గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, మార్చి 2024, సోమవారం

రసాతలి,సామ్యమా,కలచు,పాపౌఘ,గర్భ"-ఎడమగు స్వేచ్ఛ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్. 

కుటి లాలనమై భువిన్!కుల మత జాఢ్యాలు పెచ్చెన్!కూడని సామ్యం బిదే యనన్!

పటు భాగ్య మదా?రసన్!బలిదులధాషత్తుపెర్గెన్!పాడరి పోయెం సరాగమున్!
విట పాటన సాదృశమ్?వెలయునె స్వాతంత్య్ర మిట్లున్!వీడని దాస్యమై వెలింగెనే!
కటుతే పరమం బవన్?కలచెను పాపౌఘ చేష్టల్!గాడిని దప్పెనే బరా బరిన్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"-అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"-
ఛందము  లోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము
లుండును.యతులు,9,18,అక్షరము లకు చెల్లును.

1,గర్భగత"-కుటిల"-వృత్తము.

కుటి లాలనమై భువిన్!
పటు భాగ్య మదా?రసన్!
విట పాటవ సాధృశమ్!
కటుతే పరమంబవన్!

అభిజ్ఞా ఛందము నందలి"-అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

2,గర్భగత"-కటుత"-వృత్తము.

కుల మత జాఢ్యాలు పెచ్చెన్!
బలి దుల ధాషత్తు పెర్గెన్!
వెలయునె స్వాతంత్ర్య మిట్లున్!
కలచెను పాపౌఘ చేష్టల్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,9'అక్షరము లుండును.

3,గర్భగత"-విట నట"-వృత్తము.

కూడని సామ్యం బిదే యనన్?
పాడరి పోయెం సరాగ మున్!
వీడని దాస్యమై విలింగెనే!
గాడిం దప్పెన్ బరా బరిన్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

4,గర్భగత"-పటుత"-వృత్తము.

కుటి లాలనమై భువిన్!కుల మత జాఢ్యాలు పెచ్చెన్!
పటు భాగ్య మదా?రసన్!బలిదుల ధాషత్తు పెర్గెన్!
విట పాటన సాదృశమ్!వెలయునె?స్వాతంత్ర్య మిట్లున్!
కటుతే పరమంబవన్!కలచెను పాపౌఘ చేష్టల్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
పాదమునకు"17;అక్షరము లుండును.ప్రాసనియమము కలదు.
యతి,9,వ యక్షరము నకు చెల్లును.

5,గర్భగత"-మత జాఢ్యం"-వృత్తము.

కుల మత జాఢ్యాలు పెచ్చెన్!కుటి లాలనమై!
బలిదుల ధాషత్తు పెర్గెన్!పటు భాగ్య మదా?రసన్!
వెలయునె?స్వాతంత్ర్యమిట్లున్!విట పాటవ సాదృశమ్!
కలచెను పాపౌఘ చేష్టల్!కటుతే పరమంబవన్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
పాదమునకు"17,అక్షరములుండును.ప్రాసనియమము కలదు.
యతి,10,వ యక్షరము నకు చెల్లును.

6,గర్భగత"-పాడగు"-వృత్తము.

కుటి లాలనమై భువిన్!కూడని సామ్యంబిదే?యనన్!
పటుత భాగ్య మదా?రసన్!పాడరి పోయెం సరాగమున్!
విట పాటవ సాదృశమ్!వీడని దాస్యమై వెలింగెనే!
కటుతే పరమం బవన్! గాడిని దప్పెనే బరా బరిన్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు17,అక్షరము లుండును.
యతి,9'వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-సరాగ"-వృత్తము.

కూడని సామ్యం బిదే?యనన్!కుటి లాలనమై భువిన్!
పాడరి పోయెం సరాగమున్!పటు భాగ్య మదా?రసన్!
వీడని దాస్యమై వెలింగెనే!విట పాటవ సాదృశమ్!
గాడిని దప్పెనే బరాబరిన్!కటుతే పరమం బవన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,10,,వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-చరిష్మ"-వృత్తము.

కుల మత జాఢ్యాలు పెచ్చెన్!కూడని సామ్యం బిదే?యనన్!
బలిదుల ధాషత్తు పెర్గెన్ పాడరి పోయెన్ సరాగమున్!
వెలయునె స్వాతంత్ర్యమిట్లున్!వీడని దాస్యం వెలింగెనే!
కలచెను పాపౌఘ చేష్టల్!గాడిని దప్పెం బరా బరిన్!

అణిమా"-ఛందము నందలి"ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరము నకు చెల్లును.

9,గర్భగత"-లంపట"-వృత్తము

కూడని సామ్యం బిదే?యనన్!కుల మత జాఢ్యాలు పెచ్చెన్!
పాడరి పోయెం సరాగమున్!బలిదుల ధాషత్తు పెర్గెన్!
వీడని దాస్యం వెలిగెనే!వెలయునె స్వాతంత్ర్య మిట్లున్?
గాడిని దప్పెం బరాబరిన్!కలచెను పాపౌఘ చేష్టల్!

అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
పాదమునకు"18"అక్షరము లుండును.ప్రాసనియమము కలదు.
యతి"10"యక్షరము నకు చెల్లును.

10,గర్భగత"-భాగ్యదా"వృత్తము.

కుల మత జాఢ్యాలు పెచ్చెం!కుటి లాలనమై భువిన్!కూడని సామ్యం బిదే?యనన్!
బలిదుల ధాషత్తు పెర్గెం!పటు భాగ్య మదా?రసన్!పాడరి పోయెం సరాగమున్!
వెలయునె స్వాతంత్ర్యమిట్లున్?విట పాటవ సాదృశం!వీడని దాస్యం వెలిగెనే!
కలచెను పాపౌఘ చేష్టల్!కటుతే పరమం బవన్!గాడిని దప్పెన్ బరా బరిన్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
పాదమునకు "26"అక్షరము లుండును.ప్రాసనియమము కలదు.
యతులు"10,18,అక్షరము లకు చెల్లును.

11,గర్భగత"-రసాతలి"-వృత్తము.

కుటి లాలనమై భువిన్!కూడని సామ్యం బిదే?యనం!కుల మత జాఢ్యాలు పెచ్చెన్!
పటు భాగ్య మదా?రసం!పాడరి పోయెం సరాగమున్!బలిదుల ధాషత్తు పెర్గెన్!
విట పాటవ సాదృశం!వీడని దాస్యం వెలిగెనే!వెలయునె స్వాతంత్ర్య మిట్లున్?
కటుతే పరమంబవన్!గాడిని దప్పెం బరాబరిం!కలచెను పాపౌఘ చేష్టల్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరము లకు చెల్లును..

12,గర్భగత"-సామ్యమా"-వృత్తము.

కూడని సామ్యం బిదే?యనం!!కుటి లాలనమై భువిన్!కులమత జాఢ్యాలు పెచ్చెన్!
పాడరి పోయెం సరాగమున్!పటు భాగ్య మదా?రసన్!బలిదుల ధాషత్తు పెర్గెన్!
వీడని దాస్యం వెలిగెనే?విట పాటవ సాదృశం!వెలయునె స్వాతంత్ర్య మిట్లున్?
గాడిని దప్పెం బరాబరిన్!కటుతే పరమం బవన్!కలచెను పాపౌఘ చేష్టల్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరము లకు చెల్లును.

13,గర్భగత"-కలచు"-వృత్తము.

కుల మత జాఢ్యాలు పెచ్చెన్!కూడని సౌమ్యం బిదే?యనం!కుటి లాలనమై భువిన్!
బలిదుల ధాషత్తు పెర్గెన్!పాడరి పోయెం సరాగమున్!పటు భాగ్య మదా?రసన్!
వెలయునె స్వాతంత్ర్య మిట్లుం?వీడని దాస్యం వెలిగెనే!విట పాటవ సాదృశమ్!
కలచెను పాపౌఘ చేష్టల్!గాడిని దప్పెన్ బరాబరిన్!కటుతే పరమంబవన్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరము లకు చెల్లును.

14,గర్భగత"-పాపౌఘ"-వృత్తము.

కూడని సామ్యం బిదే?యనన్!కుల మత జాఢ్యాలు పెచ్చెం!కుటి లాలనమై భువిన్!
పాడరి పోయెం సరాగమున్!బలిదుల ధాషత్తు పెర్గెన్!పటు భాగ్య మదా?రసన్!
వీడని దాస్యం వెలిగెనే!వెలయునె స్వాతంత్ర్య మిట్లున్?విట పాటవ సాదృశమ్!
గాడిని దప్పెం బరా బరిన్!కలచెను పాపౌఘ చేష్టల్!కటుతే పరమంబవన్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అకషరము లుండును.
యతులు,10,19,అక్షరము లకు చెల్లును.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.