గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, ఏప్రిల్ 2018, మంగళవారం

గతికాద్వయ,కాఠిన్య,నరజయుగళీద్వయ,మూర్తిమంత,ప్రదితకీర్తి,కీర్తి ప్రద,రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.
గతికాద్వయ,కాఠిన్య,నరజయుగళీద్వయ,మూర్తిమంత,ప్రదితకీర్తి,కీర్తి ప్రద,
చక్కని,గర్భ పరార్ధకద్వయ వృత్తములు.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
    జుత్తాడ.

      -"పరార్ధక ద్వయ వృత్తములు.
ఉత్కృతిఛందము.న.ర.జ.న.ర.జ.న.ర.వృతగణములు.యతులు.10.19.
ప్రాసనీమముగలదు.

1.చదలకాపు!బీదవాడు!చదిర భూష!చక్కనయ్య! జగములేలు!నిస్వార్ధి?   పదిలకాని!సోదరుండు!ప్రదితకీర్తి?లోక నేత! వగపు బాపు!తండ్రీవు?
మదిని మెచ్చు?కొల్చి నంత?మధురమూర్తి!శ్రీగిరీశ?మగువ!గంగ!గౌరీశ!
 సుధలుజిమ్ము!జీవితాన!సొదలు దీర్చి!గావుమయ్య?సుగుణగణ్య!సర్వేశ!

చదలకాపు=శివుడు,చదిరభూష=నాగాభరణ,పదిలకాని=స్థితికరుని(విష్ణు
మూర్తిని),సుగుణగణ్య=సుగుణాత్మునిగా!లెక్కింపబడు.

2.చదిరభూష!చక్కనయ్య?చదలకాపు!బీదవాడు!జగములేలు!నిస్వార్ధి?
ప్రదితకీర్తి?లోకనేత! పదిలకాని!సోదరుండు? వగపు బాపు!తండ్రీవు?
మధుర!మూర్తి!శ్రీగిరీశ?మదిని మెచ్చు?కొల్చినంత?మగువ!గంగ!గౌరీశ!
సొదలు!తీర్చి!కావుమ్య?సుధలు జిమ్ము!జీవితాన!సుగుణగణ్య!సర్వేశ!

1.గర్భగత"-గతికా"-ద్వయ వృత్తములు.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.ప్రాసగలదు.

1.చదలకాపు!బీదవాడు!               2.చదిరభూష!చక్కనయ్య?
    పదిలకాని!సోదరుండు!                ప్రదిత కీర్తి?  లోకనేత!
   మదిని మెచ్చు?కొల్చినంత?          మథుర మూర్తి!శ్రీగిరీశ?
   సుధలు జిమ్ము!జీవితాన!             సొదలు దీర్చి!గావుమయ్య?

2.గర్భగత"-కాఠిన్య"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.గల.గణములు.వృ.సం.148.ప్రాసగలదు.
జగములేలు! నిస్వార్ధి!
వగపు బాపు!తండ్రీవు?
మగువ!గంగ! గౌరీశ!
సుగుణ గణ్య? సర్వేశ!

3.గర్భగత"-నరజ యుగళీ"-ద్వయ వృత్తములు.
ధృతిఛందము.న.ర.జ.న.ర.జ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.

1.చదల కాపు!బీదవాడు! చదిరభూష!చక్కనయ్య?
   పదిలకాని!సోదరుండు! ప్రదిత కీర్తి?లోక నేత!
  మదిని మెచ్చు?కొల్చినంత? మధుర మూర్తి!శ్రీగిరీశ?
  సుధలు జిమ్ము!జీవితాన! సొదలు దీర్చి!గావుమయ్య!

2.చదిర భూష!చక్కనయ్య? చదలకాపు!బీదవాడు!
   ప్రదిత కీర్తి?లోక నేత! పదిలకాని!సోదరుండు!
  మథుర మూర్తి!శ్రీగిరీశ?మదిని మెచ్చు?కొల్చినంత?
  సొదలు దీర్చి!గావు మయ్య!సుధలు జిమ్ము?జీవితాన!

4.గర్భగత"-మూర్తిమంత"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.న.ర.గల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చదిర భూష!చక్కనయ్య?జగము లేలు?నిస్వార్ధి!
ప్రదిత కీర్తి?లోకనేత!  వగపు!బాపు తండ్రీవు?
మథుర మూర్తి!  శ్రీగిరీశ?  మగువ,గంగ!గౌరీశ?
సొదలు దీర్చి!గావు మయ్య?సుగుణగణ్య!సర్వేశ?

5.గర్భగత"-ప్రదిత కీర్తి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.న.ర.భ.స.జ.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
చదిరభూష!చక్కనయ్య?జగములేలు?నిస్వార్ధి!చదలకాపు!బీదవాడు!
ప్రదిత కీర్తి?లోకనేత! వగపు బాపు తండ్రీవు?పదిలకాని! సోదరుండు!
మథుర మూర్తి!శ్రీగిరిశ?మగువ గంగ గౌరీశ?మదిని మెచ్చు!కొల్చినంత?
సొదలు దీర్చి!గావు మయ్య?సుగుణగణ్య!సర్వేశ?సుథలుజిమ్ము!జీవితాన!

6.గర్భగత"-కీర్తిప్రద"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.భ.స.జ.గల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జగములేలు? నిస్వార్ధి! చదలకాపు!బీదవాడు?
వగపు బాపు తండ్రీవు?పదిలకాని!సోదరుండు!
మగువగంగ! గౌరీశ?మదిని మెచ్చు?కొల్చినంత?
సుగుణ గణ్య!సర్వేశ? సుధలు జిమ్ము?జీవితాన

7.గర్భగత"-చక్కని"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.భ.స.జ.భ.స.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
జగములేలు?నిస్వార్ధి!చదలకాపు!బీదవాడు?చదిర భూష!చక్కనయ్య?
వగపుబాపు!తండ్రీవు?పదిలకాని!సోదరుండు!ప్రదిత కీర్తి?లోక నేత?
మగువ గంగ!గౌరీశ?మదిని మెచ్చు?కొల్చినంత?మధురమూర్తి!శ్రీగిరీశ?
సుగుణగణ్య!సర్వేశ?సుధలు జిమ్ము?జీవితాన?సొదలుదీర్చి!గావుమయ్య?
 స్వస్తి


మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చదల కాపు బీదవాడు
పదిల కాని సోదరుండు
అన్ని పద్యములు అలరించు చున్నవి
గురువులకు శిరసాభి వందనములు . శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.