గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, జులై 2022, శుక్రవారం

హన్త తే కథయిష్యామి దివ్యా...10 - 19...//...అహమాత్మా గుడాకేశ .10 - 120,,,//...శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు...విభూతియోగః‌

 జైశ్రీరామ్.

|| 10-19 ||

శ్లో.  హన్త తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః|

ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యన్తో విస్తరస్య మే.

తే.గీ. నాదు గొప్ప విభూతులన్ నీదు మదికి

వ్యక్త మగునట్లు తెల్పుదున్ బార్థ! వినుము,

నాదు విస్త్రుతి కంతనన్ లేదు కనగ

నీవు గ్రహియింపుమా, లసద్భావపూర్ణ!

భావము.

అర్జునా! నా దివ్య విభూతులలో ముక్యమైన వాటిని ఇప్పుడు నీకు 

చెబుతాను. నా విస్తారానికి అంతు అంటూ లేదు.

 || 10-20 ||

శ్లో.  అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః|

అహమాదిశ్చ మధ్యం చ భూతానామన్త ఏవ చ.

తే.గీ. అన్నిప్రాణుల హృదయాల నమరి యుందు 

నే ననుపమానుడా!పార్థుడా! నిత్యమెలమి,

నాదిమధ్యాంతముల్ నేనె, యందరికిని,

సృష్టి నాదిమధ్యాంతముల్ చెలగ నుంటి.

భావము.

గుడాకేశా! నేను అన్ని ప్రాణుల హృదయాలలో ఉంటాను.

 ప్రాణుల అది మధ్యంతాలు(సృష్టి స్థితి లయలు)నేనే.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.