గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జులై 2022, శుక్రవారం

క్షిప్రం భవతి ధర్మాత్మా ..|| 9-31 || మాం హి పార్థ వ్యపాశ్రిత్యరో . || 9-32 ||..//.. నవమోధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

 జైశ్రీరామ్

 || 9-31 ||

శ్లో.  క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాన్తిం నిగచ్ఛతి|

కౌన్తేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి.

తే.గీ.  అతడు ధర్మాత్ముడై శాశ్వతాత్మనెరిగా

శాశ్వతమ్ముగ పొందును శాంతి యతడు,

నాదు భక్తుండు నశియింపరాదు, నీవె

యీ ప్రతిజ్ఞను చేయుమో సుప్రకాశ!

భావము.

అర్జునా అతడు త్వరలోనే ధర్మాత్ముడై, శాశ్వతమైన శాంతిని 

పొందుతాడు. నాభక్తుడు నశించడని ప్రతిజ్ఞ చెయ్యి.

|| 9-32 ||

శ్లో.  మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేऽపి స్యుః పాపయోనయః|

స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేపి యాన్తి పరాం గతిమ్.

తే.గీ. పాప యోనులున్, శూద్రులున్ వైశ్యులైన

స్త్రీలె యైనను భక్తితో సేవ నాకు

చేసి, యాశ్రయించిన, వారు భాసిలుదురు

భవ్యమైనట్టి గతిపొంది, పార్థ, నిజము.

భావము.

అర్జునా! నన్ను ఆశ్రయించిన వాళ్ళు పాప యోనులు కానీ, స్త్రీలు, 

వైస్యులు, శూద్రులు కానీ వాళ్ళుకూడా ఉత్తమగతిని తప్పక 

పొందుతారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.