గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, మార్చి 2024, గురువారం

జన్మతో జాయతే బుద్ధి: ... మేలిమిబంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్. 

శ్లో.  జన్మతో జాయతే బుద్ధి:  -  యావజ్జీవం స్థిరా భవేత్ 

గురుబోధసహస్రైశ్చ  -  న కించిత్ పరివర్తతే !

తే.గీ.  పుట్టినప్పుడె వచ్చెడి బుద్ధి మనకు

జీవితాంతము విడబోదు, జీవితేశ!

గురులెందరు నేర్పినన్ నిరుపమముగ

మార్పు రాబోదు బుద్ధిలో, మాయ యిదియె.

భావము.  మనిషి పుట్టుకతోనే స్వభావం పుడుతుంది.అది జీవితాంతము 

స్థిరంగా ఉంటుంది.వేలమంది గురువులు బోధలు చేసినా కుక్క తోక 

వంకర వలె అది మారనే మారదు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.