గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, మార్చి 2024, మంగళవారం

అష్టాదశ పురాణానాం ... మేలిమి బంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్.

 శ్లో.  అష్టాదశ పురాణానాం - సారం వ్యాసేన కీర్తితమ్ 

పరోపకారః పుణ్యాయ - పాపాయ పరపీడనమ్

తే.గీ.  వ్యాసుడష్టాదశపురాణరాశిలోన

నొక్కి చెప్పెను గట్టిగా నిక్క నిజము

పరుప హింసించ పాపంబు పట్టుకొనును,

పరులకుపకారమిల పుణ్యఫలము గొలుపు.

భావము.  “పరోపకారమే పుణ్యం – పరపీడనమే పాపం” అని వ్యాస మహర్షి 

తాను రచించిన అష్టాదశ (18) పురాణాలలోని సారాన్నంతా రెండే రెండు 

మాటల్లో చెప్పాడు. కావున, ఇతరులకు- మేలు చేయుట, కీడు 

చేయకుండుట - అను ఈ రెండు సూత్రాలను మానవులు 

సర్వదా మనసునందు నిలుపుకొని ఆచరించవలెనని భావన.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.