గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఫిబ్రవరి 2026, ఆదివారం

కందగర్భ మంజులవృత్తం: ( భనజయ- 8 )... చింతా రామకృష్ణారావు.

 జైశ్రీరామ్. 

కందగర్భ మంజులవృత్తం: ( భనజయ- 8 )

శంకర! పురహర! సత్కృత! శంకా

సంకటములడచి చక్కని తీరున్

పొంకము కలిగిన పొందిక వంకా

వంకలు మడపియు ప్రాపిడు సాంబా!

 

మంజులవృత్త గర్భిత కందం  ... 

శంకర! పురహర! సత్కృత!

శంకా సంకటములడచి చక్కని తీరున్

పొంకము కలిగిన పొందిక

వంకా వంకలు మడపియు ప్రాపిడు సాంబా!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.