గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జనవరి 2024, శుక్రవారం

మొదలు చెడు,వెరపు కాని,తెరవు లేని,లోకతీరు,పూజితాలు,జవతాశ్రిహేయజన్మ,సుజనాళి,వెరగారు,పొరపొక్కాలు,పేరుటాశ,తీరుమారు,ధీరమేర్చు,ధీరంబ,గర్భ"-సార ధీర"-వృత్తము.

జైశ్రీరామ్.   

మొదలు చెడు,వెరపు కాని,తెరవు లేని,లోకతీరు,పూజితాలు,జవతాశ్రిహేయజన్మ,సుజనాళి,వెరగారు,పొరపొక్కాలు,పేరుటాశ,తీరుమారు,ధీరమేర్చు,ధీరంబ,గర్భ"-సార ధీర"-వృత్తము

                             రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                                         జుత్తాడ.

పురిటిలోన సంధి బలెన్!పూజితాలు చెడె నెంచగన్!పొరులాడంగ ధాత్రనిన్!
వెరపు లేని చింత వలెన్!వే జరాశ్రి వెరగొందె లే!పేరుటా శాశ్రి తంబయెన్!
తెరవు లేని బోధ గతిన్!తేజహీన బ్రతు కాయెనే!తీరు మారే దదెప్పుడో?
సరగె లోకతీరు హరా!సౌ జనాళి వెర గారునే!సార ధీరంబు గూర్చుమా!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత,ఉత్కృతి"
ఛందము లోనిది.ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము
లుండును.యతులు"10,19,అక్షరము లకు చెల్లును.

1,గర్భగత"-మొదలు చెడు"-వృత్తము.

పురిటి లోన సంధి బలెన్!
వెరపు లేని చింత వలెన్!
తెరవు లేని బోధ గతిన్!
సరగె లోకతీరు హరా!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9,అక్షరములుండును.

2,గర్భగత"వెరపు లేని"-వృత్తము.

పూజితాలు చెడె నెంచగన్!
వే జరాశ్రి వెర గొందె లే!
తేజహీన బ్రతు కాయెనే!
సౌ జనాళి వెర గారునే!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9,అక్షరము లుండును.

3,గర్భగత"-తెరవు లేని"-వృత్తము.

పొరు లాడంగ ధాత్రినిన్!
పేరు టాశా శ్రితం బయెన్!
తీరు మారే ద దెప్పుడో?
సారధరంబు గూర్చుమా!

అభిజ్ఞా ఛందము నందలిఅనుష్టుప్ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

4,గర్భగత"లోకతీరు"-వృత్తము.

పురిటి లోన సంధి బలెన్!పూజితాలు చెడె నెంచగన్!
వెరపు లేని చింత వలెన్!వే జరాశ్రి వెర గొందె లే!
తెరవు లేని బోధ గతిన్!తేజ హీన బ్రతు కాయెనే!
సరగె లోక తీరు హరా!సౌ జనాళి వెర గారునే!

అణిమా ఛందము నందలి"ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

5,గర్భ గత"-పూజితాలు"-వృత్తము.

పూజితాలు చెడె నెంచగన్!పురిటి లోన సంధి బలెన్!
వే జరాశ్రి వెర గొందె లే!వెరపు లేని చింత వలెన్!
తేజ హీన బ్రతు కాయెనే!తెరవు లేని బోధ గతిన్!
సౌ జనాళి వెర గారునే!సరగె లోక తీరు హరా!

అణిమా"ఛందము నంద లి"-ధృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18,అక్షరము లుండును.
యతి"10,వ యక్షరము నకు చెల్లును.

6,గర్భగత"-జవతాశ్రి"-వృత్తము.

పురిటి లోన సంధి బలెన్!పోరు లాడంగ ధాత్రినిన్!
వెరపు లేని చింత వలెన్!పేరు టాశ్రి తంబయెన్!
తెరవు లేని బోధ గతిన్!తీరు మారే దదెప్పుడో?
సరగె లోకతీరు హరా! సార ధీరంబు గూర్చుమా!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛదము లోనిది.
పాదమునకు"17"అక్షరము లుండును.ప్రాసనియమము కలదు.
యతు"10"వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-హేయ జన్మ"-వృత్తము.

పోరు లాడంగధాత్రినిన్!పురిటి లోన సంధి బలెన్!
పేరు టాశ్రితం బయెన్!వెరపు లేనని చింత వ లెన్!
తీరు మారే దదెప్పుడో?తెరవు లేని బోధ గతిన్!
సార ధీరంబు గూరర్చుమా!సరగె లోకతీరు హరా!

అణిమా  ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోఓనిది.
ప్రాసనియమము కలదు.పాదముశనకు"17"అక్షరము లుండును.
యతి"9"వ యక్షరమునక  చెల్లును.

8,గర్భగత"-సుజనాళి" వృఐఅఐము.

పూజితాలు చెడె నెంచగన్!పోరు లాడంగ ధాత్రినిన్!
వే జరాశ్రి  వెరగొందె లే!పేరు టాశా శ్రితం బయెన్!
తేజ హీన బ్రతు కాయెనే!తీరు మారే ద దెప్పుడో?
సౌజనాళి వెర గారునే!సార ధీరంబు గూర్చుమా!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-వెరగారు"వృత్తము.

పోరు లాడంగ ధాత్తినిన్! పూజితాలు చెడె నెంచగన్!
పేరు టాశాశ్రి తంబయెన్!వే జరాశ్రి వెరగొందె లే!
తీరు మారే ద దెప్పుడో?తేజ హీన బ్రతు కాయెనే!
సార ధీరంబు గూర్చుమా!సౌ జనాళి వెర గారునే!

అణిమా ఛందము నందలి"అత్యష్టి "ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
తతి9,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-పొర పొక్కాలు"-వృత్తము.

పూజితాలు చెడె నెంచగన్!పురిటి లోన సంధి బలెన్!పోరులాడంగ ధాత్రినిన్
వే జరాశ్రి వెర గొందె లే!వెరపు లేని చింత వలెన్!పేరు టాశ్రి తం బయెన్!
తేజ హీన బ్రతుకాయెనే!తెరవు లేని బోధ గతిన్!తీరు మారే ద దెప్పుడో?
సౌజనాళి వెరగారునే!సరగె లోక తీరు హరా!సార ధీరంబు గూర్చుమా!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి "ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు26"అక్షరము లుండును.
యతులు"10,19,అక్షరములకు చెల్లును.

11,గర్భగత"-పేరుటాశ"-వృత్తము.

పురిటి లోనసంధిబలెన్!పోరు లాడంగ ధాత్రి నిన్!పూజితాలు చెడె నెంచగన్!
వెరపు లేని చింత వలెన్!పేరు టాశ్రితం బయెన్!వే జరాశ్రి వెర గొందె లే!
తెరవు లేని బోధ గతిన్!తీరు మారే ద దెప్పుడో?తేజ హీన బ్రతు కాయెనే!
సరగె లోక తీరు హరా!సార ధీరంబు గూర్చుమా!సౌ జనాళి వెర గారునే!

అనిరుద్ఛందమునందలిఉత్కృతి ఛందము లోనిది
ప్రాసనియమము కలదు.పాదమునకు26"అక్షరములుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-తీరు మార"-వృత్తము.

పోరు లాడంగ ధాత్రినిన్!పురిటి లోన సంధి బలెన్!పూజితాలు చెడె నెంచగన్
పేరు టాశ్రితంబయెన్!వెరపు లేని చింత వలెన్!వే జరాశ్రి వెరగొందె లే
తీరు మారే ద దెప్పుడో?తెరవు లేని బోధ గతిన్!తేజహీన బ్రతుకాయెనే!
సార ధీరంబు గూర్చుమా!సరగె లోకతీరు హరా!సౌజనాళి వెరగారునే!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు26,అక్షరము  లుండును.
యతులు"9,18,అక్షరములకు చెల్లును.

13,గర్భగత"-ధీరమేర్చు"-వృత్తము.

పూజితాలు చెడె నెంచగన్!పోరు లాడంగ ధాత్రినిన్!పురిటిలోన సంధి బలెన్!
వే జరాశ్రి వెరగొందె లే!పేరు టాశ్రితం బయెన్!వెరపు లేని చింత వలెన్!
తేజహీన బ్రతు కాయెనే!తీరు మారె ద దెప్పుడో?తెరవు లేని బోధ గతిన్!
సౌ జనాళి వెర గారునే!సార ధీరంబు గూర్చుమా!సరగె లోక తీరు హరా!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు,10,18,అక్షరము లకు చెల్లును.

14,గర్భగత"-ధీరంబ"-వృత్తము.

పోరు లాడంగ ధాత్రి నిన్!పూజితాలు చెడె నెంచగన్!పురిటి లోన సంధి బలెన్
పేరు టాశ్రితం బయెన్!వే జరాశ్రి వెరగొందె లే!వెరపు లేని చింతవలెన్!
తీరు మారె ద దెప్పుడో!తేజహీన బ్రతు కాయెనే! తెరవు లేని బోధ గతిన్!
సార ధీరంబు గూర్చుమా!సౌ జనాళి వెర గారునే!సరగె లోకతీరు హరా!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"9,18,అక్షరములకు చెల్లును.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.