గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జులై 2022, గురువారం

కథం విద్యామహం యోగిం...10 - 17...//...స్తరేణాత్మనో యోగం .10 - 18,,,//...శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు...విభూతియోగః‌

 జైశ్రీరామ్.

|| 10-17 ||

శ్లో.  కథం విద్యామహం యోగింస్త్వాం సదా పరిచిన్తయన్|

కేషు కేషు చ భావేషు చిన్త్యోసి భగవన్మయా.

తే.గీ.  యోగివైనట్టి నిన్ను నే నొప్పిదముగ

నెరుగుటెట్టుల ధ్యానినై?

నిన్నునేరూపములను ధ్యానింపవచ్చు?

తెలియ జెప్పుము కృపతోడ తెలుసుకొందు.

భావము.

ఓయోగీ! సదా ధ్యానిస్తూ నేను నిన్ను ఎలా తెలుసుకోగలను?

భగవంతుడా! ఏయేరూపాలతో నిన్ను ధ్యానించవచ్చు?

|| 10-18 ||

శ్లో.  విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన|

భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేమృతమ్.

ఓ జనార్దనా! తెల్పు నీ యోగ మరయ,

సద్విభూతిని కృపతోడ సరసిజాక్ష!

నీదు వాగమృతమదెంత నేను గ్రోలు

చున్న తృప్తియే కలుగదే సుజనపాల!  

భావము.

ఓజనార్ధనా! నీ యోగాన్ని విభూతిని విస్తారంగా చెప్పు. అమృతతుల్యమైన 

నీమాటలు ఎంత విన్నా నాకు తృప్తి కలుగదు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.