గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 36వ శ్లోకం. 271 - 279. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోత్రయీశిఖా విశేషజ్ఞా వేదాంతజ్ఞానరూపిణీ

భారతీ కమలా భాషా పద్మా పద్మవతీ కృతిః 36  

271. ఓం *త్రయీశిఖా*యై నమః

నామ వివరణ.

మూడు వేదములందూనిపుణత కలిగిన తల్లి మన అమ్మ.

కంప్రాకటముగ వేదత్రయ

మేకరణి గ్రహింపనౌ మహేశ్వరి? నీవే

నాకిట చక్కగఁ దెల్పుట

శ్రీకరము *త్రయీ శిఖా!* విశేషజ్ఞ! నతుల్.

272. ఓం *విశేషజ్ఞా*యై నమః

నామ వివరణ.

సృష్టికి సంబంధించిన విశేషమయిన జ్ఞానము కలిగిన అమ్మ.

కంలోకవిశేషజ్ఞానము

శ్రీకరముగను గలిగిన *విశేషజ్ఞా!* నన్

నీ కరుణను కాపాడుమ,

నీకున్ దాసుఁడను నేను నీరజ నేత్రా!

తే.గీ.  శ్రీ *విశేషజ్ఞ* నిన్ను నా చిత్తమందు

శాశ్వతంబుగ నిలుపగ చక్కనైన

సాధనాశక్తి నిమ్మని సాగిలపడి

మ్రొక్కుచుంటిని, వరమిమ్ము చక్కనమ్మ!

కంప్రాకటముగ వేదత్రయ

మేకరణి గ్రహింపనౌ మహేశ్వరి? నీవే

నాకిట చక్కగఁ దెల్పుట

శ్రీకరము త్రయీ శిఖా! *విశేషజ్ఞ!* నతుల్.

ఓం *త్రయీశిఖావిశేషజ్ఞా*యై నమః

నామ వివరణ.

మూడు వేదములందూనిపుణత కలిగిన తల్లి మన అమ్మ.

కంప్రాకటముగ వేదత్రయ

మేకరణి గ్రహింపనౌ మహేశ్వరి? నీవే

నాకిట చక్కగఁ దెల్పుట

శ్రీకరము *త్రయీ శిఖా విశేషజ్ఞ!* నతుల్.

273. ఓం *వేదాన్తజ్ఞానరూపిణ్యై* నమః

నామ వివరణ.

వేదాంత జ్ఞానమే రూపముగా ఉన్న తల్లి మన అమ్మ.

కం  బాధలనెడఁ బాపుము భువి,

సాదరముగ చూడుమమ్మ! సన్నుత జననీ!

మోదమునఁ గావ నన్నున్

*వేదాంత జ్ఞాన రూపిణీ! * నినుఁ గొలుతున్.

274. ఓం *భారత్యై* నమః

నామ వివరణ.

మిక్కిలి ప్రకాశవంతమయిన తల్లి మన అమ్మ. అక్షర జ్ఞానప్రదాయిని మన అమ్మ.

తే.గీ.  *భారతీ!* నీదు పదములే పట్టుకొమ్మ,

వాక్సుధామయ మూర్తుల భాగ్యమవియె,

పట్టి సేవింతు నీ పద పంకజములు,

నాదు జిహ్వాగ్రవర్తినీ! యాదుకొనుము.

275. ఓం *కమలా*యై నమః

నామ వివరణ.

కమలమువలె మనోజ్ఞాముగా ప్రకాశించు జనని మన అమ్మ.

తే.గీ. *కమల!* సుకుమార సుందర కల్పవల్లి!

నాదు మదిలోన వెల్గుమా! మోదమునను,

జ్ఞాన సూర్యప్రకాశమే కలదు నీకు,

పొంగిపోవుచునుండిట రంగుగాను.

276. ఓం *భాషా*యై నమః

నామ వివరణ.

భాష యొక్క స్వరూపము అమ్మయే.

తే.గీ. వినుత! భాషా! మదంబా! సవినయముగను

నిన్ను సేవింతు నోయమ్మ, నెమ్మనమున

వరలఁజేయు మా భాషను భద్రతనిడి,

వందనంబులు చేసెద నందుకొనుము.

277. ఓం *పద్మా*యై నమః

నామ వివరణ.

అమ్మ కమలోద్భవి.

కంసేవింతును నిను *పద్మా!*

భావించుచు మానసమున భక్తిగ నెలమిన్,

నీవే మానస హంసగ

భావిని నడిపించుమమ్మభద్రత నిడుచున్.

278. ఓం *పద్మవత్యై* నమః

నామ వివరణ.

కమలాసన మన అమ్మ.

తే.గీతీరమును జేర్చు *పద్మవతీ!* నమామి,.

హృదయ పద్మమ్ముపైన  నీవేర్పడంగ

వాసముండుము నాలోని ధ్యాసనెఱిగి,

వందనములు పద్మాసనా! యందుకొనుము.

279. ఓం *కృతయే* నమః

నామ వివరణ.

క్రియాఫలమయిన కృతి అమ్మయే.

తే.గీసత్ *కృతీ!* నీవు నాలోని సత్యమగుచు

నాదు కృతులందు వసియించు మోదమునను,

కృతికి సత్కృతి నీవుసంస్తుతిగ నిండ,

వందనంబులు చేసెద నందుకొనుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.