గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జులై 2022, శుక్రవారం

అశ్రద్దధానాః పురుషా ..|| 9-3 || . మయా తతమిదం సర్వం .. || 9-4 ||..//.. నవమోధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

 జైశ్రీరామ్.

|| 9-3 ||

శ్లో.  అశ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య పరన్తప|

అప్రాప్య మాం నివర్తన్తే మృత్యుసంసారవర్త్మని.

తే.గీ.  ధర్మమునునమ్మ రో పరంతప! ధరిత్రి

కొందరట్టివారలు ననున్ మందమతులు

చేరబోవక  మృత్యుసంసారబాధ

లందుచున్ సంచరింతురు, బంధనముల.

భావము.

అర్జునా ఈ ధర్మంలో విశ్వాసం లేని పురుషులు నన్ను పొంద లేక 

మృత్యు సంసార మార్గం లోనే తిరుగుతున్నారు.

|| 9-4 ||

శ్లో.  మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా|

మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః.

తే.గీ. వ్యక్తమవనట్టి నాచేత వ్యాప్తమయ్యె

సృష్టి యంతయు,  జీవులు చేరి యుంద్రు

కనగ నా లోన, వారిలో కలుగబోను

నేను, నిజమిదే యర్జునా! జ్ఞాన భాస!

భావము.

ఈ జగత్తు యావత్తు అవ్యక్తంగా ఉండే నాచేత వ్యాపించబడి ఉన్నది. 

జీవులందరూ నాలో నిలిచి ఉన్నారు. అయితే నేను వాళ్ళలో లేను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.