గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జనవరి 2018, గురువారం

బ్రహ్మశ్రీ వల్లభవఝల అప్పల నరసింహమూర్తి కవిని గూర్చిన అభినందన .. .. .. M.s.s.n.మూర్తి.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! 
నూతన ఛందముల ననేకములనావిష్కరించిన
 సుప్రసిద్ధ బ్రహ్మశ్రీ వల్లభవఝల అప్పల నరసింహమూర్తి కవిని గూర్చిన
అభినందన
భాషాప్రవీణ.
M.s.s.n.మూర్తి.
ఎంఏ.తెలుగు.ఎంఏ.సంస్కృతము.
శ్రీకాకుళం.
సాహితీవల్లభులు, ఒజ్జల మిన్న, ఛంద స్సింహం
సాహితీ వల్లభ, వఝల అప్పల నరసింహ మూర్తి గారికి
అభినందనమందారం
ఛందోబంధువూ,కవితా సింధువూ - - - - - - -

సాహితీవల్లభులు, ఒజ్జల మిన్న, ఛంద స్సింహం(శ్రీ వల్లభ వఝల అప్పల
నరసింహ మూర్తి గారు స్వచ్ఛందంగా విరచించిన ఛందశ్శాస్త్ర శిఖరాయమాణ
గ్రంధ రాజం "శ్రీవల్లభేయ ఛందోమధనమం"-అత్యంతప్రసశంస నీయంగా ఉంది. వారికి భక్తి పూర్వక నమోవాకములు.
     శ్లో:--"శిక్షా, వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తధా
             కల్పశ్చేతి  షడంగాని వేద స్యాహు ర్మనీషిణః"-
అని ఆరు వేదాంగాలు చెప్పబడ్డాయి. వాటిఛందశ్శాస్స్త్రం కూడ మూడవదిగా ఉంది. ఇది కూడ ఒక ప్రభావమైన వేదాంగం అన్నమాట.
అది ఓ మహా సముద్రం అని భావిస్తే, దాన్ని మధించిన ఈ మూర్తి రరమహాశయులు, మంధర పర్వత మన్న మాట.
          అలా ఛందశ్శాస్త్రముమీద విస్తారమైన పరిశోధన ఎన్నోసంవత్సరాలపాటు చేసి,విశిష్టమైన ఈ కృతిని వెలయించిన వేదవేత్త
శ్రీ మూర్తిగారు. ఛందశ్శాస్త్రానికే ఎనలేని మేలు చేశారు. ఈ రచనతో పోలిస్తే
మనసంస్కృతాఅంధ్రపూర్వఛందః కర్తలు చెప్పిన,ఆయా ఛందస్సులు,వాటికి
సంబంధించిన వివిధ వృత్తాలు చాలా పరిమిత మైనవి. వాటితోనే మన పద్య
సారస్వతం, ఎంతెంతో విరివియై విపులమై విలసిల్లి,ఆయా మహాకవీంద్రుల
చేతుల్లో దివ్యాతి దివ్యమైన వైభవంతో, ప్రాభవంతో,వెయ్యేళ్ళు  పైబడి పరిఢ
విల్లింది. అలాంటిది, నేటియీ ఛాందస ప్రవణైక మతి  శ్రీ మూర్తిగారి బృహత్కృషితో, ప్రభవించిన ఈమాకృతితో,ఛందస్సు విశ్వరూపం,విరాడ్రూపం
ధరించి,అవధులూ,పరిధులూ లేనిదై,అసంఖ్యాకం,అమేయం అయింది.
లెక్కకు మిక్కిలిగా,ఆయా ఛందస్సుల్లో,నేటి కవులూ,అవధానులూ,
పరరరచనవిస్తృతంగాస!సాగవచ్చు. మరెన్నో మహాద్భుతాలు,సాధింపవచ్చు.
సారస్వతవికాశసం నవ్యాతి నవ్యమై,ఈఛందఃకృతషి,రచనతో మరింతగా
కొనసాగుతుందని, శ్రీ మూర్తిగారి నిరుపమ కృషి ఈ పుస్తకం రూపంలో
అవశ్యం జైవాతృక మవుతుందని, మనమందరం ఆశిద్దాం
                
నిజానికి శాస్త్ర విషయికమైన యింత అవిరామమైనకృషికీ, సాధనకూ వారిని ఎంతగా ప్రశంసించినా అది అతిశయోక్తి కానేరదు.
అభినందనలతో
ఎం.యస్.యస్.ఎన్.మూర్తి.
ఇంతటి ప్రశంసార్హమైన కృషి చేసి నూతన ఛందో మార్గనిర్మాతలు శ్రీమాన్ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తిగారికి నా మనః పూర్వక అభినందనలు.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ప్రణామములు
శ్రీ వల్లభవఝుల నరసిం హ మూర్తిగారికి హృదయపూర్వక అభినందన మందారములు . శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

Malli siripuram చెప్పారు...

శ్రీవల్లభవఝుల నరసింహ మూర్తిగార్కి హృదయపూర్వక నమస్కారములు.
మరియు చింతా రామకృష్ణ రావు గార్కి నమస్కారములు.
ఈ గ్రంధము లభ్యమైనచో పంపంగలరు.తగిన మూల్యము ను సమర్పించుకో గలవాడను.
సదా మీయొక్క ఆశీస్సులను సూచనలను కోరేటి

మల్లి సిరిపురం. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి.
సిరిపురపు నాగమల్లిఖార్జునశర్మ,
శ్రీ శారదా జ్యోతిషాలయం,
శ్రీశైలం ప్రాజెక్టు పోస్టు.
కర్నూలు జిల్లా.
ఆంధ్రప్రదేశ్,
పిన్ కోడ్ నెంబర్ : 518102.
ఫోన్ నెంబర్ 9441193087.ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.