:-విద్యలందున!విలు విద్య!విశ్వ నుతము!
అట్టి విద్యను దిట్టలై!యలరి రపుడు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
94.సీ;-:పట్టు లేని!పరుల!బ్రతుకు మనదాయె!
మన విద్య!పరులకు!పరమ మేర్చె!
యాంత్రిక జీవంబు తాంత్రిక మై యొప్పు!
ఆగు రోజున దెల్యు!నయ్య బ్రతుకు!
లోకంబు చీకటౌ!శోకా నలము చిందు!
చీక టావల వెల్గు!శివుడె!సుమ్మ!
దైవ శక్తిని మించుధైర్యంబు గతి యింతె!
నేల వీడు పరుగు!చాలు నింక!
తే,గీ:-కష్ట ఫలమది!శ్ర్రేయంబు!కలుగు సుఖము!
కాని యూహలు నెడమిడి కదులు మంచి!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
95.సీ;-మంత్రాల యంత్రాలు!మనవారు నడిపిరి!
మహిత శక్తి యుతులు!మనిరి తొల్లి!
విలు విద్య!మంత్రాల వినుతి కెక్కెను నాడు!
న్యాయంబు ధర్మంలు నడచె నపుడు!
వేద పురాణాలు!వెలసె!నెన్నియొ?నాడు!
ధీ శక్తి యానాడు!దివిరె నెంతొ?
నీతి నీమాలతో!నిలుపోప జీవించి!
నెలకొను స్వర్గాన!నిలిచి రపుడు!
తే,గీ:-సాద రాదరమున!సరి రారు యీనాడు!
గురు వదాన్యులు ధన్యులా!గురు గణంబు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
96.సీ:-యేయొక్క విషయాన!యేమి పోలిక లేదు!
మర్మ కర్ములు వీరు తంత్ర యుతులు!
మాయలు.మర్మాలు.మాత్సర్య భావాలు!
పొట్ట నింపు తపనె!పుణికి పుచ్చె!
చర్మ ధారులు వీరు!కర్మ కారులు కారు!
పర హింస!భుక్తంబె!వాట మాయె!
మాన భంగమ్ముల!మానావ మానముల్!
పరిపాటి యీనాటి ప్రజకు నాయె!
తే,గీ:-ఇట్టి విచ్ఛిత్తి!కలి నెట్టు?పట్ట గలమె!
పంచ భూతాలె!సరి జేయ వలెను గాని!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
97.సీ:-వీధి బాగోతాలు!వడి సాగె!నిచ్చోట!
గోచి పెట్టగ రాని!కోవిదులచె?
కంపు టూహల పెంపు!కమనీయతను తోచె!
పనికి రాని ప్రభలు పరిఢ విల్లె!
గాలి మేడల లోక!గంభీర్యమును సాగె!
సంసార సారంబు!నీర మాయె!
మాట ధీటును లేని!మమకార చేష్టలు!
గోటులై!పోటులై!కులికె!నేడు!
తే,గీ:-ఇట్టి విపరీత జాతికి నీవె గాక?
వేరు దైవము లేదయా?జీర శాంతి!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
98.సీ:-నేటి పెంపుల గొప్ప లేటికి?జూపంగ!
ఉన్నదేది?పెరుగ దెన్న వేమి?
ఉన్నదానితొ!తృప్తి!మిన్న యౌ!దేహంబు!
దేహ సంతసమది!దివిజ సుఖము!
అట్టి సుఖము నొంది!యవనిని కాపాడు!
అవనియే!బ్రతుకుకు!నవనిధి యగు!
నిధుల తులను తూగ!నీవంతు భూమాత!
తనియ జేయును తల్లి!ధర్మ నిరతి!
తే,గీ:-నిరత సుఖదాయి!మన యమ్మ!నిర్మ లాత్మ!
తీర్చి!సర్వద!శ్రీమంత!మేర్చు ప్రగతి!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!]
99.సీ:-కలి గుట్టు చెర పట్టి!కలిమి నొందగ నెంచి!
బహు కృత వేషాల ప్రజలు దనర!
న్యాయంబునకు శిక్ష!నర్మంబునకు రక్ష!
కుక్షి ప్రోద్భవ చింత!కొంప ముంచె!
చెప్పు చేతల నొప్పు!చెవిటి!జంగమ తీరు!
భంగాలు కల్గిన వంగ రేల?
సిగ్గు శరము లేని!జీవంబు!జీవమా?
దాలి గుంట శునక తలపు లట్లు!
తే,గీ:-మార్చగా లేము వీరిని!మాట్ల తోడ!
దండనంబదె?సరి మందు!షండ తతికి!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
100.సీ;-పని గట్టి తప్పులు!పట్టి విడక జేసి!
కలి'కి నెట్టె దేల?గడుసు చింత!
తప్పు చేయగ నేల?తప్పించు కొన నేల?
ధర్మాన్ని దండించి దనర నేల?
నీతి నాతి బ్రతుకు!జాతి కంకిత మేల?
జాతి జగడము లంటి!సాగ నేల?
నరక జీవన యాత్ర!న్యాయంబు చేయగా!
రక్ష లే ది బ్భువి!భక్ష తప్ప!
తే,గీ:-ఇట్టి క్లిష్టపు ధర్ముంబ దెట్టు?బ్రతుకు!
బ్రతుకు నీగదె?పరమాత్మ ప్రగతి నెంచి!
వరలు ఋత్తాఢ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
101.సీ;-తనువు శాశ్వత మంచు!తగనొప్ప!నూహించు!
బ్రతుకు చెడిన నాడు!బాధ పడును!
భుక్కినదే చాలు!బుధ యుత మది యంచు!
విఱ్ఱ వీగుచు నుండు!వెఱ్ఱి వాడు!
గడ్డు కార్యము లందు!గండర గండ వై!
భీతి చేతావహ!ప్రీతి గనును!
మంచిని శిక్షించు!మర్మాన్ని!రక్షించు!
విపరీత!చేష్టల బెదర!వేమి?
తే,గీ:-పరుల!హింసించు!తపనయే!పట్టు!యొప్పు!
విడదు!భీభత్స!మేనాడు?వినుము!నిజము!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
102.సీ:-మానవ జన్మయే!మహిమాన్వితము భువి!
జన్మ సార్ధక మెంచరు!జగతి జనము!
పరుల కుపక రించు!పరమాత్ము!వీక్షించు!
మానవ సేవయే!మాథవమ్ము!
చెడును వినగ రాదు!చేతల మేలెంచు!
సాటి జనుల కిలను!సాయ పడుము!
కష్ట కాలము నందు యిష్ట దైవము కమ్ము!
నీతి దప్పక నొప్పు!నిర్మ లాత్మ!
తే,గీ:-ఆత్మ పరమంబు చేరంగ!నాశ పడుమి!
మనల నడిపెడు దైవంబె!మనకు రక్ష!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
103.సీ:-గడిమీరి చరియింప!కష్టాలు పాలౌదు!
మాట నిలకడున్న!మహి మెరుంగు!
ఆత్మ మేథను పెంచు!పర మేథ!కీర్తించు!
జ్ఞాన ధనుల తోడ!జగడ!మాపు!
ఆకొన్న వారికి అన్నము పెట్టుమా!
కడి గండము!గాచు!కరము నిజము!
భజన చేసెడి వారి!భక్తిని మెచ్చుమా!
గురు భక్తి!శివ భక్తి!గుర్తు నిడుమ!
తే,గీ:-సేవ భావంబునొందిన!శివము గనెదు!
శివమె!మోక్షంబు జీవికి!చిరము!స్థిరము!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
104,సీ:-అవరోధముల పుట్ట!నాయువు పెను తట్ట!
నీటి బుడగ పేల!నేల బడెదు!
సంపాదనం బెల్ల!సంసార మొందును!
చిల్లు గవ్వయు రాదు!చెల్లు నాడు!
కోపంబు సరి గాదు!తాపంబు పెను ముప్పు!
చిప్ప చేతికి వచ్చు!చిక్కు లలము!
కొప్పు వెన్నెల ఱెడు!కుప్ప కూల్చెడు నాడు!
తప్పునా?కష్టాలు!తలకు చుట్టి!
తే,గీ:-శాశ్వతము గాని!జీవంబు!చక్క బడునె?
యెంచవే?మిథ్య!పరమాత్ము నెంచు మదిని!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
105.సి:-సతియు గుమ్మమునుండు!సుతులు కాటికి వచ్చి!
చిచ్చు దేహార్పణ చేసి పోయి!
కర్మ కాండను జేసి!కాటి పిండము వేసి!
కన్న ఱుణము తీర్చి కదలి పోవ!
జీవంబు పరమాత్ము జేరక!నర జన్మ!
పాపాలు పలు జన్మ భావ మలర!
పొందు దేదిల?జీవ! కొందు వేది?తుదికి!
మిథ్య లోక!మిదియె!మేలు కొమ్మ!
తే,గీ:-దివి వరేణ్యుల!కీర్తించి!దివురు సుఖము!
దివ్య తేజంబు నొందెదు!దీప్తు లలర!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము!లిమ్మ!
106.సీ:-కఫ!విషాధపు తీరు!కాటు వేసిన నాడు!
జిహ్వాగ్ర మందున!చేదు దోప!
గుండె సవ్వడి మారి!గురు కెగ పోతకు!
తట్టుకో లేకను!తల్ల డిలగ!
చూచి బాధిలు వారు!వేచి యుందురు గాని!
పంచు కొనరు బాధ!యించు కేని?
నర జన్మ తీరిది!నాట్యంబు చాలించు!
భగవంతు నర్చించి!బడయు సుఖము!
తే,గీ:-భూమి జీవుల తీరింతె?బుద్ధి నెంచ!
మితము జతగొని!బ్రతుకుమా!గతియు!గల్గు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
107.సీ:-వర సుషుమ్నాన!పరమాత్మ శివు డుండ!
నహ మస్మి!బ్రహ్మంబు!నిహము దనర!
మీన ధనుర్వాసి!మేథినీ తత్వంబు!
నుత్తమం బేర్పంగ!చిత్త జారి!
పోషణా మార్గంబు భుక్తి పూర్ణత గూర్చ!
మిధు నార్క!బుధ వర!మేథ!నింప!
జే!జే! నినాదాల!జీవ సౌఖ్య మలర!
భూ సుతు!కరుణచె!భూమి దనర!
తే,గీ:-లోటు లేనట్టి భారతి!పోటి నిల్చి!
విశ్వ విఖ్యాత!కీర్తిని!వెల్గు గాక!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
108.సీ;-వరదమ సీసాన!వాగార్ధ వర్ధిష్ణు!
మల్లేశు నర్చించి మనవి జేతు!
నా మాట లాలించి!నవ నవోన్మేషాలి!
నవ నిథి!భారతి!జవము నిమ్మ!
మిథ్య లోనను బుట్టి!మిథ్య లోనను పెర్గి!
మిథ్య లో నేగెదు!మిట్టి పడకు!
నవ రంధ్రముల నుండి!పాయు నే!రంధ్రానొ?
జీవంబు గగ్గోల!శివము గనక!
మాయ కర్మల దేలి!మర్మ చింతన తోడ!
కర్మ దూరుడ వౌచు!గడగ నేల?
పుట్టెదు!వొక నాడు!గిట్టెదు వొక నాడు!
చరిత నిలువ లేని?జన్మ!జన్మె?
పాడు పొట్టను నింప!పాపాల కొడి గట్టి!
భ్రమల తేలెద వేల?భాగ్య హీన!
కీర్తి గనెడు నార్తి!కించిత్తు లేకున్న?
జీవ చ్ఛవము గాదె?జీవి తంబు!
తే,గీ:-మంచి మార్గాన జనులిల!మసల దలచి!
నిజము బల్కితి!సరి జేసి నీతి నడుడి!
అంద రందరు!అందరే?యెందు గనిన!
పొంద రారిల?ముక్తిని!బొత్తి గాను!
జీవ భద్రంబు ఛిద్రంబు!జేతు రేల?
చిన్మయానంద మొందడీ!జీవు లార!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారచ!బోనాడి!కల్ము లిమ్మ!
ముందు చూపు
==============
సీ;-ఆనాటి మనవారు ఈనాటి ప్రజ్ఞెంచి!
గుప్త నిధుల నుంచి!దీప్తి గనిరి!
ముందు టూహయు లేని!మూఢ చింతన మదే!
ముంచి ప్రగతి నేడు!దంచె!నేమొ?
తప్పు జేసి మనము తప్పించు కోలేము!
తెలివిగా!ఱుణమును తీర్చ వలయు!
సంపన్న దేశమై!సాహసో పేతమై!
విశ్వ విఖ్యాతయై!వెలుగు!భవిని!
తే,గీ:-చక్కనౌ!తెల్వి!యొక్కింత!చిక్క బరచ!
భవిత!నడయాడు!బంగరు!బాట లందు!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత బోనాడి!కల్ము లిమ్మ!
ఫల శ్రుతి!
___________
సీ;-కన లేక!విన లేక!కలి వికారత గాంచి!
మనలేక!మనుజుల మనసు నెరిగి!
న్యాయంబు ధర్మంబు!నర్మతం!దనరారి!
కర్మ కర్తృక చేష్ట!గాలి కెగసె!
చెడు చేత!పడు పాటు!విడిచి పో లేకను!
ధీనయై!హీనయై!దిక్కు గనక!
భవి పెంపు మది నెంచి!భరతాంబ!తపియించె!
గణనీయతం గూర్చ!కదిలె!కలము!
తే,గీ:-మనల నడిపించు దైవంబె!మనకు రక్ష!
సావధానత!మంచెంచి!సాగ!ముక్తి!
వరలు ఋత్తాడ!మల్లేశ!వాగ ధీశ!
కలి వికారత!బోనాడి!కల్ము లిమ్మ!
గద్యము
ఇది శ్రీమ దుభయ భాషా భూషణ విద్వ ద్వరేణ్య
వేంకట్రాయ శాస్త్రి వరేణ్య,ప్రపౌత్ర,సారస్వత!
కృపా పాత్ర,కాశ్యపస గోత్ర పవిత్ర,వల్లభవఝల
సంజ్ఞా పయః పారావార రాకా సుధా కర
నారసింహశాస్త్రి పౌత్ర,శ్రీరామమూర్త్యా హ్వయు
నారాయణాంబ,గర్భ శుక్తి,ముక్తా ఫలాయ మాన
సోదర సోదరీ సమన్విత,సుధీ విధేయ అప్పల నరసింహ
మూర్తి శర్మ నామధేయ విరచిత ఋత్తాడ మల్లేశ!శతకము
సమాప్తము
మంగళమ్!మహాత్!
శ్రీ శ్రీ శ్రీ జుత్తాడ ఉమా మల్లేశ్వర దేవతార్పణ మస్తు.
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.