గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, మార్చి 2024, గురువారం

గతమాగత,సుభూతి,పతనావస్త,హతమతి,భూతవని,"-గర్భ"-గబ్బు జీవనా"'వృత్తము,రచన:'వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,

 జైశ్రీరామ్.

అతులిత మతి నంచున్!హత మేర్చి గత ప్రగతిన్!అబ్బురపడ నబ్బ సొమ్మా?
గతి గనవలె మంచిన్!గతుకౌ?నెగుడు క్రీందగున్!గబ్బగు భవి నెంచ రేమీ?
స్తుతి గను భవి కీర్తిన్!గత మాగత సు భూతవన్?కబ్బముల సు కీర్తి నందన్!
పతితపు తల పేలన్?పతనంబు తగ దేరికిన్?పబ్బము గడుపంగ నౌనే?

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత;"ఉత్కృతి ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు"9,18,అక్షరము లకు చెల్లును,

1,గర్భగత"-గతిగను"-వృత్తము,

అతులిత మతి నంచున్!
గతి గనవలె మంచిన్!
స్తుతి గను భవి కీర్తిన్!
పతితపు తల పేలన్?

అభిజ్ఞా ఛందము నందలి"అను ష్టుప్"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పపాదమునకు"8"అక్షరము లుండును,

2,గర్భగత"'అబ్బురపడు"'వృత్తము,

హత మేర్చి గత ప్రగతిన్!
గతుకౌ?నెగుడు క్రిందగున్!
గత మాగత సుభూతవన్?
పతనంబు తగ దేరికిన్?

అభిజ్ఞా ఛందము నందలి "బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

3,గర్భగత"కబ్బము"వృత్తము,

అబ్బురపడ నబ్బ సొమ్మా?
గబ్బగు భవి నెంచ రేమీ?
కబ్బముల సు కీర్తి నందన్!
పబ్బము గడు పంగ నౌనే?

అభిజ్ఞా ఛందము నందలి"'బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును, 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.