గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, జులై 2022, సోమవారం

న చ మాం తాని కర్మాణి ..|| 9-9 || . మయాధ్యక్షేణ ప్రకృతిః .. || 9-10 ||..//.. నవమోధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

 జైశ్రీరామ్.

 || 9-9 ||

శ్లో.  న చ మాం తాని కర్మాణి నిబధ్నన్తి ధనఞ్జయ|

ఉదాసీనవదాసీన మసక్తం తేషు కర్మసు.

తే.గీ.  పార్థ! కర్మలుంచవునన్ను బంధనమున,

కర్మలందు నిరాసక్తి కారణమున

నుందు నే నుదాసీనతనంది, నిజము,

కర్మబంధుడకానట్టి కారణమున.

భావము.

ఓ ధనంజయా! ఆ కర్మలు నన్ను భంధించవు. ఆ కర్మలలో ఆసక్తి లేక 

నేను ఉదాసీనంగా ఉంటాను.

 || 9-10 ||

శ్లో.  మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్|

హేతునానేన కౌన్తేయ జగద్విపరివర్తతే.

తే.గీ. ప్రకృతి సృష్టించును చరాచరములు, నాదు

ఘనత రాధ్యక్షతన్ దీని కారణమున,

మరలమరలప్రవర్తించు మహిత సృష్టి,

నిజము గ్రహియింపు మో పార్థ! నిరుపమగుణ!

భావము.

నా అధ్యక్షతన ప్రకృతి చరాచర ప్రపంచాన్ని సృజిస్తుంది. ఆ కారణం 

చేతనే జగత్తు తిరిగి తిరిగి ప్రవర్తిస్తుంది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.