గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, ఏప్రిల్ 2018, శుక్రవారం

గతికాద్వయ,సమాశ్రీ,నరజయుగళీద్వయ,అంతఃకరణ,రూపసీ,దుశ్చర్య, రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.
గతికాద్వయ,సమాశ్రీ,నరజయుగళీద్వయ,అంతఃకరణ,రూపసీ,దుశ్చర్య,
చదలకీర్తి,గర్భ -"విధానీ"-ద్వయవృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                                                  జుత్తాడ.

          -"విధానీ"-ద్వయవృత్తములు.
ఉత్కృతిఛందము.న,ర.జ.న.ర.జ.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.

1,విధి విధాన మెంచరైరి?విమల రూప!విశ్వనాధ!వేగ!మార్చు!లోకతీరు?
  పదిలబుద్ధిలేదు?చూడ!భ్రమల దేలియాడు చుండి?వాగధీశు!నెంచరైరి?
  కదియనోపరేల?మంచి!కమల  నెంచెడూహ తప్ప?కాగలట్టి?తీరుమార్చి!
  చదల కీర్తి గాములంచుశ్రమ విదూర ద్రవ్య మెంచి?స్వాగతించి!దుష్టచర్య?

వాగధీశు=వాగోద్భవకర్త !శివుని,కమల=లక్ష్మి(ధనము)కాగలట్టితీరు=అవగల
విధానమును,చదల కీర్తిగాములు=మిన్నంటెడుకీర్తినాకాంక్షించు,శ్రమవిదూర=
శ్రమపడని,
2.విమలరూప!విశ్వనాధ!విధి విధాన మెంచరైరి?వేగ మార్చు లోకతీరు?
   భ్రమల దేలియాడుచుండి?పదిలబుద్ధిలేదు?చూడ!వాగధీశు!నెంచరైరి?
  కమల నెంచెడూహతప్ప?కదియనోపరేల?మంచి!కాగలట్టితీరు?మార్చి?
  శ్రమవిదూర!ద్రవ్యమెంచి?చదల కీర్తి గాములంచు?స్వాగతించి!దుష్టచర్య?

2.గర్భగత"-గతికా"-ద్వయవృత్తములు.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.ప్రాసగలదు.
1.విధి విధాన మెంచరైరి?              2.విమల రూప!విశ్వనాధ!
   పదిల బుద్ధి లేదు?చూడ!              భ్రమల దేలియాడుచుండి?
  కదియనోపరేల?మంచి!                 కమల!నెంచెడూహ తప్ప?
  చదల కీర్తిగాములంచు?                శ్రమ విదూర ద్రవ్యమెంచి?

3.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
వేగమార్చు! లోక తీరు?
వాగధీశు!నెంచరైరి?
కాగలట్టి తీరు మార్చి?
స్వాగతించి!దుష్టచర్య?

4.గర్భగత"-నరజయుగళీ"-ద్వయవృత్తములు.
ధృతిఛందము.న.ర.జ.న.ర.జ.గణములు.యతి.10.వ.యక్షరము.ప్రాసగలదు.
1,విధి విధాన మెంచరైరి?విమల రూప ! విశ్వనాధ!
పదిలబుద్ధి లేదు?చూడ!భ్రమల దేలియాడు చుండి?
కదియనోపరేల?మంచి!కమల నెంచెడూహ తప్ప?
చదల కీర్తి గాములంచు?శ్రమ విదూర ద్రవ్య మెంచి?

2.విమలరూప!విశ్వనాధ!విధి విధాన! మెంచరైరి?
భ్రమల దేలియాడు చుండి?పదిలబుద్ధి లేదు?చూడ!
కమల నెంచెడూహ తప్ప?కదియ నోపరేల?మంచి!
శరమ వదూర ద్రవ్య మెంచి?చదల కీర్తి గాములంచు?

5.గర్భగత"-అంతఃకరణ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.ర.జ.గల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
విమల రూప!విశ్వనాధ! వేగ మార్చు!లోక తీరు?
భ్రమల దేలియాడుచుండి?వాగధీశు!నెంచరైరి?
కమల నెంచు?నూహ తప్ప?కాగలట్టి!తీరు మర్చి?
శ్రమ విదూర ద్రవ్య మెంచి?స్వాగతించి!దుష్ట చర్య?

6.గర్భగత"-రూపసీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.జ.భ.స.జ.గల.గణములుయతులు.10,18.
ప్రాసనీమముగలదు.
విమల రూప!విశ్వనాధ!వేగ మార్చు?లోకతీరు!విధి విధాన మెంచరైరి?
భ్రమల దేలియాడుచుండి?వాగధీశు నెంచరైరి?పదిలబుద్ధి లేదు?చూడ!
కమల నెంచెడూహ!తప్ప?కాగలట్టితీరు!మర్చి?కదియనోపరేల?మంచి!
శ్రమ విదూర ద్రవ్యమెంచి?స్వాగతించి!దుష్ట చర్య?చదలకీర్తి గాములంచు?

7.గర్భగత"-దుశ్చర్య"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.స.జ.గల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
వేగమార్చు!లోకతీరు?విధి విధాన మెంచరైరి?
వాగధీశు!నెంచరైరి?పదిల బుద్ధి లేదు?చూడ!
కాగలట్టి?తీరు మర్చి!కదియ నోపరేల?మంచి!
స్వాగతించి!దుష్టచర్య?చదల కీర్తిగాములంచు?

8.గర్భగత"-చదలకీర్తి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.స.జ.భ.స.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
వేగమార్చు?లోకతీరు!విధి విధాన మెంచరైరి?విమల రూప!విశ్వనాధ!
వాగధీశు!నెచరైరి?పదిల బుద్ధిలేదు?చూడ!భ్రమల దేలియాడు చుండి?
కాగలట్టి!తీరు మర్చి?కదియ నోపరేల?మంచి!కమల!నెంచెడూహ!తప్ప?
స్వాగతించి!దుష్టచర్య?చదల కీర్తిగాములంచు?శ్రమ విదూర ద్రవయమెంచి?
 
ఇట్లు.
తమవిశవసనీయుడు.
మూర్తి. జుత్తాడ.
 జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సరస్వతీ పుత్రులకు ప్రణామములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.