గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, మార్చి 2024, సోమవారం

కలి యధర్మ,వెతలాగత,చరిత కీర్తి,నతమతి,జత దురిత,గర్భ"-వికటాటక"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.

 కట కట వికటా టకుల్!కలి యధర్మ మేర్చిరే?గతి వెత జత గొనంగన్!

నట విట భృకుటాలచేన్! నలుప జూతు రిద్ధరన్?నత మతు లెడ మెడంగన్?
చట పట ధన దాహులై!చలిత కీర్తి నూ హిలన్!జత దురిత మిదె!యంచున్!!
మిట మిట పడ రాలరే?మెలికి జీవ కర్మతన్!మృతి దరి జనగ నేలన్?

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"
ఛందము లోనిది.ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము
లుండును.యతులు"10,18,అక్షరము లకు చెల్లును.

1,గర్భగత"-కట కట"-వృత్తము.

కట కట వికటా ట కుల్!
 నట విట భృకుటాల చేన్!
చట పట ధన దాహులై!
మిట మిట పడ రాలరే?

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

2,గర్భగత"-విట నట"-వృత్తము.

కలి యధర్మ మేర్చిరే?
నలుప జూతు రిద్ధరన్?
చలిత కీర్తి నూహిలన్!
మెలికి జీవ కర్మతన్!

అభిజ్ఞా ఛందము నందలి"-అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

3,గర్భగత"చట పట"-వృత్తము.

గతి వెత  జత గొనంగన్!
నత నుతు లెడ మెడంగన్!
జత దురిత మిదె యంచున్!
మృతి దరి జనగ నేలన్?

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

4,గర్భగత"-మిట్టి పడు"-వృత్తము.

కట కట వికటాట కుల్!కలి య ధర్మమేర్చిరే?
నట విట భృకుటాల చేన్!నలుప జూతు రిద్ధరన్?
చట పట ధన దాహులై!చలిత కీర్తి నూహిలన్!
మిట మిట పడ రాలరే?మెలిక జీవ కర్మతన్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
పాదమునకు"17"అక్షరము లుండును.ప్రాసనియమము కలదు.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-కలి ధర్మ"-వృత్తము.

కలి యధర్మ మేర్చిరే?కట కట వకటాట కుల్!
నలుప జూతు రిద్ధరన్?నట విట భృకుటాలచేన్!
చలిత కీర్తి నూహిలన్చట పట ధన దాహులై!
మెలిక జీవ కర్మతన్!మిట మిట పడ రాలరే?

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదము నకు"17"అక్షరము లుండును.
యతి,9,వ యక్షరము నకు చెల్లును.

6,గర్భగత"-గత వెత"-వృత్తము,

కట కట వికటాటకుల్!గత వెత జత గొనంగన్?
నట విట భృకుటాల చేన్!నత నుతు లెడమెడంగన్!
చట పట ధన దాహులై!జత దురిత మిదె!యంచున్!
మిట మిట పడ రాలరే?మృతి దరి జనగ నేలన్?

అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-చల కీర్తి"-వృత్తము.

గత జత వెత గొనంగన్?కట కట విక టాటకుల్!
నత నుతు లెడ మెడంగన్!నట విట భృకుటాల చేన్!
జత దురిత మిదె?యంచున్!చట పట ధన దాహులై!
మృతి దరి జనగ నేలన్?మిట మిట పడ రాలరే?

అణిమా చందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరము నకు చెల్లును.

8,గర్భగత"-చలనంబ"-వృత్తము.

కలి యధర్మ మేర్చిరే?గత వెత జత గొనంగన్?
నలుప జూతు రిద్ధరన్?నత నుతు లెడ మెడంగన్?
చలిత కీర్తి నూహిలన్!జత దురిత మిదె?యంచున్!
మెలిక జీవ కర్మతన్!మృతి దరి జనగ నేలన్?

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,9,వ యక్షరము నకు చెల్లును.

9,గర్భగత"-మెలిజీవన"-వృత్తము.

గత జత వెత గొనంగన్?కలి యధర్మ మేర్చిరే?
నత నుతు లెడ మెడంగన్?నలుప జూతు రిద్ధరన్?
జత దురిత మిదె?యంచున్!చలిత కీర్తి నూహిలన్!
మృతి దరి జనగ నేలన్?మెలిక జీవ కర్మతన్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"-17"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-కలి యధర్మ"-వృత్తము.

కలి యధర్మ మేర్చిరే?కట కట విక టాటకుల్!గత జత వెత గొనంగన్?
నలుప జూతు రిద్ధరన్?నట విట భృకుటాలచేన్?నత నుతు లెడ మెడంగన్?
చలిత కీర్తి నూహిలన్!చట పట ధన దాహులై!జత దురిత మిదె?యంచున్!
మెలిక జీవ కర్మతన్?మిట మిట పడ రాలరే?మృతి దరి జనగనేలన్?

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు.9,18;అక్షరము లకు చెల్లును.

11.గర్భగత"-వెతలాగత"-వృత్తము.

కట కట వికటా టకుల్!గత జత వెత గొనంగన్?కలి యధర్మ మేర్చిరే?
నట విట భృకుటాల చేన్?నత నుతు లెడ మెడంగన్?నలుప జూతు రిద్ధరన్?
చట పట ధన దాహులై!జత దురిత మిదె?యంచున్!చలిత కీర్తి నూహిలన్!
మిట మిట పడ రాలరే?మృతి దరి జనగ నేలన్?మెలిక జీవ కర్మతన్?

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"-26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరము లకు చెల్లును.

12,గర్భగత"-చలిత కీర్తి"-వృత్తము.

గత జత వెత గొనంగన్?కట కట వికటా టకుల్!కలి యధర్మ మేర్చిరే?
నత నుతు లెడ మెడంగన్?నట విట భృకుటాలచేన్?నలుప జూతు రిద్ధరన్?
జత దురిత మిదె?యంచున్!చట పట ధన దాహులై!చలిత కీర్తి నూహిలన్?
మృతి దరి జనగ  నేలన్?మిట మిట పడ రాలరే?మెలిక జీవ కర్మతన్?

అనిరుద్ఛందము నందలి ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరము లకు చెల్లును.

13,గర్భగత"-నతనుతి"-వృత్తము.

కలి యధర్మ మేర్చిరే?కట కట వికటా టకుల్!గత జత వెత గొనంగన్?
నలుప జూతు రిద్ధరన్?నట విట భృకుటాల చేన్?నత నుతు లెడ మెడంగన్?
చలిత కీర్తి నూహిలన్?చట పట ధన దాహులై!జత దురిత మిదె?యంచున్!
మెలిక జీవ కర్మతన్?మిట మిట పడ రాలరే? మృతి దరి జనగనేలన్?

అనిరుద్ఛందము నందలి ఉత్కృతి"-ఛందము లోనిది.
పప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అఅక్షరములకు చెల్లును.

14,గర్భగత"-జత దురిత"వృత్తము.

గత జత వెత గొనంగన్?కలి యధర్మ మేర్చిరే?కట కట వికటా టకుల్!
నత నుతు లెడ మెడంగన్?నలుప జూతు రిద్ధరన్?నట విట భృకుటాల చేన్?
జత దురిత మిదె?యంచున్!చలిత కీర్తి నూహిలన్?చట పట ధన దాహులై!
మృతి దరి జనగ నేలన్?మెలిక జీవ కర్మతన్?మిట  మిట పడ రాలరే?

అనిరుద్ఛందమందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమనకు"26"అక్షరము లుండును.
యతులు,10",18,అక్షరము లకు చెల్లును.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.