గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, మార్చి 2024, సోమవారం

బూదియ,పోడిమ చెడు,బీద జన్మ, ,గూడు లేని,తిరుగలేక,జగడాలు"-గర్భ -సశ్య శ్యామల"-వృత్తము. రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.

 వాడ వాడలు పీడిలంగన్!పాడి పంటలు మృగ్యమౌ!పాటు లేక నశింతు రెంచన్!

పోడి మంబది దూరమౌ లే!బూడిదౌ జన సాంధ్రమున్!పోటు పాటుల జీవ మింతే!
కూడు గుడ్డకు నోచు కోకన్!గోడు నొందగ శక్తి లేకన్!కోటి జన్మల పాప మంచున్?
నీడ లేదను భావ భూతిన్!నేడ కేగిన లాభమౌనే?నీటి మూటగు జీవితాలున్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"-అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి.
ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము
లుండును.యతులు"10,18,అక్షరము లకు చెల్లును.

1,గర్భగత"-వాడవాడ"-వృత్తము.

వాడవాడల పీడిలంగన్!
పోడిమంబది దూరమౌ లే!
కూడు గుడ్డకు నోచు కోకన్!
నీడ లేదను భావ భూతిన్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

2,గర్భగత"-పోడిమ"-వృత్తము.

పాడి పంటలు మృగ్యమౌ!
బూడిదౌ జన సాంధ్రమున్!
గోడు నొందగ శక్తి లేకన్!
నేడ కేగిన లాభ మౌనే?

అభిజ్ఞా ఛందము నందలి"అనుష్టుప్"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

3,గర్భగత"-నీటి మూట"-వృత్తము.

పాటు లేక నశింతు రెంచన్!
పోటు పాటుల జీవ మింతే!
కోటి జన్మల పాప మంచున్!
నీటి మూటగు జీవితాలున్!

అభిజ్ఞా ఛందమునందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

4,గర్భగత"-తిండిలేక"-వృత్తము.?
 కేగ
వాడ వాడలు పీడిలంగన్!పాటు లేక నశింతు రెంచన్!
పోడి మంబదె దూరమౌ లే!పోటు పాటుల జీవ మింతే!
కూడు గుడ్డకు నోచు కోకన్!కోటి జన్మల పాప మంచున్!
నీడ లేదను భావ భూతిన్!నీటి మూటగు జీవితాలున్!

అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

5"గర్భగత"-నీడలేని"-వృత్తము.

పాటు లేక నశింతు రెంచన్!వాడ వాడలు పీడిలంగన్!
పోటు పాటుల జీవ మింతే?పోడి మంబదె దూరమౌ వే!
కోటి జన్మల పాప మంచున్!కూడు గుడ్డకు నోచు కోకన్!
నీటి మూటగు జీవితాలున్!నీడ లేదను భావ భూతిన్!

అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-నేడ కేగు"-వృత్తము.

పాడి పంటలు మృగ్యమౌ!పాటు లేక వశింతు రెంచన్?
బూడిదౌ జన సాంధ్రమున్!పోటు పాటుల జీవ మింతే?
గోడు నొందగ శక్తి లేకన్!కోటి జన్మల పాప మంచున్?
నేడ కేగిన లాభ మౌనే?నీటి మూటగు జీవితాలున్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,9,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-గోడు నొందు"-వృత్తము.

పాటు లేక నశింతు రెంచన్?పాడి పంటలు మృగ్యమౌ!
పోటు పాటుల జీవ మింతే?బూడిదౌ జన సాంధ్రమున్!
కోటి జన్మల పాప మంచున్!గోడు నొందగ శక్తి లేకన్?

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-సాంధ్రతా"-వృత్తము.

వాడ వాడలు పీడిలంగన్!పాడి పంటలు మృగ్యమౌ!
పోడి మంబది దూర మౌలే!బూడిదౌ జన సాంధ్రమున్!
కూడు గుడ్డకు నోచు కోకన్?గోడు నొందగ శక్తి లేకన్?
నీడ లేదను భావ భూతిన్!నేడ కేగిన లాభమౌనే?

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-బూదియ"-వృత్తము.

పాడిపంటలు మృగ్యమౌ!వాడ వాడలు పీడిలంగన్!
బూడిదౌ జన సాంధ్రమున్!పోడిమంబది దూరమౌలే!
గోడు నొందగ శక్తి లేకన్?కూడు గుడ్డకు నోచు కోకన్?
నేడ కేగిన లాభమౌనే?నీడ లేదను భావ భూతిన్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది .
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-పోడిమచెడు"-వృత్తము.

పాడిపంటలు మృగ్య మౌ!వాడ వాడలు పీడిలంగన్!పాటు లేక నశింతు రెంచన్?
బూడిదౌ జన సాంధ్రమున్?పోడిమంబది దూర మౌలే?పోటు పాటుల జీవ మింతే?
గోడు నొందగ శక్తి లేకన్!కూడు  గుడ్డకు నోచు కోకన్!కోటి జన్మల పాప మంచున్?
నేడ కేగిన లాభమౌనే?నీడ లేదను జీవ భూతిన్!నీటి మూటగు జీవితాలున్?

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.

11,గర్భగత"-బీద జన్మ"-వృత్తము.

వాడ వాడలు పీడిలంగన్!పాటు లేక నశింతు రెంచన్?పాడి పంటలు మృగ్యమౌ?
పోడిమం బది దూరమౌ లే?పోటు పాటుల జీవ మింతే?బూడిదౌ జన సాంధ్రమున్!
కూడు గుడ్డకు నోచు కోకన్?కోటి జన్మల పాప మంచున్?గోడు నొందగ శక్తి లేకన్?
నీడ లేకను జీవ భూతిన్!నీట మూటగు జీవితాలున్?నేడ కేగిన లాభమౌనే?

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,26,అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరము లకు చెల్లును.

12,గర్భగత"-గతి లేని"-వృత్తము.

పాటు లేక నశింతు రెంచన్!వాడ వాడలు పీడిలంగన్!పాడి పంటలు మృగ్యమౌ?
పోటు పాటుల జీవ మింతే!పోడిమం బది దూర మౌలే?బూడిదౌ జన సాంధ్రమున్!
కోటి జన్మల పాప మంచున్?కూడు గుడ్డకు నోచు కోకన్?గోడు నొందగ శక్తి లేకన్?
నీట మూటగు జీవితాలున్?నీడ లేకను జీవ భూతిన్!నేడ కేగిన లాభ మౌనే?

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరము లకు చెల్లును.

13,గర్భగత"-తిరుగ లేక"-వృత్తము.

పాడి పంటలు మృగ్యమౌ?పాటు లేక నశింతు రెంచన్!వాడ వాడలు పీడిలంగన్!
బూడిదౌ జన సాంధ్రమున్!పోటు పాటుల జీవ మింతే!పోడిమం బది దూరమౌలే?
గోడు నొందగ శక్తి లేకన్?కోటి జన్మల పాప మంచున్?కూడు గుడ్డకు నోచు కోకన్?
నేడ కేగిన లాభ మౌనే?నీట మూటగు జీవితాలున్?నీడ లేకను జీవ భూతిన్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 26,అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరము లకు చెల్లును.

14,గర్భగత"-జగడాలు"-వృత్తము.

పాటు లేక నశింతు రెంచన్!పాడి పంటలు మృగ్యమౌ!వాడ వాడలు పీడిలంగన్!
పోటు పాటుల జీవ మింతే?బూడిదౌ జన సాంధ్రమున్!పోడిమం బది దూరమౌలే?
కోటి జన్మల పాప మంచున్?గోడు నొందగ శక్తి లేకన్?కూడు గుడ్డకు నోచు కోకన్?
నీట మూటగు జీవితాలున్?నేడ కేగిన లాభమౌనే?నీడ లేకను జీవ భుతిన్!

అనిరుర్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరము లకు చెల్లును.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.