గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, ఏప్రిల్ 2018, గురువారం

భత్రసా,ఉత్సుక,మార్గగామినీ,గురుప్రోక్త,ఉత్తమా,సద్వర,సభాయనమః,జగన్మేలు,చిదంబర,సచ్ఛిత్,గర్భ -"శోభాయమాన"-వృత్తము.రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

 జైశ్రీరామ్.
భత్రసా,ఉత్సుక,మార్గగామినీ,గురుప్రోక్త,ఉత్తమా,సద్వర,సభాయనమః,జగన్మేలు,చిదంబర,సచ్ఛిత్,గర్భ -"శోభాయమాన"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                                                       జుత్తాడ.
        
"-శోభాయమాన"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.త.స.భ.భ.ర.న.మ.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
సద్వర చిత్సంభరితమౌ?సద్గురు ప్రోక్తము నుత్తమై!జగతికిన్మేల్మేలగున్?
సద్వశ బోధామృత మిలన్?సద్గుణ గణ్యమగున్గదే?స్వగమ తీరున్మార్చుగా!
విద్వర కీర్తిం!శుభగమై!విద్గుణ లోకముతీరునున్వెగటగుం?దుశ్చింతలున్?
ఉద్వహ!శోభాయత గనుం?ఉద్గుణ మేర్చును!సర్వమున్నోగిర!పూర్ణంబౌ?
రసన్?

భావము:-శ్రేష్టతావాచియు,పరబ్రహ్మ! స్వరూపమగు సత్యముతో నిండిన
చిత్తము గల, సద్గురు ప్రోక్తము ఉత్తమమై జగతికి మేలుజేకూర్చును."సత్"
తోకూడిన బోధామృతము!ధాత్రినిగుణవంతమైన లెక్కగానడుపును.మానవ
నైజిక దుశ్చింతలు తొలగించును.అవినీతిచైదములతీరు మార్చి,శోభాయ మానమగుచు"ధనంమూలమిదంజగత్తనే!దుశ్చింతాయుత తీరునకు వెగటు
గల్గించును.శోభాయుతమై!కల్యాణ ప్రదమై!మహత్తర!శుభ గుణము,సమస్త
జీవజాలమునకు భుక్త ప్రపూర్ణత!  జేకూర్చును.

1.గర్భగత"-భత్రసా"-వృత్తము.
బృహతీఛందము.భ.త.స.గణములు.వృ.సం.231.ప్రాసగలదు.
సద్వర చిత్సంభరితమౌ
సద్వశ బోధామృతమిన్?
విద్వర కీర్తిం!శుభగమై!
ఉద్వహ శోభాయత!గనున్!

2.గర్భగత"-ఉత్సుక"-వృత్తము.
బృహతీఛందము.భ.భ.ర.గణములు.వృ.సం.183.ప్రాసగలదు.
సద్గురు ప్రోక్తము నుత్తమై!
సద్గుణగణ్య మగున్గదే?
విద్గుణ లోకము తీరునున్?
ఉద్గుణ మేర్చును సర్వమున్!

3.గర్భగత"-మార్గగామినీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.మ.లగ.గణములు.వృ.సం.72.ప్రాసగలదు.
జగతికిన్మేల్మేలగున్?
స్వగమ తీరున్మార్చుగా?
వెగటగున్దుశ్చింతలున్?
ఓగిర పూర్ణంబౌ?రసన్!

4.గర్భగత"-గురు ప్రోక్త"-వృత్తము.
ధృతిఛందము.భ.త.స.భ.భ.ర.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాస నీమముగలదు
సద్వర చిత్సంభరితమౌ?జగతికిన్మేల్మేలగున్?
సద్వశ బోధామృతమిలం?సద్గుణ గణ్య మగుం కదే?
విద్వర కీర్తిం!శుభగమై?విద్గుణ లోకము తీరునున్?
ఉద్వహ శోభాయత!గనుం?ఉద్గుణ మేర్చుం?సర్వమున్?

5.గర్భగత"-ఉత్తమా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.ర.న.మ.లగ.గణములు.యతి.10.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
సద్గురు ప్రోక్తము నుత్తమై?జగతికిన్మేల్మేలగున్?
సద్గుణ గణ్యమగున్గదే?స్వగమ తీరున్మార్చుగా?
విద్గుణ లోకము తీరునుంవెగటగున్దుశ్చింతలున్?
ఉద్గుణ మేర్చును!సర్వమున్నోగిర పూర్ణంబౌరసన్?

6.గర్భగత"-సద్వర"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.న.మ.య.స.భ.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
సద్గురు ప్రోక్తము నుత్తమై!జగతికిన్మేల్మేలగున్?సద్వర చిత్సంభరితమౌ?
సద్గుణగణ్య మగున్గదే!స్వగమ తీరున్మార్చుగా?సద్వశ బోధామృతమిలన్?
విద్గుణలోకముతీరునున్వెగటగుం?దుశ్చింతలున్విద్వర!కీర్తిం!శుభగమై?
ఉద్గుణ మేర్చును!సర్వమున్నోగిర!పుర్ణంబౌ?రసన్నుద్వహ!శోభాయత!గనునన్?

7.గర్భగత"-సభాయనమః"-వృత్తము.
అత్యష్టీఛందము.న.మ.య.స.భ.లగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జగతికిం!మేల్మేలగుం? సద్వర! చిత్సంభరితమౌ?
స్వగమ తీరున్మార్చుగా?సద్వశబోధధామృత!మిలన్?
వెగటగున్?దుశ్చింతలున్?విద్వర కీర్తిం?శుభగమై!
ఓగిర పూర్ణంబౌ? రసం! ఉద్వహ ! శోభయత?గనున్!

8.గర్భగత"-జగన్మేలు-వృత్తము.
ఉత్కృతిఛందము.న.మ.య.స.భ.య.స.స.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
జగతికిం!మేల్మేలగుం?సద్వర చిత్సంభరితమౌ?సద్గురు!ప్రోక్తము!నుత్తమై?
స్వగమ!తీరుంమార్చుగా!సద్వశ !బోధామృత మిలం?సద్గుణగణ్యమగుంగదే!
వెగటగుం?దుశ్చింతలుం?విద్వర!కీర్తిం!శుభగమై!విద్గుణ!లోకము తీరునున్?
ఓగిర!పూంబౌ?రసం!ఉద్వహ శోభాయత?గనుం?ఉద్గుణమేర్చును!సర్వమున్?

9,గర్భగత"-చిదంబర"-వృత్తము.
ధృతిఛందము.భ.భ.ర.భ.త.స.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
.సద్గురు ప్రోక్తము!నుత్తమై?సద్వర!చిత్సంభరితమౌ?
సద్గుణ గణ్య మగుంగదే?సద్వశ!బోధామృతమిలన్?
విద్గుణ లోకము తీరునుం?విద్వర కీర్తిం?శుభగమై!.
ఉద్గుణ మేర్చును!సర్వముం?ఉద్వహ!శోభాయత!గనున్?

10.గర్భగత"-సచ్ఛిత్"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.భ.త.స.న.మ.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
సద్గుణ ప్రోక్తము!నుత్తమై?సద్వర!చిత్సంభరితమౌ?జగతికింమేల్మేలగున్?
సద్గుణ గణ్యమగుంగదే?సద్వశ!బోధామృతమిలం?స్వగమ!తీరున్మార్చుగా?
విద్గుణ లోకము తీరునుం?విద్వర కీర్తిం!శుభగమైవెగటగుం!దుశ్చింతలున్?
ఉద్గుణమేర్చును!సర్వముం?ఉద్వహ!శోభాయత!గనుం?ఓగిర!పూర్ణంబౌ?
రసన్!
 స్వస్తి.


మూర్తి. జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.