గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, మార్చి 2024, సోమవారం

మెలిజను,చెడు దురు,ధనదాహ,బలిదులు,ప్రభు తాశ,,మెలిక,గదియు,గర్భ"-పలుతెరంగుల వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్. 

గడి నెడమగు సిరులన్!కలతిలు కతనమున్!గదియుదు రెద స్వార్ధతన్!

పడి పడి దురహ మునన్!పలు తెరగుల జనన్!వదలని ధన దాహులై!
వడి గొన దలతు రిలన్!బల మొలుక చెడుతన్!పదవుల ప్రభు తాశలన్!
మిడిసిల చెడుదురె పో!మెలిక జననము నన్!మెదవు పశువు తుల్యతన్!

సంజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"-అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"
ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరము లకు చెల్లును.

1,గర్భగత"-గడి నెడమ"-వృత్తము.

గడి నెడమగు సిరులన్!
పడి పడి దురహ మునన్!
వడి గొన దలతురిలన్!
మిడిసిల చెడుదురె పో!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు,9"అక్షరము లుండును.

2,గర్భగత"-పడుదురు"-వృత్తము.

కలతిలు కతనమున్
పలు తెరగుల జనన్!
బల మొలుక చెడుతన్!
మెలిక జననమునన్!

అభిజ్ఞా"ఛదము నందలి"-అనుష్టుప్"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,8,అక్షరము లుండును.

3,గర్భగత"-దుర మది"-వృత్తము.

గదియుదు రెద స్వార్ధతన్!
వదలని ధన దాహులై!
పదవుల ప్రభు తాశలన్!
మెదవు పశువు తుల్యతన్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతె"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

4,గర్భగత"-వడి గొన"-వృత్తము.

గడి నెడమగు సిరులన్!కలతిలు కతనమున్!
 పడి దురహమునన్!పలు తెరగుల జనన్!
వడి గొన దలతు రిలన్!బలమొలుక చెడుతన్!
మిడిసిలి చెడుదురె పో!మెలిక జననము నన్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,17,అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-పడి పడి "వృత్తము. 

కలతిలు కతనమున్!గడి నెడమగు సిరులన్!
పలు తెరగుల జనన్!పడి దురహమునన్!
బలమొలుక చెడుతన్!వడి గొన దలతు రిలన్!
మెలిక జననము నన్!మిడి సిలి చెడు దురె పో!

అణిమా ఛందమునందలి"-అత్యష్టి "ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,9,వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-బలమొలుక"-వృత్తము.

కలతిలు కతనమున్!గడి నెడమగు సిరులన్!గదియుదు రెద స్వార్ధతన్!
పలు తెరగుల జనన్!పడి దుర హమునన్!వదలని ధన దాహులై!
బలమొలుక చెడుతన్!వడి గొన దలతు రిలన్!పదవుల ప్రభుతా శలన్!
మెలిక జనన మునన్!మిడిసిలి చెడుదురె పో!మెదవు పశువు  తుల్యతన్!ఝ

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరము లకు చెల్లును.

7,గర్భగత"-మిడి సిలి"-వృత్తము.

గడి నెడమగు సిరులన్!గదియుదురె స్వార్ధతన్!
పడి దుర హమునన్!వదలని ధన దాహులై!
వడి గొన దలతురిలన్!పదవుల ప్రభు తాశలన్!!
మిడిసిలి చెడుదురె పో!మెదవు పశువు తుల్యతన్!

అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-వెలిజను"-వృత్తము.

గడి నెడమగు సిరులన్!గదియుదురె స్వార్ధతన్!కలతిలు కతనమున్!
పడి దురహ మునన్!వదలని ధన దాహులైపలు తెరగుల జనన్!
వడి గొన దలతు రిలన్!పదవుల ప్రభు తాశలన్!బల మొలుక చెడుతన్!
మిడిసిలి చెడుదురె పో!మెదవు పశువు తుల్యతన్!మెలిక జననమునన్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరము లకు చెల్లును.

9,గర్భగత"-చెడుదురు"-వృత్తము.

గదియుదురెద స్వార్ధతన్!గడి నెడమగు సిరులన్!
వదలని ధన దాహులై!పడెదు రహమునన్!
పదవుల ప్రభు తాశలన్!వడి గొన దలతు రిలన్!
మెదవు పశువు తుల్యతన్!మిడిసిలి చెడుదురె పో!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17,అక్షరము లుండును.
యతి,9,వ యక్షరము నకు చెల్లును.

10,గర్భగత"-ధనదాహ"-వృత్తము.

గదియుదురెద స్వార్ధతన్!గడి నెడమగు సిరులన్1!కలతిలు కతనమున్!
వదలని ధన దాహులై!పడెదు రహమనన్!పలు తెరగుల జనన్!
పదవుల ప్రభు తాశలన్!వడి గొన దలతు రిలన్!బలమొలుక చెడుతన్!
మెదవు పశువు తుల్యతన్!మిడిసిలి చెడుదురె పో!మెలిక జననమునన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.

11,గర్భగత"-బలిదుల"-వృత్తము

.కలతిలు కతనమున్!గదియుదు రెద స్వార్ధతన్!
పలు తెరగుల జనన్!వదలని ధన దాహులై!
బల మొలుక చెడుతన్!పదవుల ప్రభు తాశలన్!
మెలిక జననమునన్!మెదవు పశువు తుల్యతన్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరములుండును.
యతి,9,వ యక్షరమునకు చెల్లును.

12,గర్భగత"-ప్రభు తాశా"-వృత్తము.

కలతిలు కతనమున్!గదియుదు రెద స్వార్ధతన్!గడి నెడమగు సిరులన్!
పలు తెరగుల జనన్!వదలని ధన దాహులై!పడెదు రహమునన్!
బలమొలుక చెడుతన్!పదవుల ప్రభు తాశలన్వడిగొన దలతురిలన్!
మెలిక జననము నన్!మెదవు పశువు తుల్యతన్!మిడిసిల చెడుదురె పో!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.

13,గర్భగత"-మెలిక"-వృత్తము.

గదియుదు రెద స్వార్ధతవ్!కలతిలు కతనమున్!
వదలని ధన దాహులై!పలు తెరగుల జనన్!
పదవుల ప్రభు తాశలన్!బలమొలుక చెడుతన్!
మెదవు పశువు తుల్యతన్!మెలిక జననము నన్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

14,గర్భగత"-గదియు"-వృత్తము.

గదియుదు రెద స్వార్ధమున్!కలతిలు18 కతనమున్!గడి నెడమగు సిరులన్!
వదలని ధన దాహులై!పలు తెరగుల జనన్!పడెదు రహమునన్!
పదవుల ప్రభు తాశలన్!బల మొలుక చెడుతన్!వడి గొన దలతు రిలన్!
మెదవు పశువు తుల్యతన్!మెలిక జననమునన్!మిడిసిలి చెడుదురె పో!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.