గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, జులై 2022, బుధవారం

భూయ ఏవ మహాబాహో...10 - 1...//... న మే విదుః సురగణాః ప్రభవం...//...శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు...విభూతియోగః‌

 జైశ్రీరామ్

శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు...విభూతియోగః‌

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీ భగవానుడు ఇలా చెప్పాడు.

|| 10-1 ||

శ్లో.  భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః|

యత్తేऽహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా.

తే.గీ.  మహిత!పార్థుడా! నీవు నా మాటలకును

సంతసించుచుండుటజేసి సదయ నేను

పలుకు నా మాటలన్ విను వరలు నీకు

మేలు, సత్యంబునన్ కల్గు మేలు సతము.

భావము.

ఓమహానుభావా! అర్జునా! నా మాటలకు సంతోషిస్తున్న నీకు మేలు 

కలగాలని, నేను చెప్తున్న శ్రేష్టమైన ఈ మాటలు మళ్ళీ విను.

|| 10-2 ||

శ్లో.  న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః|

అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః.

తే.గీ.  దేవతలు ఋషులెరుగరు దివ్యమైన

నాదు జన్మంబు సంగతి,  నయనిధాన!

వారి కన్నను ముందె నే వరలి యుంటి,

జ్ఞాన పూర్ణులు గ్రహియింత్రు కలుగు నిజము. 

భావము.

నా పుట్టుకను గురించి దేవతలుకాని మహర్షులుకాని ఎరుగరు. 

దేవతలు మహర్షులు అందరికన్నా పూర్వపు వాణ్ణి నేను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.