గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, జనవరి 2024, మంగళవారం

నీతివిడు,భూత దయ,వరాంగ,తలపోయు,నెల తాలుపు,దాతయ,చరించు,సెల తాలుపు,దాతయ,చరించు,సెగలెగయు,విడ నాడ,నిగమము,పొగకు,తగు చర్య,భూతలి,వరదమ,గర్భ"-పులుమేయు"- వృత్తము. రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్. 

నీతిని విడనాడకుమా!నిగమము మీరకుమా!నెలతాలుపు భక్తి యందున్!

భూతదయ వరాంగుడవై!పొగరును వీడుమయా!పులుమేయకు గొడ్డు 
                                                                                         భంగిన్! 
దాతగ నిలు భూతలినిన్!తగను చరించు రసన్!తలపోయుము సామ్య
                                                                                       వాదమ్!
చేతన వరదంబవగన్!సెగలను లేపకుమా!శిలలం గల దైవ  మెంచుమ్!

సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి,అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"
ఛందములోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు26;అక్షరము లుండును.యతులు"10,18,అక్షరములకు చెల్లును.

1.గర్భగత"-నీతివిడు"-వృత్తము.

నీతిని విడనాడకుమా!
భూతదయ వరాంగుడవై!
దాతగ నిలు భూతలిన్!
చేతన వరదంబవగన్!

అభిజ్ఞా ఛందము నందలి"-బృహతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.

2,గర్భగత"-భూతదయ"-వృత్తము.

నిగమము మీరకుమా!
పొగరును వీడు మయా!
తగను చరించు రసన్!
సెగలను లేపకుమా!

అభిజ్ఞా ఛందమునందలి అనుష్టుప్ఛందము లోనిది.
ప్రాసనియమభు కలదు.పాదమునకు"8"అక్షరము లుండును.

3,గర్భగత"-వరాంగ" వృత్తము.

నెలతాలుపు భక్తి యందున్!
పులు మేయకు గొడ్డు భంగిన్!
తలపోయుమి సామ్య వాదమ్!
శిలలం గల దైవ మెంచుమ్

అభిజ్ఞా ఛందమునందలి"-బృహతి"-ఛంము లోనిది.
ప్రాసనియమభు కలదు.పాదమునకు"9"అక్షరము లుండును,

4,గర్భగత"-తలపోయు"-వృత్తము.

నీతిని విడ నాడకుమా!నిగమము మీరకుమా!
భూతదయ వరాంగుడవై!పొగరును వీడు మయా!
దాతగ నిలు భూతలినిన్!తగను చరించు రసన్!
చేతన వరదము లవగన్!సెగలను లేపకుమా!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు,17,అక్షరము లుండును.
యతి10,వ యక్షరమునకు చెల్లును..

5,గర్భగత"-నెలతాలుపు"-వృత్తము.

నిగమము మీరకుమా!నీతిని విడ నాడకుమా!
పొగరును వీడు మయా!భూత థయ వరాంగుడవై!
తగను చరించు రసన్!దాతగ నిలు భూతలినిన్!
సెగలను లేపకుమా!చేతన వరదము లవగన్!

అణిమా"ఛందమునందలి"అనుష్టుప్ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరములుండును.
యతి"9,వ యక్షరమునకు చెల్లును.

6,గర్భగత"-దాతయ"-వృత్తము.

నీతిని విడ నాడకుమా!నెలతాలుపు భక్తి యందున్!
భూత దయ వరాంగుడవై!పులు మేయకు గొడ్డు భంగిన్!
దాతగ నిలు భూతలినిన్!తలపోయుము సామ్య వాదమ్!
చేతన వరదం బవగన్!శిలలం గల దైవ మెంచుమ్!

అణిమా ఛందము నందలి "ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 18,అక్షరము లుండును.
యతి"10"వ యక్షరమునకు చెల్లును.

7,గర్భగత"-చరించు"-వృత్తము.

నెల తాలుపు భక్తి యందున్!నీతిని విడ నాడకుమా!
పులు మేయకు గొడ్డు భంగిన్!భూత దయ వాంగుడవై!
తలపోయుము సామ్య వాదమ్!దాతగ నిలు భూతలినిన్!
శిలలంగల దైవ మెంచుమ్!చేతన వరదంబ వగన్!

అణిమా ఛందమునందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"18"అక్షరములుండును.
యతి""10,వ యక్షరమునకు చెల్లును

8,గర్భగత"-సెగలెగయు"-వృత్తము.

నిగమము మీరకుమా!నెలతాలుపు భక్తి యందున్!
పొగరును వీడు మయా!పులు మేయకు గొడ్డు భంగిన్!
తగను చరించు రసన్!తలపోయుము సామ్య వాదమ్!
సెగలను లేపకుమా!శిల లంగల దైవ మెంచు మ్!

అణిమా ఛందము నందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17,అక్షరము లుండును.
యతి,"9"వ యక్షరము నకు చెల్లును.

9,గర్భగత"-విడనాడు"-వృత్తము.

నెలతాలుపు భక్తి యందున్!నిగమము మీరకుమా!
పులు మేయకు గొడ్డు భంగిన్!పొగరును వీడు మయా!
తల పోయుమి సామ్య వాదమ్!తగను చరించు రసన్!
శిల లంగల దైవ మెంచుమ్!సెగలం లేపకుమా!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17,అక్షరము లుండును.
యతి"-10,వ యక్షరమునకు చెల్లును.

10,గర్భగత"-నిగమము"-వృత్తము.

నిగమము మీరకుమా!నీతిని విడ నాడకుమా!నెల తాలుపు భక్తి యందున్!
పొగరును వీడు మయా!భూతదయ వరాంగుడవై!పులు మేయకు గొడ్డు
                                                                                       భంగిన్!
తగనుచరించు రసన్!దాతగ నిలు భూతలినిన్!తలపోయుము సామ్య
                                                                                  వాదమ్!
సెగలను లేపకుమా!చేతన వరదంబవగన్!శిలలం గల దైవ మెంచుమ్!

అనిరుదాఛందమునందలి"ఉత్కృతి "ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"9,18,అక్షరములకు చెల్లును.

111,.గర్భగత"పొగరు,వృత్తము.

నీతిని విడనాడకుమా!నెలతాలుపు భక్తియందున్!నిగమము మీరకుమా!
భూతదయ వరాంగుడవై!పులు మేయకు గొడ్డు భంగిన్!పొగరును వీడు
                                                                                  మయా!
దాతగ నిలు భూ తలినిన్!తలపోయుము సామ్య వాదమ్!తగను చరించు
                                                                                      రసన్!
చేతన వరదంబవగన్!శిలలంగల దైవమెంచుమ్!సెగలను లేపకుమా!!

అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు 10,19,అక్షరములకు చెల్లును.

12.గర్భగత"తగు చర్య"వృత్తము.

నెలతాలుపు భక్తియందున్!నీతిని విడనాడకుమా!నిగమము మీరకుమా!
పులు మేయకు గొడ్డు భంగిన్!భూత దయ వరాంగుడవై!పొగరును వీడు
                                                                                     మయా!
తలపోయుము సామ్యవాదమ్!దాతగ నిలు భూతలినిన్!తగను చరించు
                                                                                        రసన్!
శిల లంగల దైవమెంచుమ్!చేతన వరదంబవగన్!సెగలను లేప కుమా!

అనిరుద్ఛందమునందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు.10,19,అక్షరములకు చెల్లును.

13,గర్భగత"-భూతలి" వృత్తము.

నిగమము మీరకుమా!నెలతాలుపు భక్తి యందున్!నీతిని విడనాడకుమా!
పొగరును వీడు మయా!పులు మేయకు గొడ్డు భంగిన్!భూత దయ వరాంగు
                                                                                               డవై!
తగను చరించు రసన్!తలపోయుమి సామ్య వాదమ్!దాతగ నిలు భూ
                                                                                       తలినిన్!సెగలను లేపకుమా!శిలలం గల దైవ మెంచుమ్!చేతన వరదం బవగన్!

అనిరుద్ఛందము నందలి "ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"9,18,అక్షరములకు చెల్లును

14,గర్భగత"-వరదమ"-వృత్తము.

నెలతాలుపు భక్తి యందున్!నిగమము మీరకుమా!నీతిని విడనాడకుమా!
పులు మేయకు గొడ్డు భంగిన్!పొగరును వీడు మయా!.భూత దయ వరాంగు
                                                                                               డవై!
తలపోయుమి సామ్య వాదమ్!దాతగ నిలు భూతలినిన్!తగను చరించు
                                                                                          రసవ్!
శిలలం గల దైవ మెంచుమ్!చేతన వరదం బవగన్! సెగలను లేపకుమా!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు26"అక్షరములుండును.
యతులు,10,18,అక్షరములకు చెల్లును. 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.