గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జులై 2022, శుక్రవారం

పితాహమస్య జగతో ..|| 9-17 || . గతిర్భర్తా ప్రభుః సాక్షీ .. || 9-18 ||..//.. నవమోధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

 జైశ్రీరామ్.

 || 9-17 ||

శ్లో.  పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః|

వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవచ.

తే.గీ. జగతికినితల్లి తండ్రియు, ప్రగణితముగ 

కర్మ ఫలదాత, వేద్యము, కనగ నేనె,

నేనె ఋగ్యజుస్సామముల్ నేనె ప్రణవ

మోంకారమరయుమా, యుత్తమముగ. 

భావము.

ఈ జగత్తుకి తండ్రి,  తల్లి, కర్మఫల ప్రదాత, తెలియబడవలసినదీ, 

పవిత్రమైన ఓంకారమూ, ఋక్, సామ, యజుర్వేదాలు నేనే.

|| 9-18 ||

శ్లో.  గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్|

ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్.

తే.గీ.  నేనె గతి, భర్త, ప్రభువును, నేనె సాక్షి,

నేనె స్దానంబు వసియింప, నేనె శరణు,

నేనె యాప్తుడన్, నిధి నేనె, నేనె నవ్య

యమగు మూల హేతువు, నర్జునా! యరయుమీవు.

భావము.

నేను లక్ష్యమునూ, భరించేవాడిని, పాలించేవాడిని, అన్నిటికి సాక్షినీ, 

సర్వానికి నివాస స్తానాన్ని, అందరికి శరణ్యమును, ఆప్తుడిని, 

నేనే నిధినీ అవయమైన మూలకారణమూ.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.