గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, జనవరి 2024, మంగళవారం

అనుభవ,గద్దె వెలుగు,సుద్దులు,సున్నిత,పెన్నిధి,వన్నె గూర్చు,పెడార్ధ,జీవన సుఖ,వెలుగు,గడి కుదురు,కుదు రేర్చు,సుడి విడు,బడాయి,భోగ్యము,గర్భ, "-అనుభ వజ్ఞతా"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్. 

పెద్దలు అనుభ వజ్ఞులు!పెన్నిధు లాడు మాటలున్!పెడార్ధముతీయ హానియౌ!

గద్దెల వెలుగ పూజ్యము!కన్నెర గాక శోభిలన్!గడిం కుదు రేర్చు నెంచుమా!
సుద్దులు విని చరించుము!సున్నిత జీవనాశ్రియౌ!సుద్దులు విడ సౌఖ్య
                                                                                           జీవమౌ!
వద్దు గురుజన దూషణ!వన్నెను గూర్చు నాగతమ్!బడాయిని వీడ భోగ్యమౌ!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి"అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"
ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.యతులు"10,18,అక్షరములకు చెల్లును.

1,గర్భగత"-అనుభవ"-వృత్తము.

పెద్దలు అనుభ వజ్ఞులు!
గద్దెల వెలుగ పూజ్యము!
సుద్దులు విని చరించుము!
వద్దు గురు జన దూషణ!

అభిజ్ఞా"ఛందము నందలి"బృహతి"-ఛందము"- లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

2,గర్భగత"-గద్దె వెలుగు"-వృత్తము.

పెన్నిధు లాడు మాటలున్!
కన్నెర గాక శోభిలున్!
సున్నిత జీవనాశ్రియౌ!
వన్నెను గూర్చు నాగతమ్!

అభిజ్ఞా ఛందమునందలె"అనుష్టుప్ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"8,అక్షరము లుండును.

3,గర్భగత"-సుద్దులు"-వృత్తము.

పెడార్ధము తీయ హానియౌ!
గడిం కుదు రేర్చు నెంచుమా!
సుడుల్విడి  సౌఖ్య జీవమౌ!
బడాయిని వీడ భోగ్యమౌ!

అభిజ్ఞా ఛందమునందలె"-బృహతి"-ఛందములోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

4,గర్భగత"-సున్నిత"వృత్తము.

పెద్దలు అనుభ వజ్ఞులు!పెన్నిధు లాడు మాటలున్!
గద్దెల వెలుగ పూజ్యము!కన్నెర గాక శోభిలున్!
సుద్దులు విని చరించుము!సున్నిత జీవనాశ్రియౌ!
వద్దు గురు జన దూషణ!వన్నెను గూర్చు నాగతమ్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

5,గర్భగత"-పెన్నిధి"-వృత్తము

పెన్నిధు లాడు మాటలున్!పెద్దలు అనుభ వజ్ఞులు!
కన్నెర గాక శోభిలున్!గద్దెల వెలుగ పూజ్యము!
సున్నిత జీవనాశ్రియౌ!సుద్దులు విని చరించుము!
వన్నెను గూర్చు నాగతమ్!వద్దు గురుజన దూషణ!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు17,అక్షరము లుండును.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-వన్నె గూర్చు"-వృత్తము.

పెన్నిధు లాడు మాటలున్!పెడార్ధము తీయ హానియౌ!
కన్నెర గాక శోభిలున్!గడిం కుదు రేర్చు నెంచుమా!
సున్నిత జీవనాశ్రియౌ!సుడుల్విడి సౌఖ్య జీవమౌ!
వన్నెను గూర్చు నాగతమ్!బడాయిని వీడ భోగ్యమౌ!

అణిమా ఛందము నందలి అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి,9,వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"పెడార్ధ"-వృత్తము.

పెడార్ధము తీయ హానియౌ!పెన్నిధు లాడు మాటలున్!
గడిం కుదు రేర్చ నెంచుమా!కన్నెర గాక శోభిలున్!
సుడుల్విడి సౌఖ్య జీవమౌ!సున్నిత జీవవాశ్రియౌ!
బడాయిని వీడ భోగ్యమౌ!వన్నెను గూర్చు నాగతమ్!

అణిమా"ఛందమునందలి"అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.

8,గర్భగత"-జీవన సుఖ"-వృత్తము.

పెద్దలు అనుభ వజ్ఞులు!పెడార్ధము తీయ హానియౌ!
గద్దెల వెలుగు పూజ్యము!గడిం కుదు రేర్చ నెంచుమా!
సుద్దులు విని చరిచుము!సుడుల్విడి సౌఖ్య జీవమౌ!
వద్దు గురుజన దూషణ!బడాయిని వీడ భోగ్యమౌ!

అణిమా ఛందము నందలి"ధృతి"-ఛందము లోనిదె.
ప్రాసనియమము కలదు.పాదమునకు18,అక్షరము లుండును.
యతి10,వ యక్షరమునకు చెల్లును.

9,గర్భగత"-వెలుగు"-వృత్తము.

పెడార్ధము తీయ హానియౌ!పెద్దలు అనుభ వజ్ఞులు!
గడిం కుదురేర్చ నెంచుమా!గద్దెల వెలుగు పూజ్యము!
సుడుల్విడి సౌఖ్య జీవమౌ!సుద్దుల్విని చరించుము!
బడాయిని వీడ భోగ్యమౌ!వద్దు గురుజన దూషణ!

అణిమా ఛందము నందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18,అక్షరము లుండును.
యతి,10,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-గడి కుదురు"-వృత్తము.

పెన్నిధులాడుమాటలున్!పెద్దలుఅనుభవజ్ఞులు!పెడార్ధముతీయ హానియౌ!
కన్నెరగాక శోభిలున్!గద్దెల వెలుగ పూజ్యము!గడిం కుదు రేర్చు నెంచుమా!
మన్నిత జీవ నాశ్రియౌ!సుద్దులు విని చరించుము!సుడు ల్విడు సౌఖ్య
                                                                                          జీవమౌ!
వన్నెను గూర్చు నాగతమ్!వద్దు గురుజన దూషణ!బడాయిని వీడ భోగ్యమౌ!

అనిరుద్ఛందమునందలి ఉత్కృతి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"9,18,అక్షరములకుచెల్లును.

11,గర్భగత"-కుదురేర్చు"-వృత్తము.

పెన్నిధులాడు మాటలుం!పెడార్ధముతీయ హానియౌ!పెద్దలు అనుభవజ్ఞులు!
కన్నెర గాక శోభిలుం!గడింకుదు రేర్చు నెంచుమా!గద్దెల వెలుగ పూజ్యము!
మన్నిత జీవనాశ్రియౌ!సుడు ల్విడు సౌఖ్య జేవమౌ!సుద్దులు విని
                                                                                   చరించుము!
వన్నెను గూర్చు నాగతం!బడాయిని వీడ భోగ్యమౌ!వద్దు గురుజన దూషణ!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 26"అక్షరము లుండును.
యతులు."9,18,అక్షరములకు చెల్లును.

12,గర్భగత"-సుడివిడు"-వృత్తము.

పెడార్ధము తీయ హానియౌ!పెన్నిధు లాడు మాటలున్!పెద్దలు అనుభవజ్ఞులు!
గడింకుదు రేర్చు నెంచుమా!కన్నెరగాక శోభిలున్!గద్దెల వెలుగ పూజ్యము!
సుడు ల్విడు సౌఖ్యజీవమౌ!సున్నిత జీవ నాశ్రియౌ! సుద్దులు విని
                                                                                చరించుము!
బడాయినివీడ భోగ్యమౌ!వన్నెనుగూర్చు నాగతమ్!వద్దు గురుజన దూషణ!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.యతులు
10,18,అక్షరములకు చెల్లును.

13,గర్భగత"బడాయి"-వృత్తము.

పెద్దలు అనుభవజ్ఞులు!పెడార్ధము తీయ హానియౌ!పెన్నిధులాడు మాటలున్!
గద్దెల వెలుగ పూజ్యము!గడిం కుదురేర్చు నెంచుమా!కన్నెరగాక శోభిలున్!
సుద్దులు విని చరించుము!సుడుల్విడు సౌఖ్య జీవమౌ!సున్నిత            
                                                                                  జీవనాశ్రియౌ!
వద్దు గురుజన దూషణ!బడాయిని వీడ భోగ్యమౌ!వన్నెను గూర్చు నాగతమ్!

అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పామునకు"26"అక్షరము లుండును.
యతులు 10,19,అక్షరములకు చెల్లును.

14,గర్భగత"-భోగ్యము"-వృత్తము.

పెడార్ధము తీయ హానియౌ!పెద్దలు అనుభవజ్ఞులు!పెన్నిధు లాడు మాటలున్!
గడిం కుదురేర్చు నెంచుమా!గద్దెల వెలుగు పూజ్యము!కన్నెర గాక శోభిలున్!
సుడుల్విడు సౌఖ్యజీవమౌ! సుద్దులు విని చరించుము!సున్నిత
                                                                                     జీవనాశ్రియౌ!
బడాయిని వీడ భోగ్యమౌ!వద్దు గురుజన దూషణ!వన్నెను గూర్చు నాగతమ్!

అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,19,అక్షరములకు చెల్లును.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.