జైశ్రీరామ్.
ఇంట గెల్చియు రచ్చ గెల్వన్!ఎంత యత్నించినా సరే!ఈడి పించు ప్రాళుబ్ధ మింతే!!
పంటి పల్కుల దోష భావమ్!పంత మార్గంబు నెంచెనే!పాడు గూర్చె వాగార్థ దోషమ్!
కొంటి చేష్టల క్లిష్ట చర్యల్!కొంత మేలెంచ లేదయెన్!గోడు పడ్డ జన్మం బనంగన్ !
వెంట నంటని మోక్ష మాయెన్!వింత జీవం బిదే గదా!వీడ రేల?దౌర్భాగ్య చర్యల్!
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"-అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"-
ఛందము నందలిది.ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10;18,అక్షరము లకు చెల్లును.
1,గర్భగత"రచ్చ గెల్చు"వృత్తము.
ఇంట గెల్చియు రచ్చ గెల్వన్!
పంటి పల్కుల దోష భావమ్!
కొంటి చేష్టల క్లిష్ట చర్యల్!
వెంట నంటని మోక్ష మాయెన్!
అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.
2,గర్భగత,ఇంట గెల్పు"-వృత్తము.
ఎంత యత్నించినా సరే!
పంత మార్గంబు నెంచెనే!
కొంత మేలెంచ లేరయెన్!
వింత జీవం బిదే యనన్!
అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరంబు లుండును.
3,గర్భగత"-దోష భూష"-వృత్తము.
ఈడి పించె ప్రాళుబ్ధ ఖర్మమ్!
పాడు గూర్చె వాగార్థ దోషమ్!
గోడు పడ్డ జన్మం బనంగన్!
వీడ రేల దౌర్భాగ్య చర్యల్!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును,
4,గర్భగత"క్లిష్ట స్థితి"-వృత్తము.
ఇంట గెల్చియు రచ్చ గెల్వన్!ఎంత యత్నించినా సరే!
పంటి పల్కుల దోషభావమ్!పంత మార్గంబు నెంచులే
కొంటి చేష్టల క్లిష్ట చర్యల్!కొంత మేలెంచ లేదయెన్!
వెంట నంటని మోక్ష మాయెన్!వింత జీవం బిదే యనన్!
అణిమా ఛందము నందలి"-అత్యష్టి;ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17,అక్షరములుండును.
యతి,10,వ యక్షరము నకు చెల్లును.
5,గర్భగత"-వెంట నంటని"-వృత్తము.
ఎంత యత్నించినా సరే!ఇంట గెల్చియు రచ్ఛ గెల్వన్!
పంత మార్గంబు నెంచులే!పంటి పల్కుల దోష భావనన్!
కొంత మేలెంచ లేదయెన్!కొంటి చేష్టల క్లిష్ట చర్యల్!
వింత జీవం బిదే యనన్?వెంట నంటని మోక్ష మాయెన్!
6,గర్భగత"-గోడు పడ్డ"-వృత్తము.
ఎంత యత్నించినా సరే!ఈడి పించె ప్రాళుబ్ధ కర్మమ్!
పంత మార్గంబు నెంచులే!పాడు గూర్చె వాగార్థ దోషమ్!
కొంత మేలెంచ లేకయెన్!గోడు పడ్డ జన్మం బనంగన్!
వింత జీవం బిదే యనన్!వీడ వేర సౌభాగ్య చర్యలన్?
అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,17,అక్షరము లుండును.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.
7,,గర్భగత"--దౌర్భాగ్య"-వృత్తము.
ఈడి పించె ప్రాళుబ్ధ కర్మమ్!ఎంత యత్నించినా సరే!
పాడు గూర్చె వాగార్థ దోషమ్!పంత మార్గంబు నెంచులే!
గోడు పడ్డ జన్మం బనంగన్!కొంత మే లెంచ లేకయెన్
న్వీడ వేర దౌర్భాగ్య చర్యలన్!వింత జీవం బిదే యనన్?
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.
8,గర్భగత"-గోడు పడ్డ"-వృత్తము.
ఇంట గెల్చియు రచ్చ గెల్వన్!ఈడి పించె ప్రాళుబ్ధ కర్మమ్!
పంటి పల్కుల దోష భావమ్!పాడు గూర్చె వాగార్ధ దోషమ్.
కొంటి చేష్టల క్లిష్ట చర్యల్!గోడు పడ్డ జన్మం బవంగన్!
వెంట నంటని మోక్ష మాయెన్!వీడ వేర దౌర్భాగ్య చర్యల్?
అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.యతి"10;వ యక్షరమునకు చెల్లును.పాదమునకు
18,అక్షరము లుండును.
9,గర్భగత,పాడొనరు"-వృత్తము.
ఈడి పించె ప్రాళుబ్ధ కర్మమ్!ఇంట గెల్చియు రచ్చ గెల్వన్!
పాడు గూర్చె వాగార్థ దోషమ్!పంటి పల్కుల దోష భావమ్!
గోడు పడ్డ జన్మం బవంగన్!కొంటి చేష్టల క్లిష్ట చర్యల్.
వీడ రేల దౌర్భాగ్య చర్యల్?వెంట నంటని మోక్షమై!
అణిమా ఛందము నందలి"-ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10"వయ్కషరమునకు చెల్లును.
10,గర్భగత"-మేలెంచు"వృత్తము.
ఎంత యత్నించినా సరే!ఇంట గెల్చియు రచ్చ గెల్వన్!ఈడి పించు ప్రాళుబ్ధ కర్మమ్!
పంత మార్గంబు నెంచెనే!పంటి పల్లుల దోష భావమ్!పాడు గూర్చె వాగార్థ దోషమ్!
కొంత మేలెంచ లేదయెన్!కొంటి చేష్టల క్లిష్ట చర్యల్?గోడు పడ్డ జన్మంబవంగన్!
వింత జీవం బిదే యనన్!వెంట నంటని మోక్ష మాయెన్!వీడ వేర దౌర్భాగ్య చర్యల్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరము లకు చెల్లును.
11,గర్భగత"-పంటిదోషం"-వృత్తము.
ఇంట గెల్చియు రచ్ఛ గెల్వన్!ఈడి పించె ప్రాళుబ్ద కర్మమ్!ఎంత యత్నించినా సరే!
పంటి పల్లుల దో షభావమ్! పాడు గూర్చె వాగతార్థ దోషమ్!పంత మార్గంబు నెంచెనే!
కొంటి చేష్టల క్లిష్ట చర్యల్!!గోడు పడ్డ జన్మం బనంగన్!కొంత మేలెంచ లేదయెన్!
వెంట నంటని మోక్ష మాయెన్!వీడ వేర దౌర్భాగ్య చర్యల్!వింత జీవంబిరే యనన్?
అనిరుద్ఛందము నందలి"-ఉత్కుతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.
12 ,గర్భగత"-కొంటి చేష్ట"-వృత్తము.
ఈడి పించె ప్రాళు బ్ధ కర్మమ్!ఇంట గెల్చియు రచ్చ గెల్వన్!ఎంత ప్రయత్నించినా రే!
పాడు గూర్చె వాగార్ధ దోషమ్!పంటి పల్లుల దోష భావమ్!పంత మార్గంబు నెంచెనే!
గోడు పడ్డ జన్మం బనంగన్!కొంటి చేష్టల క్లి ష్ట చర్యల్!కొంత మేలెంచ లేదయెన్!
వీడ వేర దౌర్భాగ్య చర్యల్!వెంట నంటని మోక్ష మాయెన్!వింత జీవం బిదే యనన్?
అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరము లకు చెల్లును.
13,గర్భగత"-యత్నము"-వృత్తము..
ఎంత యత్నించినా సరే!ఈడిపించె ప్రా ళుబ్ధ కర్మమ్!ఇంట గెల్చియు రచ్చ గెల్వన్!
పంత మార్గంబు నెంచెనే!పాడు గూర్చి వాగార్థ దోషమ్!పంటి పల్లుల దోషభావమ్!
కొంత మేలెంచ లేదయెన్!గోడు పడ్డ జన్మం బనంగన్!కొంటి చేష్టల క్లిష్ట చర్యల్!
వింత జీవంబిదే యనన్!వీడ వేర దౌర్భాగ్య చర్యల్!వెంట నంటని మోక్ష మాయెన్!
అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుడును.
యతులు,9,18,అక్షరము లకు చెల్లును..
14,గర్భగత"-వీడవేల?"వృత్తము.
ఈడిపించె ప్రాళుబ్థ కర్మమ్!ఎంత యత్నించినా సరే!ఇంట గెల్చియు రచ్చ గెల్వన్!
పాడు గూర్చి వాగార్ధ దోషమ్!పంత మార్గంబు నెంచెనే!పంటి పల్లుల దోషభావమ్!
గోడు పడ్డ జన్మం బనంగన్!కొంత మేలెంచ లేదయెన్!కొంటి చేష్టలల క్లిష్ట చర్యల్!
వీడ వేర దౌర్భాగ్య చర్యల్!వింత జీవం బిదేయనన్!వెంట నంటని మోక్ష మాయెన్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
పప్రాసనియమము కలదు.పాదమునకు"-26"అక్షరము లుండును.
యతులు"10,18,అక్షరము లకు చెల్లును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.