గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, మార్చి 2024, సోమవారం

దోష కీర్తి,శాసించు,రహి మించు,దకలు పడు,వికార చేష్ట,"-గర్భ"-దాసోహం"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్. 

సహజ సంపద దోచుచున్!సకల భుక్తి భూతులై!శాసించిరి భూత ధాత్రి నిన్!

బహుళ సార్ధక నామతన్!బకుల మించి రెంచగన్!వాసంబు లగోచరంబవన్!
దహన కీర్తి ప్ర దోషులై!!దకలు పడ్డ స్వార్ధతన్!దాసోహపు భావ జాలతన్!
రహిని మించి చరించిరే!రక రకాల చేష్టలన్!వ్రాసె న్విధియిట్టు లేలకో?

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"-అనిరుద్ఛందములోని"-ఉత్కృతి"-
ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు ,10,18,అక్షరములకు చెల్లును.

1,గర్భగత"-సహజ"-వృత్తము.

సహజ సంపద దోచుచున్!
బహుళ సార్ధక నామతన్!
దహన కీర్తి ప్ర దోషులై!
రహిని మించి చరించిరే!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

2,,గర్భగత"-సంపద"వృత్తము.

4,సకల భుక్తి భూతులై!
బకుల మించి రెంచగన్?
దకలు పడ్డ స్వార్ధతన్!
రక రకాల చేష్టలన్!

అభిజ్ఞా ఛందము నందలి"-అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"-8 ,అక్షరము లుండును

3 ,గర్భగత"-బహుళ"-వృత్తము.

శాసించిరి భూత ధాత్రినిన్!
వాసంబు లగోచరం బవన్!
దాసోహపు భావ జాలతన్!
వ్రాసెన్విధి యిట్టు లేలకో?

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

4,గర్భగత"-బకులు"-వృత్తము.

సహజ సంపద దోచుచున్!సకల భుక్తి భూతులై!
బహుళ సార్ధక నామతన్!బకుల మించి రెంచగన్?
దహన కీర్తి ప్ర దోషులై!దకలు పడ్డ స్వార్ధతన్!
రహిని మించి చరించిరే!రక రకాల చేష్టలన్!

అణిమా ఛందము  నందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17,అక్షరము లుండును.
యతి"10,వ  యక్షరము నకు చెల్లును.

5,గర్భగత"-కీర్తి దోష"-వృత్తము.

సకల భుక్తి భూతులై!సహజ సంపద దోచుచున్!
బకుల మించి రెంచగన్?బహుళ సార్ధక నామతన్!
దకలు పడ్డ స్వార్ధతన్!దహన కీర్తి ప్ర దోషులై!
రక రకాల చేష్టలన్!రహిని మించి చరించిరే!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రా స నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,"9"వ  యక్షరమునకు చెల్లును.

6,,గర్భగత"-వాసము"-వృత్తము.

సహజ సంపద దోచుచున్!శాసించిరి భూత ధాత్రినిన్!
బహుళ సార్ధక నామతన్!వాసంబు లగోచరం బవన్?
దహన కీర్తి ప్ర దోషులై!దాసోహపు భావ జాలతన్!
రహిని మించి చరించిరే!వ్రాసె న్విధి యిట్టు లేలకో?

అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-సార్ధక"-వృత్తము.

శాసించిరి భూత ధాత్రినిన్!సహజ సంపద దోచుచున్!
వాసంబు లగోచరంబవన్?బహుళ సార్ధక నామతన్!
దాసోహపు భావ జాలతన్!దహన కీర్తి ప్ దోషులై!
వ్రాసెం విధి యిట్టు లేలకో?రహిని మించి చరించిరే!

అణిమా ఛందము నందలి"-ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18,రము లుండును.
యతి10,వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-విధి విరాత"వృత్తము.

సకల భుక్తి భూతులై!శాసించిరి భూత ధాత్రినిన్!
బకుల మించి రెంచగన్?వాసంబు లగోచరం బవన్!
దకలు పడ్డ స్వార్ధతన్!దాసోహపు భావ జాలతన్!
రక రకాల చేష్టలన్!వ్రాసెం విధి యిట్టు లేలకో?

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"- వికారతా"-వృత్తము.

శాసించిరి భూత ధాత్రినిన్!సకల భుక్తి భూతులై!
వాసంబు లగోచరం బవన్!బకుల మించి రెంచగన్?
దాసోహపు భావ జాలతన్?దకలు పడ్డ స్వార్ధతన్!
వ్రాసెం విధి యిట్టు లేలకో?రక రకాల చెష్ట లన్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-దోషకీర్తి"-వృత్తము.

సకల భుక్తి భూతులై!సహజ సంపద దోచుచున్!శాసించిరి భూత ధాత్రినిన్?
బకుల మించి రెంచగన్?బహుళ సార్ధక నామతన్!వాసంబు లగోచరం బవన్!
దకలు పడ్డ స్వార్ధతన్!దహన కీర్తి ప్రదోషులై! దా సోహపు భావ జాలతన్!
రక రకాల చేష్టలన్!రహిని మించి చరించిరే ! వ్రాసెం విధి యిట్టు లేలకో?

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరము లకు చెల్లును.

11,గర్భగత"-శాసించు"-వృత్తము.

సహజ సంపద దోచుచున్!శాసించిరి భూత ధాత్రిన్!సకల భుక్తి భూతమై
బహుళ సార్ధక నామతన్!వాసంబు లగోచరంబవన్?బకుల మించి రెంచగన్!
దహన కీర్తి ప్రదోషులై!దాసోహపు భావ జాలతన్!దకలు పడ్డ స్వార్ధతన్!
రహిని మించి చరించిరే!వ్రాసెం విధి యిట్టు లేలకో?రక రకాల చేష్టలన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-రహిమించు"-వృత్తము.

శాసించిరి భూత ధాత్రినిన్!సహజ సంపద దోచుచున్!సకల భుక్తి భూతమై!
వాసంబు లగోచరం బవన్?బహుళ సార్ధక నామతన్!బకుల మించి రెంచగన్?
దాసోహపు భావ జాలతన్!దహన కీర్తి ప్ర దోషులై!దకలు పడ్డ స్వార్ధతన్!
వ్రాసెం విధి యిట్టు లేలకో?రహిని మించి చరించిరే!రక రకాల చేష్టలన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరమలకు చెల్లును.

13,గర్భగత"-దకలుపడు"-వృత్తము.

సకల భుక్తి భూతులై!శాసించిరి భూత ధాత్రినిన్!సహజ సంపద దోచుచున్!
బకుల మించి రెంచగన్?వాసంబు లగోచరం బవన్?బహుళ సార్ధక నామతన్!
దకలు పడ్డ స్వార్ధతన్!దోసోహపు భావ జాలతన్!దహన కీర్తి ప్ర దోషులై!
రక రకాల చేష్టలన్!వ్రాసెం విధి యిట్టు లేలకో?రహిని మించి చరించిరే!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు,26,అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరము లకు చెల్లును.

14,గర్భగత"-వికార చేష్ట"-వృత్తము.

శాసించిరి భూత ధాత్రినిన్!సకల భుక్తి భూతులై!సహజ సంపద దోచుచున్?
వాసంబు లగోచరం బవన్?బకుల మించి రెంచగన్?బహుళ సార్ధక నామతన్!
దాసోహపు భావ జాలతన్!దకలు పడ్డ స్వార్ధతన్!దహన కీర్తి ప్ర దోషులై!
వ్రాసెం విధి యిట్టు లేలకో?రక రకాల చేష్టలన్!రహిని మించి చరించిరే!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.