గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, జులై 2022, శనివారం

తపామ్యహమహం వర్షం ..|| 9-19 || .త్రైవిద్యా మాం సోమపాః . || 9-20 ||..//.. నవమోధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

 జైశ్రీరామ్

|| 9-19 ||

శ్లో.  తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ|

అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున.

తే.గీ.  నేనె తపమును, వర్షంబు నేనె కనగ, 

నేనె గ్రహియింతు సృజియింతు నేనె, వినుమ

నేనె మృతినిక నమృతంబు నేనె, వింటె?

నేనె మంచిని, చెడ్డయున్ నేనె పార్థ!

భావము.

ఓ అర్జునా! తపస్సు, వర్షము, గ్రహియించువాడిని, సృజించువాడిని, 

మృతి, ఆమృతము, మంచియు చెడ్డయు అన్నీ నేనే.

 || 9-20 ||

శ్లో.  త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా

యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయన్తే|

తే పుణ్యమాసాద్య సురేన్ద్రలోక-

మశ్నన్తి దివ్యాన్దివి దేవభోగాన్.

తే.గీ. వేదములు మూడు చదివిన విజ్ఞులఖిల

పాపదూరులికను సోమపానులు, మరి

యజ్ఞ కర్తలున్ నన్గొల్చి యరుగి స్వర్గ

సుఖములొందుదు రర్జునా! సుగుణ గణుడ!

భావము.

మూడు వేదాలనూ అధ్యనం చేసినవారు, సోమరసం త్రాగిన వారు. 

పాపాలను నిర్మూలించుకున్న పుణ్యాత్ములు నన్ను యజ్ఞాల ద్వారా 

పూజించి స్వర్గ వాసాన్ని కోరుకుంటారు. పుణ్య ఫలమైన ఇంద్ర లోకాన్ని 

పొంది, ఆ స్వర్గంలో దివ్య భోగాలను అనుభవిస్తారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.