గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఏప్రిల్ 2018, శనివారం

బదరికా,భానుజ,శ్రీనామ,జన్మనీ,పూజిత,ఉత్తమజన్మ,పొత్తుల,ఒద్దుగ,సుబోధ,బుద్ధినా,గర్భ-"పురుషార్ధతా"-వృత్తము. రచన:- శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.
బదరికా,భానుజ,శ్రీనామ,జన్మనీ,పూజిత,ఉత్తమజన్మ,పొత్తుల,ఒద్దుగ,సుబోధ,బుద్ధినా,గర్భ-
"పురుషార్ధతా"-వృత్తము.
రచన:- వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
 జుత్తాడ.

                -"పురుషార్ధతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.భ.భ.స.జ.భ.స.గగ.గణములు.యతులు.10,19,
ప్రాసనీమముగలదు.

ఉత్తమ నర జన్మంబిది?ఒద్దుగ పదిమంది మేలు?ఉన్నతి కలిగించున్గా?
సత్తతు లలరారంజను!సద్ధర మథుసూదనంబు?జన్నము ఫలదంబౌగా?
పొత్తులు పురుషార్ధంబులు!బుద్ధియె?సరిబోధ ధాత్రి!పున్నమి వెలుగౌ?జీవా!
చిత్తము సుర శ్లోక్యంబవ?సిద్ధియె గద?శుద్ధినెంచ?చెన్నది?పరిపూర్ణంబౌ?తథై
అర్ధము.
ఒద్దుగ=కుద్దిరముగ,సత్=సత్యము,తత్=ఆపరబ్రహ్మస్వరూపము,
పురుషార్ధంబులు=ధర్మార్ధ కామమోక్షములు.బుద్ధి=సద్బుద్ధి(మంచినడవడి)
చెన్ను+అదిచెన్నది=అదియేమనోహర(విలాస)మదియే!
భావము:-జన్మలలో నరజన్మ ముత్తమమైనది.కుద్దిరముగ,పదిమంది మేలు
కోరిన,ఉన్నతి చేకురును.సాటి మానవులయెడ స్నేహభావము,(ధర్మార్ధకామ
 మక్షములు),బుద్ధియేసరియైనబోధ.అదియే షోడశ కళాత్మకమైన,,నిండుపూర్ణిమవెలగై జీవికి స్వచ్ఛతజేకూర్చి వెలుగునింపును.
స్వచ్ఛమైన తెలుపు వర్ణముగల శివుడు!నిష్కల్మషుడుకోరిన కోర్కెలు దీర్చును.మనస్సుభగవంతుని స్తుతి పాత్రమైన సిద్ధతయే శుద్ధిగా నెంచబడును.పూర్ణత చేకూర్చెడి పద్ధతియే విలాసము.ఆవిలాసమే సత్.
తత్=ఆపరమాత్మ .యలరారునట్లు చరించుము.సన్మార్గము స్థిరమైనది.
స్థితికరముయాగఫలమదే!కదా!మానవబోధామృతము.

1.గర్భగత"-బదరికా"-వృత్తము.
బృహతీఛందము.భ.స.భ.గణములు.వృ.సం.415.ప్రాసగలదు.
ఉత్తమ నర జన్మం బిది?
సత్తతు లలరారం జను?
పొత్తులు పురుషార్ధంబులు!
చిత్తము సుర శ్లోక్యంబవ?

2.గర్భగత"-భానుజ"-వృత్తము.
బృహతీఛందము.భ.స.జ.గణములు.వృ.సం.383.ప్రాసగలదు.
ఒద్దుగ పదిమంది మేలు?
సద్ధర మథు సూదనంబు?
బుద్ధియె?సరి బోధ ధాత్రి!
సిద్ధియె?గద! నెంచ?శుద్ధి?

3.గర్భగత"-శ్రీనామ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.స.గగ.గణమలు.వృ.సం.31.ప్రాసగలదు.
ఉన్నతి ! కలిగించున్గా
జన్నము!ఫలదంబౌ?
పున్నమి!వెలుగౌ!జీవా?
చెన్నది?పరిపూర్ణంబౌ?

4.గర్భగత"-జన్మనీ"-వృత్తము.
ధృతిఛందము.భ.స.భ.భ.స.జ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఉత్తమ నర జన్మం బిది?ఒద్దుగ పదిమంది మేలు!
సత్తతు లలరారంజను?సద్ధర మథుసూదనంబు?
పొత్తులు పురుషార్ధంబులు?బుద్ధియె? సరిబోధ!ధాత్రి!
చిత్తము సుర శ్లోక్యంబవ? సిద్ధియె?గద!శుద్ధి నెంచ?

5.గర్భగత"-పూజిత"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.స.భ.భ.స.గగ..గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఒద్దుగ పదిమంది మేలు?ఉన్నతి కలిగించున్గా?
సద్ధర మధు సూదనంబు? జన్నము ఫలదంబౌగా?
బుద్ధియె?సరి బోధ!ధాత్రి?పున్నమి వెలుగౌ?జీవా!
సిద్ధియె గద? శుద్ధి నెంచ?చెన్నది? పరిపూర్ణంబౌ!

6.గర్భగత"-ఉత్తమజన్మ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.జ.భ.స.మ.న.య.లల.గణములు.యతులు.10,18.ప్రాసనీమముగలదు.
ఒద్దుగ పదిమంది మేలు?ఉన్నతి కలిగించున్గా?ఉత్తమ నర జన్మంబిది?
సద్ధర మథుసూధనంబు?జన్నము ఫలదంబౌగా?సత్తతు లలరారం?జను?
బుద్ధియె?సరిబోధ ధాత్రి!పున్నమి వెలుగౌ?జీవా!పొత్తులు పురుషార్ధంబులు?
సిద్ధియెగద?శుద్ధి నెంచ? చెన్నది పరిపూర్ణంబౌ?చిత్తము!సుర శ్లోక్యంబవ?

7.గర్భగత"-పొత్తుల"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.స.భ.మ.న.య.లల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఉన్నతి!కలిగించున్గా?ఉత్తమ నరజన్మంబిది?
జన్నము ఫలదంబౌగా?సత్తతు లలరారంజను?
పున్నమి వెలుగౌ?జీవా! పొత్తులు పురుషార్ధంబులు?
చెన్నది !పరిపూర్ణంబౌ?చిత్తము సుర శ్లోక్యంబవ?

8.గర్భగత"-ఒద్దుగ"-వృత్తము.
ఉత్కృతి ఛందము.భ.స.మ.న.య.స.న.జ.గల.గణములు.యతులు.9,18.
కలిగగించున్గ
ఉన్నతి కలిగించున్గా?ఉత్తమ నర జన్మంబిది?ఒద్దుగ పదిమందిమేలు!
జన్నము ఫలదంబౌగా?సత్తతు లలరారం జను?సద్ధర!మథుసూదనంబు?
పున్నమి వెలుగౌ?జీవా!పొత్తులు!పురుషార్ధంబులు?బుద్ధియె!సరిబోధ!ధాత్రి
చెన్నది?పరిపూర్ణంబౌ!చిత్తము సుర శ్లోక్యంబవ?సిద్ధియె గద?శుద్ధి నెంచ?

9.గర్భగత"-సుబోధ"-వృత్తము.
ధృతిఛందము.భ.స.జ.భ.స.భ.గణములు.యతి.10,వయక్షరము.
ప్రాసనీమముగలదు.
ఒద్దుగ పదిమంది మేలు!ఉత్తమ నర జన్మంబిది?
సద్ధర!మథుసూదనంబు?సత్తతు లలరారంజను?
బుద్ధియె!సరిబోధ ధాత్రి?పొత్తులు పురుషార్ధంబులు?
సిద్ధియె గద? శుద్ధి నెంచ?చిత్తము సురశ్లోక్యంబవ?

10.గర్భగత"-బుద్ధినా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.జ.భ.స.భ.భ.స.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
ఒద్దుగ పదిమంది మేలు?ఉత్తమ నర జన్మంబిది? ఉన్నతి!కలిగించున్గా?
సద్ధర?మథుసూదనంబు!సత్తతు లలరారంజను?జన్నము!ఫలదంబౌగా?
బుద్ధియె!సరిబోధ ధాత్రిపొత్తులు!పురుషార్ధంబులు?పున్నమి!వెలుగౌ?జీవా!
సిద్ధియె గద?శుద్ధి నెంచ?చిత్తము సురశ్లోక్యంబవ?చెన్నది?పరిపూర్ణంబౌ!

 స్వస్తి.
మూర్తి. జుత్తాడ.
 జైహింద్
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సరస్వతీ పుత్రులకు ప్రణామములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.