గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, జులై 2022, బుధవారం

మహాత్మానస్తు మాం పార్థ ..|| 9-13 || . సతతం కీర్తయన్తో మాం .. || 9-14 ||..//.. నవమోధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

జైశ్రీరామ్.

 || 9-13 ||

శ్లో.  మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః|

భజన్త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్.

తే.గీ.  పార్థ! దేవీప్రకృతిని, ప్రపంచమందు

భూతరాశికాదియగు నన్ పూర్తిగ కను

దురు, మహాత్ములు, సేవించుదురు సతంబు,

పూర్ ణమనములతోనొప్పి, మోదమునను.

భావము.

అర్జునా! మహాత్ములైతే దేవీ ప్రకృతిని, భూత రాశికి ఆది అయి 

నాశంలేని వాడిగా నన్ను తెలుసుకొని అనన్యమైన మనసుతో సేవిస్తారు.

 || 9-14 ||

శ్లో.  సతతం కీర్తయన్తో మాం యతన్తశ్చ దృఢవ్రతాః|

నమస్యన్తశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే.

తే.గీ.  వారు నన్ను కీర్తించుచున్ పరమ నిష్ట

కలిగి సాధన చేయుచున్ గౌరవముగ

వందనంబులు చేయుచు భక్తితోడ

నాకు, నుపవసింతురునన్ను శ్రీకరముగ.

భావము.

వారు ఎప్పుడూ నన్ను కీర్తిస్తూ, దృఢమైన నిష్టతో సాధన చేస్తూ, భక్తితో 

నాకు నమస్కరిస్తూ నిత్య యుక్తులై ఉపాసిస్తారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.