గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జులై 2022, మంగళవారం

యాన్తి దేవవ్రతా దేవా ..|| 9-25 || .పత్రం పుష్పం ఫలం తోయం . || 9-26 ||..//.. నవమోధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

 జైశ్రీరామ్.

 || 9-25 ||

శ్లో.  యాన్తి దేవవ్రతా దేవాన్పితౄన్యాన్తి పితృవ్రతాః|

భూతాని యాన్తి భూతేజ్యా యాన్తి మద్యాజినోऽపి మామ్.

తే.గీ.  దేవతల గొల్వ చేరనౌ దేవతలను,

పితరంలన్ గొల్వ చేరనౌ పితరుల నిక

భూతముల్ గొల్వ జేరనౌ భూతములను,

నన్నుఁ  గొల్చిన చేరనౌ నన్నె పార్థ!

భావము.

దేవతలను ఆరాధించే వాళ్ళు దేతలను, పితరులను ఆరాధించే 

వాళ్ళు పితరులను, భూతాలను ఆరాధించేవాళ్ళు భూతాలనూ, 

నన్ను ఆరాధించే వాళ్ళు నన్నే చేరుకుంటారు.

|| 9-26 ||

శ్లో.  పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి|

తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః.

తే.గీ. భక్తి నొసగిన పుష్పంబొ ఫలమొ జలమొ,

ఆకొ గైకొందునర్జునా! శ్రీకరముగ,

నేను, భక్తిభావంబెంచి నియతితోడ,

భక్తి లేనట్టివారిచ్చు ఫలమదేల?

భావము.

ఏవరు భక్తితో ఆకునో, పువ్వునో, ఫలాన్నో, నీటినో నాకు సమర్పిస్తారో 

ఆ శ్రద్ధ మనస్కులు భక్తితో ఇచ్చిన దానిని నేను స్వీకరిస్తాను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.