గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, మార్చి 2024, సోమవారం

సద్గోష్టి,సావధాన,భాగ్య జీవన,గ్రీష్మ తాపం,పుష్టి లేని,కలితీరు"గర్భపుష్టి గాని"వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్. 

పాపు లే పరమాత్ము లైనన్!పావనత్వం మట్టి గల్యున్!భ్రష్ట జీవన భాగ్య మబ్బున్!

గోపనంబగు శ్రీలు జారున్!కోవిదుల్హింసందు చుందుర్!గోష్టి మంచిని కోరు నొక్కో?
శాపమా నర జన్మ ధాత్రిన్!సావధానం గాన దెందున్!స్రష్ట యైనను సృష్టి మానున్!
భూప దుష్కృత బాధ లందున్!భూవరామం బుగ్గియౌచున్!పుష్టి కాదది కల్యుగానన్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి ఛందము
లోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరము లకు చెల్లును.

1,గర్భగత"-ప్రాపక"-వృత్తము.

పాపులే పరమాత్ము లైనన్!
గోపనంబగు శ్రీలు జారన్!
శాపమా!నరజన్మ ధాత్రిన్!
భూప దుష్కృత బాధ లందున్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు .పాదమునకు"9"అక్షరము లుండును.

2,గర్భగత"-పాపుల"-వృత్తము.

పావనత్వం మట్టి మట్టి గల్యున్':
కోవిదుల్హింసందు చుందుర్!
సావధానం గాన దెందున్!
భూవరామం బుగ్గి యౌచున్!

అభిజ్ఞా ఛందము నందలి"-"అనుష్టుప్""-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

3,గర్భగత"-గోపన"-వృత్తము.

భ్రష్ట జీవన భాగ్య మబ్బున్!
గోష్టి మంచిని కోరునొక్కో?
స్రష్టయైనను సృష్టి మానున్!
పుష్టి కాదది కల్యుగానన్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

4,గర్భగత"-శాపనా"-వృత్తము.

పాపులే పరమాత్ము లైనన్!పావనత్వం మట్టి గల్యున్!
గోపనంబగు శ్రీలు జారున్!కోవిదుల్హింసందు చుందుర్!
శాపమా నరజన్మ ధాత్రిన్!సావధానం గాన దెందున్!
భూప దుష్కృత బాధ లందున్!భూవరామం బుగ్గి యౌచున్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
పాదమునకు"17"అక్షరము లుండును.ప్రాసనియమము కలదు.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-బుగ్గిపాలు"-వృత్తము.

పావనత్వం మట్టి గల్యున్!పాపులే పరమాత్ము లైనన్?
కోవిదుల్హింసందు చుందుర్!గోపనంబగు శ్రీలు జారున్!
సావధానం గాన దెందున్!శాపమా?నరజన్మ ధాత్రిన్!
భూవరామం బుగ్గి యౌచున్!భూప దుష్కృత బాధలందున్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,17,అక్షరము లుండును.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-మట్టిగల్యు"-వృత్తము

పాపులే పరమాత్ము లైనన్?భ్రష్ట జీవన భాగ్య మబ్బున్!
గోపనంబగు శ్రీలు జారున్!గోష్టి మంచిని గోరు నొక్కో?
శాపమా?నరజన్మ ధాత్రిన్!స్రష్ట యైనను సృష్టి మానున్!
భూప దుష్కృత బాధ లందున్!పుష్టి కాదది కల్యుగానన్!

అణిమా ఛందము నందలి"ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-కోవిద"-వృత్తము.

భ్రష్ట జీవన భాగ్య మబ్బున్!పాపులే పరమాత్ము లైనన్?
గోష్టి మంచిని కోరు నొక్కో?గోపనంబగు శ్రీలు జారున్!
స్రష్టయైనను సృష్టి మానున్!శిపమా?నరజన్మ ధాత్రిన్!
పుష్టి కాదది కల్యుగానన్!భూప దుష్కృత బాధ లందున్!

అణిమా ఛందము నందలి"-ధృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18,అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-భూవరామ"-వృత్తము.

పావనత్వం మట్టి గల్యున్!భ్రష్ట జీవన భాగ్య మబ్బున్!
కోవిదుల్హింసందు చుందుర్!గోష్టి మంచిని కోరు నొక్కో?
సావధానం గాన దెందున్!స్రష్టయైనను సృష్టి మానున్!
భూవరామం బుగ్గి యౌచున్!పుష్టి కాదది కల్యుగానన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17:అక్షరము లుండును.
యతి,9,వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-సద్గోష్టి"-వృత్తము.

భ్రష్ట జీవన భాగ్య మబ్బున్!పావనత్వం మట్టి గల్యున్!
గోష్టి మంచిని కోరు నొక్కో?కోవిదుల్హింసందు చుందుర్!
స్రష్ట యైనను సృష్టి మానున్!సావధానం గాన దెందున్?
పుష్టి కాదది కల్యుగానన్!భూవరామం బుగ్గి యౌచున్!

అణిమా ఛందము నందలి "అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి ,10,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-సావధాన"-వృత్తము.

పావనత్వం మట్టి గల్యున్!పాపులే పరమాత్ము లైనన్!భ్రష్ట జీవన భాగ్య మబ్బున్!
కోవిదుల్హింసందు చుందుర్!గోపనంబగు శ్రీలు జారున్!గోష్టి మంచిని కోరు నొక్కో?
సావధానం గాన దెందున్?శాపమా నర జన్మ ధాత్రిన్!స్రష్టయైనను సృష్టి మానున్!
భూవరామం బుగ్గియౌచున్!భూప దుష్కృత బాధలందున్!పుష్టి కాదది కల్యుగానన్?

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
శప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.

11,గర్భగత"-భాగ్య జీవన"-వృత్తము.

పాపులే పరమాత్ము లైనన్!భ్రష్ట జీవన భాగ్య మబ్బున్!పావనత్వం మట్టి గల్యున్!
గోపనంబగు శ్రీలు జారున్!గోష్టి మంచిని కోరునొక్కో?కోవిదుల్హింసందు చుందుర్!
శాపమా!నరజన్మ ధాత్రిన్!స్రష్టయైనను సృష్టి మానున్!సావధానం గాన దెందున్?
భూప దుష్కృత బాధ లందున్!పుష్టి కాదది కల్యుగానన్?భూవరామం బుగ్గియౌచున్!

అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-గ్రీష్మతాపం"-వృత్తము.

భ్రష్ట జీవన భాగ్య మబ్బున్!పాపులే పరమాత్ము లైనన్!పావనత్వం మట్టి గల్యున్!
గోష్టి మంచిని కోరు నొక్కో?గోపనంబగు శ్రీలు జారున్!కోవిదుల్హింసందు చుందుర్!
స్రష్ట యైనను సృష్టి మానున్!శాపమా నరజన్మ ధాత్రిన్!సావధానం గాన దెందున్?
పుష్టి కాదది కల్యుగానన్?భూప దుష్కృత బాధలందున్భూవరామం బుగ్గి యౌచున్!0

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "26"అక్షరము లుండును.
యతులు,,10,19,అక్షరము లకు చెల్లును.

13,గర్భగత"-పుష్టి లేని"-వృత్తము.

పావనత్వం మట్టి గల్యున్!భ్రష్ట జీవన భాగ్య మబ్బున్!పాషులే పరమాత్ము లైనన్?
కోవిదుల్హింసందు చుందుర్!గోష్టి మంచిని కోరు నొక్కో?గోపనంబగు శ్రీలు జారున్!
సావధానం గాన దెందున్?స్రష్టయైనను సృష్టి మానున్!శాపమా నరజన్మ ధాత్రిన్?
భూవరామం బుగ్గి యౌచున్!పుష్టి కాదది?కల్యుగానన్!భూప దుష్కృత బాధలందున్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26,అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.

14,గర్భగత"-కలితీరు"-వృత్తము.

భ్రష్ట జీవన భాగ్య మబ్బున్!పావనత్వం మట్టి గల్యున్!పాపులే పరమాత్ములైనన్?
గోష్టి మంచిని కోరు నొక్కో?కోవిదు ల్హింసందు చుందుర్!గోపనంబగు శ్రీలు జారున్!
స్రష్టయైనను సృష్టి మానున్!సావధానం గానదెందున్?శాపమా?నరజన్మ ధాత్రిన్!
పుష్టి కాదది కల్యుగానన్?భూవరామం బుగ్గి యౌచున్!భూపదుష్కృత బాధలందున్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.