గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, జనవరి 2024, ఆదివారం

తరులు,గిరులు,విరులు,కరటుతన,నిర్విచార,మోసచింత,బిగియు,గగుర్పాటు,తగుత,దోషాత్మ,దోషభూష,ఆత్మదోష,దోషకర్మ,అధర్మ,గర్భ"-రక్త సిక్తతా"-వృత్తము. వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్. 

తరులు,గిరులు,విరులు,కరటుతన,నిర్విచార,మోసచింత,బిగియు,గగుర్పాటు,తగుత,దోషాత్మ,దోషభూష,ఆత్మదోష,దోషకర్మ,అధర్మ,గర్భ"-రక్త సిక్తతా"-వృత్తము.  వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.   జుత్తాడ.

తరులు గిరులు విరులే!ధర్మ సాక్ష్య మాయె మాతకున్!తగుత రాము నేలికన్!

కరటు జనుల కలిలోన్!కర్మ దోష భూష లాత్మలై!గగురు పాటు నేడయెన్!
తర తమములు గనకన్!ధర్మ మేడ కేగెనో?యనన్!తగిలి మోస చింతనన్!
వెర పెడమయె జగతిన్!పేర్మి హాని క్రీడ నేడయెన్!బిగిసె రక్త సిక్త మై!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"-
ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు,26,అక్రరము
లుండును.యతులు"10,19,అక్షరములకు చెల్లును.

1,గర్భగత"-తరులు"-వృత్తము.

తరులు గిరులు విరులే!
కరటు జనుల కలిలోన్!
తర తమములు గనకన్!
వెర పెడమయె జగతిన్!

అభిజ్ఞా ఛందమునందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

2,గర్భగత"-గిరులు"-వృత్తము.

ధర్మ సాక్ష్య మాయె మాతకున్!
కర్మ దోష భూష లాత్మలై!
ధర్మ మేడ కేగెనో?యనన్!
పేర్మి హాని క్రీడ నే డయెన్!

అభిజ్ఞా ఛందము నందలి బృహతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

3,గర్భగత"విరులు"-వృత్తము.

తగుత రాము నేలికన్!
గగురు పాటు నే డయెన్!
తగిలి మోస చింతనన్!
బిగిసె రక్త సిక్తమై!

అభిజ్ఞా ఛందము నందలి"-అనుష్టుప్"-ఛందము నందలిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "8"అక్షరములుండును.

4,గర్భగత"-కరటుతన"-వృత్తము.

గిరులు తరులు విరులే!ధర్మ సాక్ష్య మాయె మాతకున్!
కరటు జనుల కలిలోన్!కర్మ దోష భూష లాత్మలై!
తర తమములు గనకన్!ధర్మ మేడ కేగెనో?యనన్!
వెర పెడమయె జగతిన్!పేర్మి హాని క్రీడ నే డయెన్!

అణిమా,ఛందమునందలి"ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-నిర్విచార"-వృత్తము.

ధర్మ సాక్ష్య మాయె మాతకున్!గిరులు తరులు విరులే!
కర్మ దోష భూష లాత్మలై!కరటు జనుల కలిలోన్!
ధర్మ మేడ కేగెనో?యనన్!తర తమములు గనకన్!
పేర్మి హాని క్రీడ నేడయెన్!వెర పెడ మయె జగతిన్!

అణిమా ఛందమునందలి"ధృతి"-ఛందము లోనిది
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-మోసచింత"-వృత్తము.

తరులు గిరులు విరులే!తగుత రాము నేలికన్!
కరటు జనుల కలిలోన్!గగురు పాటు నేడయెన్!
తర తమములు గనకన్!తగిలి మోస చింతనన్!
వెర పెడమయె జగతిన్!బిగిసె రక్త సిక్తమై!

అణిమా ఛందమునందలి"అత్యష్టి"ఛదము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"-17"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరము నకు చెల్లును.

7,గర్భగత"-బిగియు"-వృత్తము.

తగుత రాము నేలికన్!తరులు గిరులు విరులే!
గగురు పాటు నేడయెన్!కరటు జనుల కలిలోన్!
తగిలి మోస చింతనన్!తర తమములు గనకన్!
బిగిసె రక్త సిక్తమై!వెర పెడమయె జగతిన్!

అణిమా ఛందమునందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-గగుర్పాటు"-వృత్తము.

ధర్మ సాక్ష్య మాయె మాతకున్!తగుత రాము నేలికన్!
కర్మ దోష భూష లాత్మలై!గగురు పాటు నేడయెన్!
ధర్మ మేడ కేగెనో?యనన్!తగిలి మోస చింత నన్!
పేర్మి హాని క్రీడ నే డయెన్!బిగిసె రక్త సిక్తమై!

అణిమాఛందము నందలి అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరము నకు చెల్లును.

9,గర్భగత"-తగుత"-వృత్తము.

తగుత రాము నేలికన్!ధర్మ సాక్ష్య మారె మాతకున్!
గగురు పాటు నే డయెన్!కర్మ రోష భూష లాత్మలై!
తగిలి మోస చింత నన్!ధర్మ మేడ కేగెనో?యనన్!
బిగిసె రక్త సిక్తమై!పేర్మి హాని క్రీడ నే డయెన్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-దోషాత్మ"వృత్తము.

ధర్మ సాక్ష్య మాయె మాతకున్!తరులు గిరులు విరులే!తగుత రాము నేలికన్!
కర్మ దోష భూష లాత్మలై!కరటు జనుల కలిలోన్! గగురు పాటు నేడయెన్!
ధర్మ మేడ కేగెనో?యనన్!తర తమములు గనకన్!తగిలి మోస చింతనన్!
పేర్మి హాని క్రీడ నే డయెన్!వెర పెడమయె!జగతిన్!బిగిసె రక్త సిక్తమై!

అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "26 "అక్షరము లుండును.
యతులు,10,19,అక్షరములకు చెల్లును.

11,గర్భగత"-దోష భూష"-వృత్తము.

తరులు గిరులు విరులే!తగుత రాము నేలికన్!ధర్మ సాక్ష్య మాయె మాతకున్!
కరటు జనుల కలిలోన్!గగురుఫాటు నే డయెన్!కర్మ దోష భూష లాత్మలై!
తర తమములు గనకన్!తగిలి మోస చింతనన్!ధర్మ మేడ కేగెనో?యనన్!
వెర పెడమయె జగతిన్!బిగిసె రక్త సిక్తమై!పేర్మి హాని క్రీడ నేడయెన్!

అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,18,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-ఆత్మదోష"-వృత్తము.

తగుత రాము నేలికన్!తరులు గిరులు విరులే!ధర్మ సాక్ష్య మాయె మాతకున్!
గగురు పాటు నే డయెన్!కరటు జనుల కలి లోన్!కర్మ దోష భూష లాత్మలై!
తగిలి మోస చింతనన్!తర తమములు గనకన్!ధర్మ మేడకేగెనో?యనన్!
బిగిసె రక్త సిక్త మై!వెర పెడమయె జగతిన్!పేర్మి హాని క్రీడ నే డయెన్!

అనిరుద్ఛందమునందలి,ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు26,అక్షరము లుండును.
యతులు,9,18,అక్షరములకు చెల్లును.

13,గర్భగత"-దోషకర్మ"వృత్తము.

ధర్మ సాక్ష్య మాయె మాతకున్!తగుత రాము నేలికన్!తరులు గిరులు విరులే!
కర్మ దోష భూష లాత్మలై!గగురు పాటు నేడయెన్!కరటు జనుల కలిలోన్!
ధర్మ మేడ కేగెనో?యనన్!తగిలి మోస చింతనన్!తర తమములు గనకన్!
పేర్మి హాని క్రీడ నేడయెన్!బిగిసె రక్త సిక్తమై! వెర పెడమయె జగతిన్!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు "26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.

14,గర్భగత"-"అధర్మ"వృత్తము.

తగుత రాము నేలికన్!ధర్మ సాక్ష్య మాయె మాతకున్!తరులు గిరులు విరులే!
గగురు పాటు నే డయెన్!కర్మ దోష భూష లాత్మలై!కరటు జనుల కలి లోన్!
తగిలి మోస చింతనన్!ధర్మ మేడ కేగెనో?యవవ్!తర తమములు గనకన్!
బిగిసె రక్త సిక్తమై!పేర్మి హాని క్రీడ నే డయెన్!వెర పెడమయె జగతిన్!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
పూరాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు.9,18,అక్షరములకు చెల్లును.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.