గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జులై 2022, శుక్రవారం

అహింసా సమతా తుష్టిస్తపో...10 - 5...//... మహర్షయః సప్త పూర్వే...10 - 6,,,//...శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు...విభూతియోగః‌

జైశ్రీరామ్

|| 10-5 ||

శ్లో.  అహింసా సమతా తుష్టిస్తపో దానం యశోయశః|

భవన్తి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః.

తే.గీ.  అల యహింస, సమత్వము నపయశస్సు, 

యశము, దాన  తపస్సులు, నలరునట్టి

వివిధ భావముల్, తృప్తి, నే వెలయ జేయు

చుందునర్జునా! గ్రహియింపమందు నిన్ను.

భావము.

అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, యశస్సు, 

అపయశస్సు మొదలైన వేరు వేరు భావాలు జీవులలో నా వలననే కలుగుతాయి.

|| 10-6 ||

శ్లో.  మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా|

మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః.

తే.గీ.  నాదు సంకల్ప బలముచే మోదమలర

ఋషులు, మనువులుండిరి మున్నె సృష్టిలోన,

వారి వలననె కలిగిరి ప్రజలు భువిని, 

తెలియ నెంచిన నీకిది తెలియు పార్థ!

భావము.

సృష్టి ఆరంభంలో ఉన్న సప్త ఋషులు, నలుగురు మనువులు 

నా సంకల్పము వలన పుట్టిన వారే. వారి నుండి ఈ ప్రజలు వచ్చారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.